Satyabhama Today Episode December 6th : నిన్నటి ఎపిసోడ్ లో.. హర్ష విశాలాక్షికి చెప్పి నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అమ్మ అని అంటాడు. నైటు లేట్ అవుతుంది నేను లేటుగా వస్తాను ఆఫీస్ పని ఉంది అనేసి నందినీతో హర్ష అంటాడు.. మైత్రి కోసం వెళ్తున్న ఇది నీకు మోసం చేయాలని కాదు నేను చెప్తే గొడవవుతుందని అనుకుంటూ వెళ్లిపోతాడు. ఇక ఉదయం మహదేవయ్య ఏ ఇంట్లో బైరవి సోఫాలో కూర్చుని ఫోన్ పట్టుకొని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే గంగ కూడా అక్కడికి వస్తుంది. బైరవిలాగే ఫోన్ పట్టుకొని కాళ్ళు ఒప్పుకుంటూ ఉంటుంది. అది చూసిన భైరవి కోపంతో రగిలిపోతుంది. టెస్ట్ రిపోర్టు వస్తే ఏదైతే అది అవుతుంది అనేసి అనగానే బయట టెన్షన్ పడుతుంది. మహదేవయ్య చెమటలు తుడుచుకుంటాడు. సత్య మహదేవయ్యకు కౌంటర్ లేస్తుంది. ఏ నిజమైనా బయటికి వస్తేనే అసలు మనిషి ఎలాంటి వారో తెలుస్తుంది అంటుంది. క్రిష్ పుట్టుక గురించి ఈరోజు తెలిసిపోతుంది మావయ్య ఏదైనా తప్పు చేశారా అనేది ఈరోజుతో తెలిసిపోతుంది అనగానే బైరవి కూడా నా పెనిమిటి గురించి నాకు తెలుసు ఈ రోజు అందరికీ తెలుస్తుంది అని మహదేవయ్యను వెనకేసుకొని వస్తుంది. క్రిష్ గంగ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మొత్తానికైతే గంగ ఇంటికి వెళ్లి గంగ గురించి తెలుసుకుంటాడు. ఇక సత్యా క్రిష్ కి కాల్ చేస్తుంది. గంగ గురించి అసలు నిజం తెలిసిపోయిందని క్రిష్ సత్యకే షాక్ ఇస్తాడు.మహదేవయ్య తరపున సత్యా నరసింహతో గొడవ పెట్టుకుంటుంది. అసలు నిజం ఏంటో ఈ రిపోర్ట్ తో బయటపడుతుంది నువ్వు ఎందుకు అరుస్తున్నావ్ అనేసి నరసింహను అంటుంది. ఆ రిపోర్ట్ ను తీసుకున్న డాక్టర్ నిజం చెప్పబోతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నరసింహ మీడియం తీసుకొని బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. మహాదేవయ్య రిపోర్ట్ ను తాను తీసుకొచ్చిన డాక్టర్ ఓపెన్ చేయాలని అంటాడు. ఇక భైరవి అలాగే తీసుకో అందులో ఏముంటుందో ఈ ప్రపంచానికి తెలిసేలా చెప్పని డాక్టర్కి ఇస్తుంది. ఇక డాక్టరు మహదేవయ్య, గంగకు ఎటువంటి సంబంధం లేదని చెప్తారు. ఇక క్రిష్ మహదేవయ్య కొడుకు అని డాక్టర్ చెప్తాడు. దాంతో నరసింహతో పాటు సత్య కూడా షాక్ అవుతుంది. భైరవి సంతోషంలో మునిగి గంతులు వేస్తుంది. ఇక మహదేవయ్య సత్య ఇంట్లోకి వెళ్లి తప్పు ఎక్కడ జరిగిందో అని ఆలోచిస్తూ ఉంటుంది. మహాదేవయ్యా వచ్చేసి నిజం పాతి పెట్టేసావు నీ నోటితో నువ్వే నేను క్రిష్కి తండ్రినని నిజాన్ని బయట పెట్టావు అనేసి మహాదేవయ్య విర్రవీగుతాడు. సారీ తప్పు జరిగితే నేను ఓడిపోతానని అనుకోవద్దు అనేసి సత్య కూడా తగ్గకుండా ఛాలెంజ్ లు విసురుతుంది. చిన్న చాపను వేసి తిమింగలని పట్టాలనుకున్నావు అది జరుగుతుందని అనుకుంటున్నావా అనేసి మహాదేవయ్యా