Visakhapatnam Trains Diverted: విశాఖపట్నం నుంచి బయల్దేరే పలు రైళ్లను డైవర్డ్ చేయనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్ కాజీపేట-బల్లార్ష సెక్షన్ లో మూడవ లైన్ ప్యాచ్ ట్రిప్లింగ్ పనుల ప్రారంభానికి ముందు, ఇంటర్ లాకింగ్ పనులను నిర్వహిస్తున్నారు. ఈ పనుల కారణంగా విశాఖపట్నం బయల్దేరే పలు రైళ్లను డైవర్ట్ చేస్తున్నారు.
విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా బల్లార్షకు వరకు రైళ్లు వెళ్తుండగా.. ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా సాధారణ మార్గం కాకుండా విజయనగరం, రాయగడ, టిటల్ గఢ్, రాయ్ పూర్ ద్వారా దారి మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఫిబ్రవరి 12, 2026న విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం-న్యూ ఢిల్లీ AP ఎక్స్ ప్రెస్ ( రైలు నంబర్ 20805) – ఫిబ్రవరి 13న న్యూఢిల్లీ నుంచి బయలుదేరే న్యూఢిల్లీ-విశాఖపట్నం AP ఎక్స్ ప్రెస్ డైవర్ట్ చేసిన రూట్ లో నడవనుంది.
ఇక రైలు నంబర్ 20803, విశాఖపట్నం-గాంధీధామ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, జనవరి 29, ఫిబ్రవరి 5, 12 తేదీలలో విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. రైలు నంబర్ 20804, గాంధీధామ్-విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 1, 8 తేదీల్లో గాంధీ ధామ్ నుంచి బయలుదేరుతుంది. ఈ రెండు రైళ్లు దారి మళ్లించబడిన మార్గంలో నడుస్తాయి.
ఫిబ్రవరి 1, 8 తేదీలలో పూరి నుంచి బయలుదేరే పూరి-ఓఖా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్( రైలు నంబర్ 20819), ఫిబ్రవరి 4, 11 తేదీలలో ఓఖా నుంచి బయలుదేరే ఓఖా-పూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 20820), దారి మళ్లించబడిన మార్గంలో నడుస్తాయి.
అటు ఫిబ్రవరి 6, 13 తేదీలలో విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం-హెచ్ నిజాముద్దీన్ స్వర్ణజయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 12803), ఫిబ్రవరి 8, 11 తేదీలలో హెచ్ నిజాముద్దీన్ నుంచి బయలుదేరే నిజాముద్దీన్-విశాఖపట్నం స్వర్ణజయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్(రైలు నంబర్ 12804) దారి మళ్లించబడిన మార్గంలో నడుస్తాయి.
Read Also: బ్రిడ్జి మీది నుంచి పట్టాల మీద పడిపోయిన ట్రక్, రైళ్ల రాకపోకలు బంద్!
విశాఖపట్నం కు వచ్చి వెళ్లే రైళ్లకు సంబంధించిన వివరాలను ప్రయాణీకులు తెలుసుకోవాలని అధికారులు సూచించారు. ఈ మార్పులకు అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం విశాఖ రైల్వే స్టేషన్ అధికారులను సంప్రదించాలని సూచించారు.
Read Also: రైళ్లలో ఆ ఫుడ్ సరఫరా చేస్తున్నారా? మానవ హక్కుల సంఘం నోటీసులపై రైల్వే రిప్లై ఇదే!