E-Paper
Advertisement

Special Trains: సికింద్రాబాద్- విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు, పండుగల వేళ ప్రయాణీకులకు గుడ్ న్యూస్

Special Trains: సికింద్రాబాద్- విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు, పండుగల వేళ ప్రయాణీకులకు గుడ్ న్యూస్
Advertisement

Secunderabad- Visakhapatnam Special Trains: ఈ నెలలో క్రిస్మస్, వచ్చే నెలలో సంక్రాంతి పండుగలు వస్తున్న నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. నెమ్మదిగా ప్రయాణీకుల రద్దీ సైతం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా రైళ్లను నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే ప్రత్యేక రైళ్లను నడపబోతున్నట్లు వెల్లడించింది.

సికింద్రాబాద్ – విశాఖ, బ్రహ్మపుర మధ్య ప్రత్యేక రైళ్లు

Advertisement

పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, బ్రహ్మపుర వరక ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. డిసెంబర్ 6(ఇవాళ్టి) నుంచి డిసెంబర్ వరకు 30 వరకు ఈ రైళ్లను అందుబాటులో ఉంచనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆ తర్వాత సంక్రాంతికి మరిన్ని రైళ్లను షెడ్యూల్ చేయనున్నట్లు తెలుస్తున్నది. తాజాగా ప్రకటించిన రైళ్ల వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

Advertisement

సికింద్రాబాద్ – విశాఖ ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు 07097 నెంబర్ గల ప్రత్యేక రైలు డిసెంబర్ 8, 15, 22, 29న నడవనుంది.ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సాయంత్రం 4.35 గంటలకు బయల్దేరుతుంది. తర్వాతి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అటు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు 07098 నెంబర్ గల రైలు డిసెంబర్ 9, 16, 23, 30 తేదీల్లో నవనుంది. ఈ రైలు రాత్రి 7.50 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. ఈ రైళ్లలో 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు.

ఈ రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?

సికింద్రాబాద్ – విశాఖపట్నం, విశాఖపట్నం – సికింద్రాబాద్ నడుమ నడిచే ఈ ప్రత్యేక రైళ్లు పలు స్టేషన్లలో ఆగనున్నాయి. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతాయి.

సికింద్రాబాద్- బ్రహ్మపుర వరకు ప్రత్యేక రైలు

అటు ప్రయాణీకులు రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ నుంచి ఒడిశాలోని బ్రహ్మపుర వరకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. ఈ రైలు డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో రాత్రి 8.15 గంటలకు సింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరనుంది. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు బ్రహ్మపుర స్టేషన్ కు చేరుకుంటుంది. ఇక   బ్రహ్మపుర నుంచి సికింద్రాబాద్ కు మరో రైలు అందుబాటులో ఉంటుంది. ఇది డిసెంబర్ 7, 14, 21, 28న సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరుతుంది. తర్వాత రోజు రోజు ఉదయం 11.35 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది.  ఈ రైళ్లలో2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ బోగీలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.

ఈ రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?

సికింద్రాబాద్- బ్రహ్మపుర, బ్రహ్మపుర- సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు పలు స్టేషన్లలో ఆగనున్నాయి. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, నౌపడ, పలాస, సొంపేట, ఇచ్ఛాపురంలో హాల్టింగ్ తీసుకుంటాయి.

Read Also: చార్ట్ ప్రిపేర్ అయినా కన్ఫార్మ్ టికెట్ దొరుకుతుంది సింపుల్‌గా ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు!

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×