సత్యను అంటాడు. నువ్వు ఎన్నిసార్లు ప్లాన్ వేసినా ఈ రిపోర్టు ఇలానే ఉంటుంది నువ్వు ఎంతమంది గంగల్ని తీసుకొచ్చిన గంగలో మునిగిపోతారు అంతే అనేసి అంటారు. నాకు చెప్పకుండా ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన మళ్లీమళ్లీ ఓడిపోతానని అనుకోవద్దు అని చాలెంజ్ చేసి సత్య వెళ్ళిపోతుంది. అప్పుడే సత్యకు హాస్పిటల్ లోని కాంపౌండర్ ఫోన్ చేస్తాడు. ఆ డెలివరీ టైమ్ లో ఒక నర్స్ ఉండేది తర్వాత రోజు రిజైన్ చేసింది ఆ నర్స్ అడ్రస్ నాకు దొరికింది ఆమె ఇంటికి మీరు వెళ్తే అసలు నిజం బయటపడొచ్చు అనేసి అడ్రస్ పంపిస్తాడు. మళ్లీ సత్య మహాదేవ దగ్గరికి వెళ్లి నిజం దాగిపోదు ఎప్పటికైనా బయటపడుతుంది దేవుడు ఒక దారి మూసుకుంటే మరో దారిలో అవకాశాన్ని ఇస్తాడు అది వెతుక్కోవాలి అనేసి మహదేవయ్యకు చెప్పి వెళ్తుంది.
మహదేవయ్యా ఇంత అర్జంటుగా ఏమైంది మళ్లీ ఛాలెంజ్ లేస్తుంది ఏంటి అనేసి మళ్లీ టెన్షన్ పడతాడు. ఇక మైత్రి హర్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. హర్ష రాగానే ఎలా కొంగును కట్టేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడే హర్ష ఇంట్లోకి వస్తాడు. బర్తడే సెలబ్రేషన్స్ చేయాలి ఎందుకింత మౌనం గా ఉన్నావ్ అనేసి హర్ష అంటాడు. అసలే హర్షకి చాలా పనులుంటాయి నువ్వు ఎందుకు వచ్చావు హర్ష అనేసి మైత్రి అడుగుతుంది. ఇక నందిని పూజ చేసుకుంటూ ఉంటుంది. హర్ష మైత్రిని హగ్ చేసుకోగానే దీపం కొండెక్కుతుంది. దాన్ని చూసి నందిని భామని అడుగుతుంది. ఇక సత్య ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆ నర్స్ అడ్రస్ తెలుసుకుని అసలు ఇది నిజం ని బయటకు తీసుకురావాలని ఆలోచిస్తూ బయటకు వస్తుంది. అప్పుడే కార్లో క్రిష్ పిలుస్తాడు. నా భార్య బయటికెళ్తుందని రెడీ అవుతుందని అనుకున్నాను అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నేనొక్కదాన్నే వెళ్తాను నువ్వేం అవసరం లేదు అనేసి సత్య అంటుంది. నీకు క్రిష్ నిన్ను తీసుకెళ్లాలని నాకుంది ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావ్ చెప్పవా అంటే నేను చెప్పను అనేసి సత్య అంటుంది. మనం ఇక్కడే నిల్చొని వాదన పెట్టుకుంటూ ఉంటే అమ్మ చూసిందనుకో నిన్ను వెళ్ళలేదు నన్ను వెళ్ళనీదు అనేసి అంటాడు.
ఇక సంధ్య ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సంజయ్ ఎక్కడికి వస్తాడు. సంధ్య తో కాఫీ కి వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోతారు.. ఇక క్రిష్ సత్య సరదాగా మాట్లాడుకుంటారు. జర జాగ్రత్తగా ఉండాలని అనుకుంటు ఉంటాడు. దానికి సత్య కౌంటర్లు వేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపు ఎపిసోడ్లో ఆ నర్స్ ని మహదేవయ్య కిడ్నాప్ చేస్తాడు. మహదేవయ్య సత్య దగ్గరికి వచ్చేసి ఆ నిజాన్ని బయటపెడతాడు. రేపటి ఎపిసోడ్ లో ఇంకేం జరుగుతుందో చూడాలి..