Indian Railways: ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే రైల్వే క్లాస్ ల అప్ గ్రేడేషన్ పథకాన్ని సవరించింది. స్లీపర్, ఏసీ కోచ్ లతో పాటు రైళ్లలో ఇకపై విస్టాడోమ్ కోచ్‌లు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విస్టాడోమ్ నాన్-ఎసి, విస్టాడోమ్ కోచ్, ఎగ్జిక్యూటివ్ అనుభూతి, థర్డ్ AC ఎకానమీ, 3E క్లాస్ లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. “రైలులో అందుబాటులో వసతిని వినియోగించుకునేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. పూర్తి ఛార్జీలు చెల్లించే ప్రయాణీకులను ఈ పథకం అమలు అవుతుంది. ప్రస్తుతం, ఈ పథకం సిట్టింగ్ వసతి ఉన్న రైళ్లతో పాటు అన్ని రకాల రైళ్లలో అందుబాటులో ఉంది” అని రైల్వేశాఖ తన సర్క్యులర్ లో వెల్లడించింది.
కొత్త విస్టాడోమ్ క్లాస్ లు
విస్టాడోమ్ రైళ్లలోనూ ఈ పథకాన్ని అమలు చేయబోతోంది. విస్టాడోమ్ నాన్-ఎసి (VS), విస్టాడోమ్ కోచ్ (EV), ఎగ్జిక్యూటివ్ అనుభూతి (EA), 3E ప్రకారం అప్ గ్రేడేషన్ పథకం వర్తించేలా నిర్ణయం తీసుకుంది. తాజా సర్క్యులర్ ప్రకారం, లోయర్ క్లాస్ నుంచి హయ్యర్ క్లాస్ వరకు సీట్లు అప్ గ్రేడ్ అవుతాయి. 2S (సెకెండ్ సీటింట్ క్లాస్), VS, CC (చైర్ కార్), EC (ఎగ్జిక్యూటివ్ క్లాస్), EV, EA వరుస క్రమంలో సీట్లు అప్ గ్రేడ్ అవుతాయి. అటు స్లీపింగ్ అప్‌గ్రేడేషన్ కోసం స్లీపర్ క్లాస్ (SL), 3E, థర్డ్ ఎసి (3A), 2AC (2A), AC ఫస్ట్ క్లాస్ (1A) ప్రకారం అప్ గ్రేడ్ అవుతాయి. “అప్‌గ్రేడేషన్ అనేది కింది నుంచి పైకి రెండు క్లాస్ ల వరకు వర్తిస్తుంది. ఇవి ఒక నిర్దిష్ట రైలులో అందుబాటులో ఉంటాయి, 1A, ఎగ్జిక్యూటివ్ క్లాస్ (EC, EV, EA)లో అప్ గ్రేడేషన్ దిగువ తరగతి నుంచి మాత్రమే పరిమితం చేయబడుతుంది. అంటే, 1A, 2A, EC/EV/EAకి మాత్రమే పరిమితం అవుతుందని తెలిపింది.
పూర్తి ఛార్జీతో టికెట్ బుక్ చేసుకున్న వాళ్లే అర్హులు
అటు ఇండియన్ రైల్వే భవిష్యత్తులో ప్రారంభించే ఏదైనా కొత్త తరగతిని అప్ గ్రేడేషన్ పథకం కింద చేర్చడానికి కూడా సర్క్యులర్ లో నిబంధనలు పొందుపరిచింది. “భవిష్యత్తులో ఏదైనా కొత్త తరగతి ప్రవేశపెట్టబడితే, ఛార్జీల ఆధారంగా అప్‌గ్రేడేషన్ తదుపరి రెండు స్థాయిల వరకు ఉంటుంది” అని వెల్లడించింది. పూర్తి ఛార్జీతో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులందరూ ఈ అప్ గ్రేడ్ కు అర్హులు అవుతారని తెలిపింది. సీనియర్ సిటిజన్/లోయర్ బెర్త్ కోటాల కింద బుక్ చేసుకుంటున్న పూర్తి ఛార్జీ చెల్లించే ప్రయాణీకులు, అప్ గ్రేడేషన్ ఎంపికను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించింది. ఒకవేళ అలాంటి ప్రయాణీకులు అప్‌గ్రేడేషన్‌ను ఎంచుకుంటే, పై తరగతిలో, లోయర్ బెర్త్ లభిస్తుందనే గ్యారెంటీ లేదని వెల్లడించింది. CRIS (సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్) కొత్త అప్ గ్రెడేషన్ పథకానికి అనుగుణంగా సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేయాలని రైల్వేశాఖ ఆదేశించింది.
ఇక టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఆటో-అప్‌గ్రేడేషన్‌ను ఎంచుకునే ప్రయాణీకులను మాత్రమే ఈ పథకం కింద పరిగణలోకి తీసుకుంటామని రైల్వే అధికారులు వెల్లడించారు. 3A వెయిటింగ్ ప్యాసింజర్ ఆటో అప్‌గ్రేడేషన్‌ను ఎంచుకుంటే, 2A తరగతికి ప్రయాణీకుల వెయిటింగ్ లిస్ట్ లేనట్లయితే, బెర్తులు ఖాళీగా ఉన్నట్లయితే, అతడు ఎటువంటి అదనపు ఛార్జీ చెల్లించకుండానే 2Aకి అప్ గ్రేడ్ అవుతాడని తెలిపారు.
Read Also: రన్నింగ్ ట్రైన్ కు వేలాడుతూ స్టంట్స్, జారిపడి స్పాట్ లోనే.. నెట్టింట వీడియో వైరల్!