BigTV English
Advertisement

Rambha: రంభ రీఎంట్రీ కోసం భర్త కష్టాలు.. దర్శకులకు ఫోన్ చేసి మరీ..

Rambha: రంభ రీఎంట్రీ కోసం భర్త కష్టాలు.. దర్శకులకు ఫోన్ చేసి మరీ..

Rambha: ఒకప్పటి హీరోయిన్లంతా మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంటున్నారు. అలా ఇప్పటికే చాలామంది హీరోయిన్లు రీఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. అలా చాలామంది సెకండ్ ఇన్నింగ్స్ బ్రేకుల్లేకుండా దూసుకుపోతున్నాయి. ఆ లిస్ట్‌లో జాయిన్ అవ్వాలనే మరెందరో సీనియర్ హీరోయిన్స్ ఎదురుచూస్తున్నారు. అందులో రంభ కూడా ఒకరు. ఒకప్పుడు సౌత్ భాషలు అన్నింటిలో గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రంభ.. చాలాకాలం క్రితమే తాను సెకండ్ ఇన్నింగ్స్ కోసం రెడీగా ఉన్నానని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇక వేల కోట్లకు అధిపతి అయిన తన భర్త కూడా రంభ రీఎంట్రీ కోసం కష్టపడుతున్నాడని తాజాగా బయటపడింది.


ఆస్తుల వివరాలు ఇవే

ఇప్పటికే బుల్లితెరపై సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడానికి రంభ సిద్ధమయినట్టు సమాచారం. ‘జోడీ ఆర్ యూ రెడీ’ అనే ఒక డ్యాన్స్ షోలో జడ్జిగా మీనా స్థానంలోకి రంభ రానుందని తెలుస్తోంది. అంతే కాకుండా తనకు సినిమాల్లోకి మళ్లీ అడుగుపెట్టాలని కూడా ఇంట్రెస్ట్ ఉందని తాజాగా ఒక డైరెక్టర్ బయటపెట్టాడు. తమిళ దర్శకుడు కళైపులి ఎస్ థను తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో రంభ రీఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు రంభ గుర్తింపు ఉన్న హీరోయిన్ అయినా ఇప్పటికీ తన ఫ్యాన్ ఫాలోయింగ్ కొంచెం కూడా తగ్గలేదు. కానీ తన పర్సనల్ లైఫ్ గురించి, ఆస్తుల వివరాల గురించి ఈ దర్శకుడు ప్రేక్షకుల ముందు రివీల్ చేశాడు.


రిక్వెస్ట్ చేశారు

‘‘రంభకు రూ.2000 కోట్ల విలువ ఆస్తి ఉంది. తన భర్త ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఆయన నా దగ్గరకు వచ్చి రంభకు ఒక్క సినిమా అవకాశం ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు. అందుకే తనకు సెట్ అయ్యే ప్రాజెక్ట్ చూసి చెప్తానని చెప్పాను’’ అని అన్నాడు కళైపులి ఎస్ థను. ఇప్పటికే రంభ రీఎంట్రీ గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన జరగలేదు. కానీ ఈ డైరెక్టర్ చేసిన కామెంట్స్ చూస్తుంటే త్వరలోనే తన రీఎంట్రీ పక్కా అనిపిస్తోంది. రంభ చివరిగా 2010లో విడుదలయిన ‘పెన్ సింగం’ అనే తమిళ చిత్రంలో కనిపించింది. దీనిని బలి శ్రీరంగం డైరెక్ట్ చేశారు. మీరా జాస్మిన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా హిట్ అందుకోలేదు.

Also Read: తమ్ముడి పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన సాయి పల్లవి.. ఆ స్టెప్స్ చూశారా.?

ప్రతీ భాషలో

తెలుగు, తమిళంలో మాత్రమే కాకుండా మలయాళంలో కూడా రంభ (Rambha) ఎన్నో సినిమాల్లో నటించింది. ఎంతైనా తెలుగులోనే ఎక్కువ సినిమాల్లో నటించి తెలుగులోనే ఎక్కువగా ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. కెరీర్ ఫుల్ జోష్‌లో ఉన్నప్పుడు తనకు బాలీవుడ్ నుండి కూడా అవకాశాలు రావడం మొదలయ్యింది. అలా కొన్నేళ్ల పాటు ప్రతీ భాషలోని స్క్రీన్‌పై ఈ ముద్దుగుమ్మ కనిపించేది. 2010లో ఇంద్రకుమార్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. కొన్నాళ్ల నుండి సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉంటూ తన పర్సనల్ లైఫ్ విషయాలను, ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసుకుంటోంది రంభ.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×