Brahmamudi serial today Episode: కళ్యాణ్‌ను రెడీ చేసి అప్పు పంపిస్తుంటే అనామిక వస్తుంది. త్వరగా వెళ్లు కళ్యాణ్ అక్కడ మీ గురువు గారికి కాఫీ ఇవ్వాలి కదా లేదంటే ఆయన కోప్పడతాడు త్వరగా వెళ్లు అంటుంది. కళ్యాణ్ షాక్ అవుతాడు. నీకు పని పాట లేక నువ్వు చెప్పే సొల్లు వినడానికి ఎవ్వరూ లేకనే మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావా..? అని అడుగుతుంది అప్పు. ఈ గుడ్డి నమ్మకమే కళ్యాణ్ నిన్నను తిక్కదాన్ని చేసి ఆడుకునేలా చేస్తుంది అని అనామిక అంటుంది. దీంతో అప్పు కోపంగా అనామికను ఇంకోసారి తిక్క గిక్క అన్నావంటే మర్యాదగా ఉండదు. మోసం చేయడాలు.. వెన్నుపోటు పొడవడాలు నీలాంటి దానికి అలవాటు అంటుంది అప్పు.
అంతలేదు ఇక్కడ మీ శ్రీవారి ప్రతిభకు ప్రేక్షకులు పట్టం కడితే వచ్చిన చెక్కు కాదు అది. ఒక పెద్ద లిరిక్ రైటర్ దగ్గర కాళ్లు పట్టి టీ పెడితే వచ్చిన చెక్కు అది. అంటూ అనామిక నిజం చెప్పగానే అప్పు, కళ్యాణ్ సైలెంట్‌గా ఉంటారు. ఇప్పుడు చెప్తున్నాను కదా..? నువ్వు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటావు. నిన్ను చూసి నేను ఎప్పుడూ జాలి పడుతూనే ఉంటాను. ఇంకెప్పుడు చిల్లర రాతల చెక్కులు తీసుకొని వచ్చి టెక్కులు పడకు అని చెప్పి వెళ్లిపోతుంది. కళ్యాణ్‌ను అసలు ఏంట్రా ఇది అని అప్పు అడుగుతుంది. నేను ఏ తప్పు చేయలేదు పొట్టి అని కళ్యాణ్ చెప్తాడు. నేను ఆటో నడుపుతుంటే మా అమ్మకు చిన్నతనంగా ఉంది.
తనను బాధపెట్టొద్దని నువ్వు చెప్పావు. నచ్చిన పని మాత్రమే చేయ్ అని చెప్పావు. కానీ లక్ష్మీకాంత్ గారు అగ్రిమెంట్ మీద సంతకం చేస్తేనే అవకాశం ఇస్తా అన్నారు. నా విజయం కోసం ఎదురు చూస్తున్న నీకు ఇంకా మూడేళ్లు ఆగాలి అని చెప్తే.. నువ్వు బాధపడతావని చెప్పలేదు అంటాడు. అందుకని బాధ నువ్వు మాత్రమే భరిస్తూ నాతో సంతోషాన్ని మాత్రమే పంచుకుంటున్నావా..? నాకు నిజమైన సంతోషం ఏంటో తెలుసా..? ఎంత పెద్ద కష్టమైనా నాకు నీ నోటితో చెప్పడమే ఇలా ఎవరో వచ్చి చెప్పే వరకు తెలియకపోవడమే పెద్ద బాధ అంటుంది అప్పు. కళ్యాణ్ సారీ చెప్తాడు. ఇంకోసారి ఇలా జరగనివ్వను అంటాడు.
