E-Paper
Advertisement

GPS, పానిక్ బటన్ లేకపోతే పర్మిట్ ఇవ్వొద్దు.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

GPS, పానిక్ బటన్ లేకపోతే పర్మిట్ ఇవ్వొద్దు.. రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
Advertisement

Public Transport Vehicles: దేశవ్యాప్తంగా ప్రజా రవాణా వాహనాల భద్రతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బస్సులు, క్యాబ్‌లు, స్కూల్ వాహనాలు వంటి ప్రయాణికుల రవాణా వాహనాల్లో స్పీడ్ గవర్నర్లు, వాహన లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు (GPS), అత్యవసర పానిక్ బటన్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది. ఈ నిబంధనలను వెంటనే అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. జస్టిస్ J.B. పార్దీవాలా, జస్టిస్ K.V. విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రజా రవాణా వాహనాల్లో భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

మోటార్ వెహికల్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే?

కేంద్ర మోటార్ వెహికల్స్ (CMV) రూల్స్, 1989 ప్రకారం ప్రజా రవాణా వాహనాల్లో స్పీడ్ నియంత్రణ పరికరాలు, వాహన ట్రాకింగ్ వ్యవస్థలు, పానిక్ బటన్లు ఉండాలి. అయితే, చాలా రాష్ట్రాల్లో ఈ నిబంధనలు పూర్తిగా అమలు కావడం లేదని కోర్టు గమనించింది. కోయంబత్తూరుకు చెందిన సర్జన్ ఎస్. రాజశేఖరన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ విచారణ కొనసాగిస్తున్నారు. దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, వాటిలో మరణాలు, భద్రతా నిబంధనల అమలులో ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా, సుప్రీంకోర్టు మరో ముఖ్య అంశాన్ని ప్రస్తావించింది.  దేశంలో చాలా మంది డ్రైవర్లు లేన్ డ్రైవింగ్ నిబంధనలు పాటించడం లేదని, దీని వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించింది.

ఆందోళనకరంగా వాస్తవ పరిస్థితులు 

Advertisement

అటు సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ సమర్పించిన వివరాలు కూడా ఆందోళన కలిగించాయి. 2024లో పార్లమెంటులో సమర్పించిన గణాంకాల ప్రకారం, దేశంలోని 5 శాతం కంటే తక్కువ రవాణా వాహనాల్లో మాత్రమే స్పీడ్ గవర్నర్లు ఉన్నాయని, 1 శాతం కంటే తక్కువ వాహనాల్లో GPS ట్రాకింగ్ పరికరాలు అమర్చబడ్డాయని తెలిపారు. ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు, భద్రతా నిబంధనలు పాటించని ప్రజా రవాణా వాహనాలకు ఫిట్‌ నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు జారీ చేయకూడదని స్పష్టం చేసింది. అలాగే ఈ నిబంధనలను అమలు చేస్తున్న వివరాలతో రాష్ట్రాలు స్టేటస్ రిపోర్టులు సమర్పించాలని ఆదేశించింది.

స్పీడ్ గవర్నర్లు, పానిక్ బటన్లు తప్పనిసరి!

అటు అన్ని కొత్త వాహనాల్లో తయారీ దశలోనే స్పీడ్ గవర్నర్లు, GPS ట్రాకింగ్ పరికరాలు, పానిక్ బటన్లు అమర్చేలా వాహన తయారీ సంస్థలతో చర్చలు జరపాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖకు సూచించింది. ఇప్పటికే రోడ్లపై నడుస్తున్న వాహనాలకు ఈ పరికరాలను రెట్రోఫిట్ చేయాలని ఆదేశించింది. ప్రయాణికుల భద్రత కోసం ఈ పరికరాలు ఎంత ముఖ్యమో కూడా కోర్టు వివరించింది.GPS ట్రాకింగ్ ద్వారా వాహనం ఎక్కడ ఉందో కంట్రోల్ రూమ్‌కు వెంటనే సమాచారం చేరుతుంది. ప్రమాదం, హైజాక్, వేధింపులు, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో పానిక్ బటన్ నొక్కితే పోలీసులకు, మహిళా భద్రతా కేంద్రాలకు వెంటనే అలర్ట్ వెళ్తుంది. దీంతో అధికారులు త్వరగా స్పందించే అవకాశం ఉంటుంది.

Advertisement

అటు, మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయాల్సిన జాతీయ రోడ్డు భద్రతా బోర్డును ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడంపై కూడా సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడు నెలల్లోగా బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది.

Read Also: హైదరాబాద్ నుంచి చెన్నైకి బుల్లెట్ రైలు.. జస్ట్ 3 గంటల్లోనే ప్రయాణం!

Related News

పాత బంగ్లాలో అర్ధరాత్రి విడిది.. దెయ్యం లేదని నిరూపిస్తే.. రూ.52 వేలు మీవే!

Gulf Job Scam: విజిట్ వీసా vs వర్క్ వీసా.. ఈ ఒక్క తప్పు చేస్తే గల్ఫ్‌లో జీవితం నాశనమే!

సహారా ఎడారి లేకపోతే అమెజాన్ అడవి ఉండేది కాదా? రెండింటి మధ్య అసలు లింకేంటి?

ఒకప్పుడు పాక్ లో.. ఇప్పుడు ఇండియాలో.. ఈ అందమైన గ్రామం గురించి మీకు తెలుసా?

హైడ్రోజన్ రైలుపై రాళ్లు విసిరారా? వైరల్ వీడియోపై రైల్వే క్లారిటీ!

రాత్రిపూట వెలిగే మొక్కలు వచ్చేశాయి.. ‘అవతార్‘ సినిమాలో చూసింది ఇప్పుడు నిజమైంది!

ఈ నదుల్లో నీళ్లే కాదు, బంగారం ప్రవహిస్తుంది.. నిజంగా అద్భుతం!

48 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన భార్య.. పచ్చబొట్టు చూసి గుండెలకు హత్తుకున్న భర్త!

Big Stories

Advertisement
×