Nandi Awards : మనిషన్నాక ఏదో ఒక కళ ఉంటుంది.. తనకు నచ్చిన కళారంగానే ఎంచుకొని అందులో రాణించాలని అనుకుంటారు. ఎంత దృఢ సంకల్పంతో ఉన్నా కూడా కాస్త ప్రోత్సాహం అనేది ఉంటే అతను అనుకున్నది సాధిస్తాడు. ఈ జీవిత సత్యం. సినీ రంగానికి చెందిన ప్రముఖులకు ప్రోత్సాహంగా ఉండడానికి అవార్డులను అందిస్తూ ఉంటారు. గత ప్రభుత్వంలో ఏపీలో ఎటువంటి అవార్డులు అందించలేదు. ఇప్పుడు మాత్రం కళారంగానికి గుర్తింపు లభించాలి అని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో నంది అవార్డులను అందించేందుకు సిద్ధం అవుతుంది. ఏపీలో నంది అవార్డులను ఎప్పుడు ఇస్తారు? ఎక్కడి ఇస్తారు? అన్న వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఏపీలో నందులు..
కళా రంగానికి ఏ అవార్డు ఇచ్చినా ప్రత్యేకమే.. కానీ నంది అవార్డులు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. గతంలో సినిమాలు వాళ్ళని పట్టించుకోలేదు. అందుకు సాక్ష్యం సినిమా టికెట్ ధరలను భారీగా తగ్గించడమే.. అంతేకాదు ప్రత్యేకంగా సినిమాలు షూటింగ్ లకు పర్మిషన్ ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఈసారి ప్రభుత్వం వారికి కావలసిన అన్నీ అందిస్తామని చెబుతున్నారు. నంది అవార్డు మొహం చూసి సినిమా ఇండస్ట్రీ చాలా కాలం అయిపోయింది. ఇటు తెలంగాణలోనూ అంతే. ఇప్పుడు రెండు చోట్లా ప్రభుత్వాలు మారాయి. అవార్డుల్ని పునరుద్ధరించే పనిలో పడ్డాయి. నంది అవార్డులు ఇస్తున్నాం అంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధం అవుతోంది.. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా నంది అవార్డులను ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది..
Also Read : మాస్టర్ భరత్ ఇంట తీవ్ర విషాదం.. మాతృ వియోగం..
అవార్డుల ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి హామీ..
ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏపీలో సినిమాలు వాళ్లకు అన్నీ మౌళిక సదుపాయాలను అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నంది అవార్డులు చాలా ఏళ్ల నుంచి ఇవ్వడమే లేదు. పాతవన్నీ ఒకేసారి క్లియర్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. అయితే పదేళ్ల అవార్డుల్ని ఒకేసారి ఇవ్వాలా? లేదంటే దశల వారీగా ఇవ్వాలా? అనేదే తెగడం లేదు. అన్ని అవార్డుల్నీ ఒకేసారి ప్రకటించి, మూడు రోజుల పాటు సాంస్క్రతిక కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అవార్డులను ఇస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారట.. కానీ ఇలా చేయడం వల్ల చాలా ఖర్చు అవుతుందని అంచనా..ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ కూడా నంది అవార్డుల పండగ ఘనంగానే చేద్దామంటున్నారట.. ఏపీలో త్వరగా నే ఈ అవార్డుల గురించి కార్యచరణ మొదలు పెడితే బాగుంటుందని అధికారుల మనసులో ఆలోచన మెదులుతుందట.. ఇక తెలంగాణలో ఇప్పటికే ఈ అవార్డుల గురించి పూర్తి కార్యాచరణ సిద్ధమైంది.. జూన్ నెలలో అవార్డులను అందించనున్నారు అన్న విషయం తెలిసిందే..