Ambati On CM Chandrababu: దావోస్ టూర్‌లో చంద్రబాబు టీమ్ ఏం చేస్తోంది? సైకిల్ పార్టీ నేతలు వ్యక్తి పూజలో నిమగ్నయ్యారా? కావాలనే మీడియాకు మసాలా ఇస్తున్నారా? వారం రోజులుగా జరుగుతున్న డిప్యూటీ సీఎం, సీఎం వ్యవహారానికి ఎందుకు ఫుల్‌స్టాప్ పెట్టలేదు? దావోస్ వేదికగా ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు వైసీపీకి అస్త్రాలను ఇచ్చిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
అధికార టీడీపీ నేతలు వ్యక్తి పూజలో నిమగ్నమయ్యారు. వారం కిందట మంత్రి లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందేనంటూ నేతలు ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. పార్టీ కోసం కష్టపడ్డారని, ఇస్తే తప్పేముందని కొందరి మాట. ఈ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం.
పెట్టుబడుల కోసం ఆదివారం రాత్రి సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఓ టీమ్ దావోస్‌కు వెళ్లింది. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు లోకేష్, టీజీ భరత్ ఉన్నారు. అక్కడి ఎన్నారైల సమావేశంలో మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రవాస భారతీయులను ఉద్దేశించి మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నచ్చినా, నచ్చక పోయినా రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని ప్రస్తావించారు. దీంతో అక్కడి తెలుగువాళ్లు ఈలలు, కేరింతలతో సందడి నెలకొంది. అక్కడికి మనం ఎందుకోసం వెళ్లాము? చేస్తున్నదేంటి అంటూ గత రాత్రి తెలుగు టీవీ ఛానెళ్లలో ఒకటే చర్చ.
ALSO READ: మిట్టల్ గ్రూప్ ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు, లోకేష్ భేటీ.. భావనపాడు గురించి
ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది వైసీపీ. వెంటనే ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబు లైన్‌లోకి వచ్చేశారు. మంత్రి టీజీ భరత్ మాట్లాడిన చిన్న పార్టును కట్ చేసి అందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేశారు. దానికి చిన్న క్యాప్షన్ సైతం ఇచ్చేశారు. ‘దావోస్ వెళ్లి ఏమి సాధిస్తారో కానీ.. లోకేష్ ముఖ్యమంత్రి కావాలని వెల్లడించార’ని రాసుకొచ్చారు.
అంబటి షేర్ చేసిన వీడియోకు టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య రకరకాల కామెంట్స్ రైజ్ అవుతున్నాయి. అన్నట్లు సోమవారం బిగ్ టీవీ ఛానెల్‌తో మాట్లాడిన జనసేన నేత కిరణ్ రాయల్ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. తమ అభిప్రాయాలు బయటపెట్టి, ప్రత్యర్థులకు అస్త్రాలను ఇస్తున్నామని చెప్పుకనే చెప్పారు. కిరణ్ మాటలు అక్షరాలా నిజమైంది.
లోకేష్‌కు డిప్యూటీ పదవి వ్యవహారంపై రాత్రి పలు ఛానెళ్లు డిబేట్లు నిర్వహించాయి. అందులో సీపీఎంకి చెందిన ఓ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలో పదవుల విషయానికి సంబంధించి తన దగ్గర ఓ సమాచారం ఉందన్నారు. సీఎం చంద్రబాబును మోదీ కేబినెట్‌లోకి తీసుకునే అవకాశముందని చెప్పుకొచ్చారు. అప్పుడు పవన్ సీఎంగా, లోకేష్ డిప్యూటీ సీఎంగా ఉంటారని మనసులోని మాట బయటపెట్టారు.
ఇప్పుడున్న పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడం కావాలని, పదవులు ముఖ్యం కాదన్నారు. లోకేష్ పదవి వ్యవహారంపై ఇప్పుడు చర్చ అవసరం లేదని తేల్చేశారు. టీడీపీ హైకమాండ్ చేసిన సూచనలతో నేతలు మెత్తబడినట్టు కనిపిస్తోంది. ఈ వ్యవహారం సైకిల్ పార్టీని చిన్న డ్యామేజ్ చేసిందన్నది కొందరి విశ్లేషకుల మాట.
దావోస్ వెళ్లి ఏమి సాధిస్తారో కానీ
లోకేష్ ముఖ్యమంత్రి కావాలని వెల్లడించారు!@ncbn @naralokesh pic.twitter.com/9QApqOHHvb— Ambati Rambabu (@AmbatiRambabu) January 20, 2025