BIG TV LIVE Originals: భారతీయ రైల్వే సేవల కోసం రూపొందించిన యాప్ లు స్వరైల్ (SwaRail), ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ (IRCTC Rail Connect). ప్రస్తుతం ప్రయాణీకలు ఈ రెండు యాప్స్ ద్వారానే రైల్వే సేవలను పొందుతున్నారు. అయితే, వీటి ఫీచర్లు, సేవల విషయంలో చాలా తేడాలు ఉన్నాయి. వీటిలో ఏది బెస్ట్? ఎందుకు? అనేది ఇప్పుడు చూద్దాం..
⦿ స్వరైల్ (SwaRail):
స్వరైల్ యాప్ ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) రూపొందించింది. దీనిని సూపర్ యాప్ గా పిలుస్తున్నారు. ఇది రైల్వే సేవలు అన్నింటినీ ఒకేచోట అందిస్తోంది. ఫీచర్ల విషయానికి వస్తే.. రిజర్వ్‌డ్, అన్ రిజర్వ్‌డ్, ప్లాట్ ఫాం టికెట్ల బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ట్రైన్ ట్రాకింగ్, PNR స్టేటస్, ఫుడ్ ఆర్డర్, పార్సిల్ సేవలు, రైల్ మదద్ సదుపాయాలు ఈ యాప్ లో ఉంటాయి. ఈ యాప్ ను ఒకే లాగిన్ తో అన్ని సేవలను పొందే అవకాశం ఉంటుంది. అత్యాధునిక, సింపుల్ యూజర్ ఇంటర్ ఫేస్, తక్కువ స్టోరేజీ స్పేస్ ను కలిగి ఉంటుంది. రియల్ టైమ్ ట్రైన్ స్టేటస్, హోటల్ బుకింగ్స్, టూరిజం ప్యాకేజీలు, ట్రావెల్ ఇన్సూరెన్స్ ను పొందే అవకాశం ఉంటుంది.
లాభ నష్టాలు
రైల్వేకు సంబంధించిన ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ స్వరైల్ యాప్ లో ఉంటుంది. ఒక్కో సర్వీస్ కు ఒక్కో యాప్ వాడాల్సిన అవసరం లేదు. ఫాస్ట్ బుకింగ్ కోసం ఆటోమేటిక్ R-వాలెట్ ను ఉపయోగించుకోవచ్చు. తత్కాల్ బుకింగ్ లో IRCTC కంటే మెరుగైన పనితీరును కలిగి ఉంటుంది. ఆటో లాగ్ అవుట్ సమస్యలు తక్కువగా ఉంటాయి. ఇంకా కొన్ని బగ్స్ ఉన్నట్లు వినయోగదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. తత్కాల్ బుకింగ్ లో ఇంకాస్త మెరుగుదల అవసరం అంటున్నారు.
⦿ ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ (IRCTC Rail Connect):
ఐఆర్సీటీసీ అనేది ఇప్పటి వరకు ఉపయోగించిన రైల్వే అధికారిక యాప్. ప్రధానంగా టికెట్ బుకింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. ఫీచర్ల విషయానికి వస్తే, రిజర్వ్‌డ్ టికెట్ బుకింగ్, PNR స్టేటస్ చెక్, రిఫండ్ ట్రాకింగ్ ను తెలుసుకోవచ్చు. UPI, నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్‌ల ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ లాగిన్ ఆప్షన్ ను కలిగి ఉంది.
లాభ నష్టాలు
రిజర్వ్‌డ్ టికెట్ బుకింగ్ లో అత్యంత నమ్మదగిన యాప్. ఇప్పటి వరకు ఏకంగా 5 కోట్లకు పైగా డౌన్ లోడ్స్ ను కలిగి ఉంది. పాత యూజర్ ఇంటర్ ఫేస్ ను కలిగి ఉండటం, తరచూ హ్యాంగ్ లేదంటే క్రాష్ అవడం ప్రతికూల విషయాలు. అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు, ఫుడ్ ఆర్డర్, పార్సిల్ సేవలు అందుబాటులో లేవు. వేర్వేరు సర్వీసులకు వేర్వేరు లాగిన్లు అవసరం.
స్వరైల్ vs ఐఆర్సీటీసీ:
⦿ ఏది బెస్ట్ యాప్?
రైల్వే సంబంధిత అన్ని సేవలు అంటే టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, రైలు ట్రాకింగ్, కంప్లైంట్స్ ఒకే యాప్ లో కావాలంటే స్వరైల్ బెస్ట్. అంతేకాదు, అన్‌రిజర్వ్‌డ్, ప్లాట్‌ఫాం టికెట్లు బుక్ చేయాలనుకున్నా, ఆధునిక ఇంటర్ ఫేస్, సింగిల్ లాగిన్, తక్కువ స్టోరేజ్ స్పేస్ కావాలనుకున్నా స్వరైల్ యాప్ ను ఉపయోగించడం మంచిది. ఇతర సేవలు అవసరం లేకుండా కేవలం రిజర్వ్‌డ్ టికెట్లు బుక్ చేయాలనుకుంటే ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ బెస్ట్. సో, స్వరైల్ యాప్ ఆల్ ఇన్ వన్ సొల్యూషన్‌గా, ఆధునిక ఫీచర్లతో మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉంటుంది. ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ కంటే ఎక్కువ సేవలను అందిస్తోంది. కాబట్టి, మీరు ఒక సమగ్ర రైల్వే యాప్ కోసం చూస్తుంటే, స్వరైల్ బెస్ట్ ఆప్షన్. రెండు యాప్‌లు ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: ‘స్వరైల్’ యాప్ వాడుతున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలియాల్సిందే!