Etihad Flight Offers 2026: విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకునే ఇండియన్ ట్రావెలర్స్ కు ఎతిహాద్ ఎయిర్ వేస్ (Etihad Airways) గుడ్ న్యూస్ చెప్పింది. ఉత్తర అమెరికా, యూరప్ లోని మరిన్ని కీలక నగరాలకు ప్రయాణించే అవకాశాలను విస్తరిస్తోంది. కెనడాలోని కాల్గరీ నుంచి అమెరికాలోని చికాగో, బోస్టన్, వాషింగ్టన్ డీసీ వరకు.. జర్మనీలోని మ్యూనిచ్ నుంచి ఇటలీలోని మిలన్ వరకు పలు ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ కు కనెక్టివిటీని అందిస్తోంది. మరోవైపు, భారతీయ ప్రయాణికుల కోసం 50కి పైగా డెస్టినేషన్స్ కు విమాన టికెట్లపై 20 శాతం వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ తో పాటు అబుదాబిలో ఫ్రీ స్టాప్ ఓవర్ సదుపాయం కూడా అందిస్తోంది.
ఎతిహాద్ నెట్ వర్క్ లో కాల్గరీ, గోథెన్ బర్గ్ లాంటి సిటీస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. కెనడాలోని కాల్గరీ నుంచి మంచుతో కప్పుకున్న పర్వతాలు, అందమైన సరస్సులతో ప్రసిద్ధి చెందిన కెనడియన్ రాకీస్ ను చూసే అవకాశం ఉంటుంది. స్వీడన్ లోని గోథెన్‌బర్గ్ సిటీ కెనాల్స్, సీ ఫుడ్, కేఫ్‌లు, అందమైన దీవులతో ఆకట్టుకుంటుంది.
అమెరికా పర్యటనకు వెళ్లాలనుకునేవారికి చికాగో, బోస్టన్, షార్లెట్, వాషింగ్టన్ డీసీ లాంటి నగరాలకు ప్రయాణించే అవకాశం ఉంది. చికాగోలో ఎత్తైన భవనాలు, మ్యూజియంలు, తీర ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. బోస్టన్ లో ఫ్రీడమ్ ట్రైల్, హార్వర్డ్ యార్డ్ లాంటి హిస్టారికల్ ప్లేసెస్ చూడవచ్చు. షార్లెట్ లో వైట్ వాటర్ సెంటర్, క్రాఫ్ట్ బ్రూవరీలు ప్రత్యేకంగా అలరిస్తాయి. వాషింగ్టన్ డీసీలో స్మారక చిహ్నాలు, స్మిత్సోనియన్ మ్యూజియంలను కూడా చూడవచ్చు.
యూరప్ వెళ్లాలనుకునేవారికి జర్మనీలోని మ్యూనిచ్, ఇటలీలోని మిలన్ మంచి డెస్టినేషన్స్ గా చెప్పుకోవచ్చు. మ్యూనిచ్‌లో బవేరియన్ సంప్రదాయాలు, చారిత్రక కట్టడాలు, బీర్ గార్డెన్లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఆల్ప్స్ పర్వతాలను సందర్శించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక మిలన్ ఫ్యాషన్, డిజైన్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి డుయోమో కేథడ్రల్, లా స్కాలా ఒపెరా హౌస్ లాంటి ప్రదేశాలను చూడవచ్చు.
ఎతిహాద్ ఎయిర్‌వేస్ అందిస్తున్న మరో ప్రత్యేక సదుపాయం అమెరికా ప్రయాణికులకు ఉపయోగపడుతుంది. అబుదాబి విమానాశ్రయంలోనే అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ చెకింగ్స్ పూర్తి చేసుకోవచ్చు. దీంతో అమెరికాలో దిగిన తర్వాత దేశీయ ప్రయాణికుల మాదిరిగా బయటకు రావడానికి, నెక్ట్స్ విమానాలకు కనెక్ట్ కావడానికి వీలుంటుంది.
భారత్ నుంచి అబుదాబి మీదుగా ప్రయాణించే వారికి మరో అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది ఎతిహాద్. స్టాప్ ఓవర్ ఆఫర్ ద్వారా అబుదాబి, అల్ ఐన్‌లో ఫ్రీగా బస చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ సమయంలో అక్కడి బీచ్‌లు, సాంస్కృతిక ప్రాంతాలు, థీమ్ పార్కులు, రెస్టారెంట్లను సందర్శించవచ్చు.
భారతీయ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఎతిహాద్ 50కి పైగా అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన టికెట్లపై 20 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ పొందాలనుకునేవారు నవంబర్ 29లోపు టికెట్లు బుక్ చేసుకోవాలి. 2027 జూన్ 15 వరకు చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ తెలిపింది.
Read Also: ప్రపంచంలోనే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్.. మన ఇండియాలోనే.. అస్సలు మిస్సవ్వకండి!