E-Paper
Advertisement

ఇయర్ ఎండ్ హాలీడేకు ఫస్ట్ ఛాయిస్.. ఢిల్లీని వెనక్కి నెట్టిన సౌత్ సిటీ!

ఇయర్ ఎండ్ హాలీడేకు ఫస్ట్ ఛాయిస్.. ఢిల్లీని వెనక్కి నెట్టిన సౌత్ సిటీ!
Advertisement

India’s Year End Travel Trends 2026: ఇయర్ ఎండ్ హాలీడేస్, న్యూ ఇయర్ వేడుకల కోసం చాలామంది ఇప్పటికే ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. అయితే, ఈసారి ఇండియన్ ట్రావెలర్స్ ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్న సిటీ ఏదో తెలుసా? కామన్ గా విమాన ప్రయాణాలకు ప్రముఖ కేంద్రంగా ఉండే ఢిల్లీని వెనక్కి నెట్టి సౌత్ ఇండియన్ సిటీ బెంగళూరు టాప్ ప్లేస్ లో నిలిచింది. ట్రావెల్ ప్లాట్‌ ఫామ్ క్లియర్‌ట్రిప్ (Cleartrip) విడుదల చేసిన తాజా లెక్కల్లో ఈ విషయం వెల్లడైంది.

ఢిల్లీని వెనక్కి నెట్టిన బెంగళూరు  

క్లియర్‌ ట్రిప్ ట్రెండ్స్ ట్రాకర్ ప్రకారం.. 2026 నవంబర్ 20 నుంచి డిసెంబర్ 31 మధ్య ప్రయాణాల కోసం రికార్డు అయిన  బుకింగ్స్ లో బెంగళూరు అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ఫ్లైట్ డెస్టినేషన్ గా నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే బెంగళూరు విమాన బుకింగ్స్ లో 6.2 శాతం వృద్ధి నమోదైంది. బెంగళూరు తర్వాత ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, పూణే, గోవా, గౌహతి, కొచ్చి, చెన్నై నగరాలకు కూడా ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

ఈ టూరిస్ట్ ప్లేసెస్ పైనా పెరుగుతున్న ఆసక్తి

Advertisement

సిటీలకే పరిమితం కాకుండా పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా ట్రావెలర్స్ కు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మున్నార్, కలంగుట్, కాండోలిమ్, మైసూరు, విశాఖపట్నం, ఊటీ, మసూరీ లాంటి ప్రాంతాల్లో హోటల్ బుకింగ్స్ పెరిగాయి. దేశీయ హోటల్ బుకింగ్స్ లో కొచ్చి ఏకంగా 169 శాతం వృద్ధితో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ముంబై 110.6 శాతం, వారణాసి 94.1 శాతం, ఢిల్లీ 90.8 శాతం, పూరీ 90.3 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

విదేశీ ప్రయాణాల్లో థాయ్‌లాండ్‌కు ఫస్ట్ ప్లేస్

అంతర్జాతీయ ప్రయాణాల విషయానికి వస్తే, థాయ్‌ లాండ్ భారతీయుల ఫేవరెట్‌ గా కొనసాగుతోంది. అయితే, ఈసారి కొలంబో కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ బుకింగ్స్ లో  రెండో స్థానాన్ని దక్కించుకుంది. దుబాయ్, ఫుకెట్ లాంటి ప్రాంతాలపై కూడా ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు వియత్నాం, జపాన్ పర్యటనలకు డిమాండ్ పెరుగుతోంది. హనోయ్ విమాన బుకింగ్స్ లో 44.6 శాతం వృద్ధితో ముందుంది. ఫూ క్వాక్ 33.2 శాతం, టోక్యో 22.2 శాతం వృద్ధిని సాధించాయి. హాంకాంగ్ 14.1 శాతం, కొలంబో 9.7 శాతం వృద్ధిని సాధించాయి.

సోలో ప్రయాణాలకు ఆసక్తి చూపిస్తున్న లేడీ ట్రావెలర్స్ 

Advertisement

ఈ ఏడాది ట్రావెల్ ట్రెండ్స్ లో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా మహిళల్లో సోలో ట్రావెల్‌పై ఆసక్తి పెరుగుతోంది. మొత్తం ఫ్లైట్ బుకింగ్స్ లో ఒంటరిగా ప్రయాణించే వారి సంఖ్య 59.5 శాతం నుంచి 63.3 శాతానికి పెరిగింది. ఇక సోలో విమాన ప్రయాణాల్లో మహిళల వాటా గత ఏడాది 19.8 శాతంగా ఉండగా, ఇప్పుడు 22.6 శాతానికి చేరింది.

కొత్త డెస్టినేషన్స్ వైపు జెన్ జీ అడుగులు

యువతలో ప్రయాణాలపై ఆసక్తి మరింత పెరుగుతోంది. మొత్తం బుకింగ్స్ లో 25 నుంచి 34 ఏళ్ల వయసున్న వారి వాటా ఎక్కువగా ఉంది. భారత్‌ లో నవీ ముంబై, జామ్‌నగర్, అగట్టి, జోర్హాట్ లాంటి ప్రాంతాలపై ఆసక్తి పెరుగుతోంది. విదేశాల్లో పారో, ఒసాకా, తైపీ, బెర్లిన్, బుడాపెస్ట్, ప్రేగ్ లాంటి కొత్త డెస్టినేషన్స్ ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. సాధారణ పర్యాటక ప్రాంతాలతో పాటు న్యూ సిటీస్, ఫారిన్ డెస్టినేషన్స్, సోలో ట్రావెల్‌ కు కూడా ప్రాధాన్యత పెరుగుతోంది.

Read Also: ప్రపంచంలోనే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. మన ఇండియాలోనే.. అస్సలు మిస్సవ్వకండి!

Tags

Related News

ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ రైలు వచ్చేస్తోంది.. ట్రయల్ రన్‌ ఎప్పుడంటే?

పులి vs సింహం.. ముఖాముఖి పోరులో పైచేయి దేనిది? నిపుణుల ఆసక్తికర విశ్లేషణ!

టికెట్లపై 20% డిస్కౌంట్.. ఇండియన్ ట్రావెలర్స్ కు ఎతిహాద్ అదిరిపోయే ఆఫర్!

ప్రపంచంలోనే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. మన ఇండియాలోనే.. అస్సలు మిస్సవ్వకండి!

వందేభారత్ స్లీపర్‌లో కొత్త ఫుడ్ రూల్.. ఇకపై విమానాల్లో మాదిరిగా ఫుడ్ సర్వీస్!

వందే భారత్‌ సహా అన్ని రైళ్లలో ఫ్రీ జర్నీ.. ఈ బంపర్ ఆఫర్ ఎవరికి అంటే?

గాల్లోనే కలకలం.. విమాన తలుపు తెరిచేందుకు ప్రయాణికుడి, అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో భయానక క్షణాలు!

Big Stories

Advertisement
×