Metro Card Ban: రోజూ మెట్రో ఎక్కేవారికి ఇది పెద్ద షాక్. చేతిలో ఉన్న మెట్రో ట్రావెల్ కార్డు ఇక పనికిరాదు అనగానే ఎవరికైనా కంగారే. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న మెట్రో కార్డు, అలవాటైపోయిన టాప్-అప్స్ అన్నీ ఒకేరోజుతో చరిత్రకెక్కబోతున్నాయి. ఈ ఆగస్ట్ ఒకటి నుంచి ప్రయాణికుల చేతుల్లో ఉన్న పాత కార్డులు ఇక ప్రయాణానికి అనర్హం. కానీ.. అందులో ఉన్న మీ డబ్బు సేఫ్, మిగిలిన బ్యాలెన్స్ మిగిలేలా కొత్త మార్గం చెప్పారు మెట్రో అధికారులు.
మెట్రో ప్రయాణం అనగానే మన ముందుకు వచ్చే మొదటి ఆలోచన.. కార్డు తీసి స్వైప్ చేయడం. అలాంటి ట్రావెల్ కార్డు ఇప్పుడు మారిపోతోంది. న్యూజనరేషన్ టెక్నాలజీకి అనుగుణంగా, మెట్రో యాజమాన్యం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం పాత ట్రావెల్ కార్డులు ఇక టాప్-అప్ చేసుకునే వీలు లేదు. దీని స్థానంలో ఇప్పుడు వస్తోంది Singara NCMC Card. అంటే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు, దీనితో ప్రయాణం చెయ్యడమే కాదు, బస్సులు, రైళ్లు, పార్కింగ్ ఫీజులు, షాపింగ్.. అన్నింటికీ ఈ కార్డే చాలు.
ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్
పాత మెట్రో కార్డు వాడే వారంతా ఈ మార్పును గమనించాలని మెట్రో అంటోంది. ఆగస్ట్ 1వ తేదీ నుంచే పాత కార్డులకు టాప్-అప్ చెయ్యడం ఆపివేస్తారు. అర్థం ఏమిటంటే, మీ కార్డ్‌లో ఇప్పటికే ఉన్న డబ్బుతో మాత్రం ప్రయాణించవచ్చు. కానీ ఆ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత.. ఇక దానితో ప్రయాణం లేదు. కాబట్టి ఇప్పుడే కొత్త NCMC కార్డు తీసుకోవడమే మేలైన నిర్ణయం.
కొత్త కార్డు ఎందుకంటే?
Singara Chennai Card అనేది నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు కింద రాబోతున్న మెట్రో ట్రావెల్ కార్డు. ఇది స్మార్ట్ కార్డు. దీన్ని మీరు మెట్రోలో మాత్రమే కాకుండా ఇతర ప్రభుత్వ వాహనాలలో కూడా వాడొచ్చు. ప్రయాణదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది కేవలం ప్రయాణానికి మాత్రమే కాకుండా, కొన్ని POS (Point of Sale) లలో కూడా వర్క్ అవుతుంది.
పాత కార్డు ఉన్నవారు ఏమి చేయాలి?
పాత కార్డు ఉన్నవారు ఆగస్ట్ 1వ తేది తర్వాత కూడా కార్డ్‌ను రెడీమ్ చేసుకునే వీలు ఉంది. అంటే మీ బ్యాలెన్స్‌ను కొత్త కార్డ్‌కు మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే దీని కోసం మీరు మెట్రో స్టేషన్లలోని కస్టమర్ కేర్ కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంటుంది.
కొత్త కార్డ్ ఎలా తీసుకోవాలి?
NCMC కార్డ్ కోసం మెట్రో స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మీరు ఫారమ్ పూరించి, గుర్తింపు ఆధారాలు చూపించి, అవసరమైన చార్జ్ చెల్లించి ఈ కార్డ్ పొందవచ్చు. కార్డు మీ పేరుతో నమోదు అవుతుంది. దీని ద్వారా మీరు మీ ప్రయాణ చరిత్రను, బ్యాలెన్స్‌ను, రీచార్జ్ హిస్టరీని కూడా ట్రాక్ చేయొచ్చు.
ప్రయాణికుల అభిప్రాయం
కొంతమంది ప్రయాణికులు ఈ మార్పును హర్షిస్తున్నారు. టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌కి అనుగుణంగా మెట్రో కూడా ఎదుగుతోందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరికి మాత్రం ఇది కొత్త ఇబ్బందిగా అనిపిస్తోంది. ఎందుకంటే వారు ఇప్పటికీ పాత కార్డులే వాడుతుంటారు. అయితే అధికారులు చెప్పినట్లు చూస్తే, ఇది ఒకవిధంగా డిజిటల్ ఇండియా వైపు ఒక అడుగు.
ఈ రూల్ ఏ మెట్రోలో?
మొత్తం చదివాక మీకు డౌట్ వచ్చి ఉంటుంది.. ఇది ఏ నగర మెట్రో అని కదా.. ఈ రూల్ అమల్లోకి వచ్చింది చెన్నై మెట్రోలో.. అంటే సింగారా చెన్నై మెట్రో. స్మార్ట్ కార్డు, స్మార్ట్ టికెటింగ్, డిజిటల్ ట్రావెల్ అన్నీ కలిపి ఇప్పుడు మెట్రో ప్రయాణం కొత్త మలుపు తిరుగుతోంది. ప్రయాణం సాఫీగా సాగాలంటే.. టెక్నాలజీకి అడ్జస్ట్ అవ్వాల్సిందే. పాతదాన్ని గుడ్‌బై చెప్పి, కొత్తదాన్ని ఆహ్వానించాలి. చెన్నై మెట్రో చేసిన ఈ నిర్ణయం దేశంలోని ఇతర మెట్రోలకూ ఉదాహరణగా నిలవొచ్చు. ప్రయాణికులు కూడా ఇప్పుడే కొత్త కార్డు తీసుకుంటే.. ప్రయాణం సాఫీనే!