Indian Railways: సమ్మర్ రద్దీ నేపథ్యంలో సౌత్ సెంట్రల రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో రద్దీని తగ్గించడానికి చర్లపల్లి – కాకినాడ టౌన్, చర్లపల్లి – నర్సాపూర్ స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఈ ప్రత్యేక రైళ్లలో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.
పొడిగించిన ప్రత్యేక రైలు సర్వీసుల వివరాలు
సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. చర్లపల్లి – కాకినాడ టౌన్ మధ్య రైలు నెంబర్ 07031 అదనపు సర్వీసులు అందించనుంది. మే 2 నుంచి జూన్ 27 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అటు కాకినాడ టౌన్ – చర్లపల్లి మధ్య రైలు నెంబర్ 07032 అదనపు సర్వీసులు అందించనుంది. మే 4 నుండి జూన్ 29 వరకు ఈ రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక చర్లపల్లి – నర్సాపూర్ మధ్య రైలు నెంబర్ 07233 సర్వీస్ మే 2 నుంచి జూన్ 27 వరకు ప్రత్యేక సర్వీసులు అందించనుంది. మరోవైపు నర్సాపూర్ – చర్లపల్లి మధ్య రైలు నెంబర్ 07234 అందుబాటులో ఉంటుంది. ఇది మే 4 నుంచి జూన్ 29 వరకు ప్రత్యేక సర్వీసులను అందించనుంది.
Read Also: రైళ్లలో మోబైల్స్, ల్యాప్ టాప్స్ ఛార్జింగ్ చేస్తున్నారా? అయితే, మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే!
ఈ రైళ్లలో ఏ కోచ్ లు ఉంటాయింటే?
తాజాగా చర్లపల్లి – కాకినాడ టౌన్, చర్లపల్లి – నర్సాపూర్ స్టేషన్ల మధ్య పొడిగించిన ప్రత్యేక రైళ్లలో 2AC, 3AC, స్లీపర్ కోచ్ లతో పాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సుమారు రెండు నెలల పాటు అందుబాటులో ఉండే ఈ సర్వీసులను వినియోగించుకోవాలని సూచించారు. సమ్మర్ మొత్తం ఎలాంటి ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ కాకినాడ, నర్సాపూర్ కు రాకపోకలు కొనసాగించవచ్చు అన్నారు.
Read Also: ఏపీ మీదుగా వెళ్లే రైళ్లు క్యాన్సిల్.. వెంటనే చెక్ చేసుకోండి!