Indian Railways: గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లలో భద్రతను పెంచింది. ప్రయాణీకుల భద్రతకు పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగానే తరచుగా రైళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత కొద్ది రోజులుగా రైళ్లలో ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని చంపేస్తున్న సైకోను తాజాగా గుజరాత్ లో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోనూ నిందితుడు పలు హత్యాల చేయడంతో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు పీటీ వారెంట్ మీద తీసుకొచ్చి విచారిస్తున్నారు. తాజాగా గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరే రైల్లోనూ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ చెకింగ్ లో ఓ ఘటన చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
టాయిలెట్ నుంచి వింత శబ్దాలు.. ఓపెన్ చేసి చూస్తే..
చెకింగ్ లో భాగంగా పోలీసులు బోగీలను తనికీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓ బోగీలోని టాయిలెట్ నుంచి వింత శబ్దాలు వినిపించాయి. వెంటనే పోలీసులు అందులో ఏం ఉందో చూడాలనుకున్నారు. అయితే, టాయిలెట్ లోపలి నుంచి బోల్ట్ చేసి ఉంది. డోర్ కొట్టినా సరైన రెస్పాన్స్ లేదు. ఏదో జరుగుతుందని భావించిన రైల్వే పోలీసులు బలవంతంగా ఆ డోర్ ను ఓపెన్ చేశారు. అందులో ఇద్దరు పిల్లలు బంధించి ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. ఇంతకీ ఆ పిల్లలు ఎవరు? అందులో ఎవరు బంధించారు? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారు చిన్న పిల్లలు కావడంతో కుటుంబ సభ్యుల వివరాలు ఏవీ చెప్పలేకపోతున్నారు. ఈ విషయాన్ని వెంటనే రైల్వే పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
చైల్ట్ వెల్ఫేర్ కమిటీకి పిల్లల అప్పగింత
ప్రస్తుతం ఈ ఇద్దరు పిల్లలను గోరఖ్ పూర్ జిల్లా చైల్ట్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించనున్నట్లు నార్త్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. వారి వివరాలు తెలిసే వరకు అక్కడే ఉంటారని చెప్పారు. మరోవైపు అసలు ఆ పిల్లలు ఎవరు? వారిని రైల్లో ఎవరు బంధించారు? అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. ‘ఆపరేషన్ నాన్హే ఫరిష్టే’ పేరుతో పిల్లలను రక్షించేందుకు రైల్వేశాఖ కృషి చేస్తుంటన్నారు. అపహరణకు గురైన పిల్లలను రక్షించేందుకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
644 మంది పిల్లలను రక్షించిన రైల్వే అధికారులు
నార్త్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో గత ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో పలు స్టేషన్లు, రైళ్లలో 644 మంది పిల్లలను ఆర్‌పిఎఫ్ అధికారులు కాపాడారని పంకజ్ కుమార్ తెలిపారు. వీరిలో ఎక్కువ మంది చిన్న పిల్లలు ఉన్నట్లు వెల్లడించారు. గత ఏడాది ఈస్టర్న్ రైల్వేలో 368 మంది చిన్నారులను కాపాడినట్లు చెప్పారు. ఈ ఏడాది ఆసంఖ్య మరింత పెరిగిందన్నారు. 2024లో కాపాడిన పిల్లల్లో 433 మంది బాలురు, 211 మంది బాలికలు ఉన్నట్లు తెలిపారు. ఈస్టర్న్ రైల్వేలో తప్పిపోయిన, అపహరణకు గురైన పిల్లలను కాపాడేందుకు ప్రధాన రైల్వే స్టేషన్లలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Read Also: రైలు బోగీలపై పసుపు, తెలుపు గీతలు.. ఇంతకీ వాటి అర్థం ఏంటో తెలుసా?