ధాన్యలక్ష్మీ ఆలోచిస్తుంటే.. రుద్రాణి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు.. అంటూ ఇప్పుడు వెళ్లిన ముసలోళ్లు కాళ్లు పట్టుకునైనా కావ్యను ఇంటికి తీసుకొస్తారు. నీ తోడి కోడలు ఎప్పటికైనా కావ్యను కంపెనీకి సీటులో కూర్చోబెడుతుంది అని చెప్పగానే ధాన్యలక్ష్మీ ఇప్పటికిప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంది. దీంతో రుద్రాణి చచ్చిపో అని ధాన్యలక్ష్మీకి చెప్తుంది. ఇంతలో కావ్యను తీసుకుని అపర్ణ, ఇందిరాదేవి, సీతారామయ్య ఇంటికి వస్తారు. లోపలికి వచ్చిన కావ్యకు ధాన్యలక్ష్మీ ఉరి వేసుకోవడం చూసి షాక్ అవుతుంది. అందరూ కంగారుపడుతుంటారు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగ్గానే నాకు న్యాయం కావాలి. ఈ ఇంటి వారసుడైన నా కొడుక్కి అన్యాయం జరిగింది. ఈ ఇంటి పెద్దలు ఈ కుటుంబ పెద్దలు వాడికి ఎప్పటికీ న్యాయం చేయరని అర్థమైంది. కనీసం నా చావుతోనైనా మీరు మీ నిర్ణయం మార్చుకుంటారని అప్పుడైనా నా కొడుక్కి న్యాయం చేస్తారని అంటూ ఉరి వేసుకోబోతుంటే అపర్ణ వెళ్లి ధాన్యలక్ష్మీని కిందకు లాగి చెంప పగులగొడుతుంది.
ధాన్యలక్ష్మీ ఎవరు నీ కొడుక్కి అన్యాయం చేస్తున్నారు. వాడికి అన్యాయం జరిగిందంటే దానికి కారణం నువ్వు.. వాడు బయటకు అడుగుపెట్టాడు అంటే దానికి కారణం నువ్వు.. ఇంత ఆస్థిని వాడు పూచిక పుల్లతో తీసిపడేశాడు అంటే దానికి కారణం నువ్వు అంటూ నిలదీస్తుంది. అవును నువ్వు నీ కోడలిని కోడలిగా ఒప్పుకుని ఉంటే వాడు బయటకు ఎందుకు వెళ్తాడు. నీ దగ్గర తప్పు పెట్టుకుని నీ అర్థం లేని షరతులు ఒప్పుకోలేదని చచ్చి ఎవరిని సాధించాలి అనుకుంటున్నావు అంటుంది ఇందిరాదేవి. అన్ని అపూర్వ వదినకే చేస్తూ… ధాన్యలక్ష్మీకి చిన్ననయ్యకు ఎవ్వరూ సపోర్టుగా లేకపోతే చావకపోతే ఏం చేస్తుంది అని రుద్రాణి అడుగుతుంది. అపర్ణ కోపంగా రుద్రాణిని నువ్వు ఇంకొక మాట మాట్లాడావు అంటే ఇదే ఉరి నీకు వేసి చంపేస్తాను.. అసలు నువ్వు ఆడదానివేనా..?
మేము తిరిగి వచ్చేలోపే ధాన్యలక్ష్మీని ఎంత రెచ్చగొట్టి ఉంటావో మేము ఊహించలేము అనుకుంటావా..? నిజంగానే ధాన్యలక్ష్మీ ప్రాణం పోయుంటే ఏంటి..? అంటుంది. అందరూ ధాన్యలక్ష్మీని, రుద్రాణిని తిడతారు. ఎవరు ఎంత చెప్పినా ధాన్యలక్ష్మీ విననని ఇంటిల్లి పాది ఏకమై తప్పు నా మీదకు తోసేసి దాడి చేస్తుంటే నేను సహించను. డిమాండ్ చేసి చెప్తున్నాను మర్యాదగా నా కొడుక్కి సగభాగం రాసిస్తారా లేదా..? ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోకపోతే నేను కచ్చితంగా ప్రాణం తీసుకుంటాను. ఈ ఇంట్లో అందరూ బాధ్యులు కావాల్సి వస్తుంది అంటూ ధాన్యలక్ష్మీ ఉరి వేసుకుంటుంటే అందరూ ఆపడానికి ప్రయత్నిస్తారు. అది చూస్తున్న సీతారామయ్యకు స్ట్రోక్ వస్తుంది. నిలబడ్డే చోటే కుప్పకూలిపోతాడు. అందరూ పరుగెత్తుకొచ్చి సీతారామయ్యను హాస్పిటల్ కు తీసుకెళ్తారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?