Maha Kumbh Special Train: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలకు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ వేదికగా జనవరి 12న మొదలైన ఈ వేడుక ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఏకంగా 45 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ఏకంగా 45 కోట్ల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు యోగీ సర్కారు అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు తీసుకుంటున్నది. భద్రత నుంచి మొదలుకొని, ఆహారం, ఫుడ్, వసతి వరకు తగిన ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఏకంగా 7,500 కోట్లు కేటాయించింది. ఈ మహా కుంభమేళాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏడు అంచెల భద్రను ఏర్పాటు చేసింది.
కుంభమేళాకు 13 వేల రైళ్లను నడుపుతున్న భారతీయ రైల్వే
అటు మహా కుంభమేళా వేడుక కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేశ నలుమూలల నుంచి తరలి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏకంగా 13 వేల రైళ్లను షెడ్యూల్ చేసింది. వీటిలో 10 వేల రెగ్యులర్ రైళ్లు ఉండగా, మిగతా 3 వేలు ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. రైల్లో వచ్చే భక్తుల ప్రత్యేక వసతి ఏర్పాటు చేసింది రైల్వేశాఖ. ప్రయాగరాజ్ సమీపంలో ఏకంగా లక్ష టెంట్లను నిర్మించింది. నామమాత్రపు ఛార్జ్ తో అందులో వసతి కల్పిస్తున్నది. అటు పలు ప్రధాన నగరాల నుంచి మహా కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం కుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో భారత్ గౌరవ్ రైళ్లను నడిపిస్తున్నది.
సికింద్రాబాద్ నుంచి మహాకుంభమేళాలకు భారత్ గౌరవ్ రైలు
ఇక తాజాగా‘మహా కుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర’ పేరుతో భారత్ గౌరవ్ రైలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సోమవారం(జనవరి 20న) నాడు ప్రారంభం అయ్యింది. రైల్వే అధికారులు ఈ రైలుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు వారణాసి, ప్రయాగరాజ్, అయోధ్య పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రయాణించనుంది. అటు సికింద్రాబాద్ నుంచి మరో మహా కుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర భారత్ గౌరవ్ రైలు ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. తాజాగా ఈ రైలుకు సంబంధించిన ప్యాకేజీని సైతం IRCTC ప్రకటించింది.
Bharat Gaurav Tourist train from Secunderabad to Maha Kumbh (Prayagraj) Commences journey today
👉Places covered in this Bharat Gaurav Tourist Train are " Varanasi- Prayagraj -Ayodhya"@drmsecunderabad @RailMinIndia #BharatGaurav #MahaKumbh2025 #KumbhRailSeva2025 pic.twitter.com/YApKaSwIBg
— South Central Railway (@SCRailwayIndia) January 20, 2025
స్పెషల్ రైలు ఏ ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్తుందంటే?
సికింద్రాబాద్ నుంచి ప్రారంభమైన మహా కుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర భారత్ గౌరవ్ రైలు యూపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కలుపుతూ వెళ్తుంది. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం, వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి, అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గరి దేవాలయాలను సందర్శించేలా అధికారులు ఏర్పాటు చేశారు.
ఈ స్పెషల్ రైలు ఎక్కడెక్కడ ఆగుతుందంటే?
ఇక మహా కుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర భారత్ గౌరవ్ రైలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు స్టేషన్లలో ఆగుతుంది. తెలంగాణలో సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో పర్యాటకులు ఈ రైలును ఎక్కే అవకాశం ఉంది. ఈ టూర్ 7 రాత్రులు, 8 పగళ్లు కొనసాగనుంది.
Read Also: ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లలో రిజర్వేషన్ అవసరం లేదు, నేరుగా టికెట్ తీసుకొని ఎక్కేయొచ్చు!