China : చైనాలో పెళ్లి ఓ పెద్ద సమస్య. జాబులు దొరకట్లేదు. లైఫ్‌లో సెటిల్‌మెంట్ ఉండట్లేదు. ఆర్థిక మాంద్యం డ్రాగన్ కంట్రీని డేంజర్‌లో పడేసింది. పెళ్లి అంటేనే భయపడిపోతున్నారు అక్కడి యువకులు. ఆదాయం ఓ వర్రీ అయితే.. పిల్ల దొరక్కపోవడం అంతకుమించి ప్రాబ్లమ్. సేమ్ ఇండియాలో మాదిరే.. చైనాలోనూ అమ్మాయిలు తక్కువగా ఉన్నారు. ఉన్నా వారికి బోలెడు డిమాండ్స్. బాగా ఉన్నోడిని కూడా ఏదో ఒక సిల్లీ రీజన్‌తో రిజెక్ట్ చేసేస్తున్నారు. ఏరికోరి వరుడిని ఎంచుకుంటున్నారు. అందుకే, చైనాలో పెళ్లికూతురి కొరత ఏర్పడింది. పెళ్లి కాని ప్రసాదులు చైనాలో 3 కోట్ల మంది ఉన్నారు. ఇదే ఛాన్స్‌గా బంగ్లాదేశ్ మాఫియా రంగంతోకి దిగింది.
పెళ్లిళ్ల ముఠాలు..
బంగ్లా అమ్మాయిలను అక్రమంగా చైనాకు రవాణా చేసి అక్కడి వాళ్లతో పెళ్లి చేస్తోంది. చైనా, బంగ్లాదేశ్ మధ్య క్రాస్ బోర్డర్ మ్యారేజెస్ సంఖ్య బాగా పెరుగుతోంది. అయితే, ఇవేమీ ప్రేమ వివాహాలు గట్రా కాదు. అంతా ఇల్లీగల్. పెళ్లికూతుర్లకు చైనాలో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. అక్కడి యువకులకు గాలం వేస్తున్నాయి బంగ్లాదేశీ ముఠాలు. టిక్‌టాక్, డేటింగ్ యాప్స్, అన్‌అఫీషియల్ మ్యాట్రిమోనీ సైట్లతో పెళ్లిళ్ల దందా జరుపుతున్నారు.
Also Read : పాక్‌లో యూట్యూబర్ జ్యోతికి ఆరుగురు బాడీగార్డ్స్
అలా పెళ్లి చేసుకున్నారో.. చైనా వార్నింగ్
అసలే బంగ్లాదేశ్‌లో భారీ పేదరికం. చైనా వాళ్లను పెళ్లి చేసుకుంటే.. మంచి జీవితం ఉంటుందని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు బాగుంటాయని, లైఫ్‌లో ఈజీగా సెటిలై పోవచ్చని బంగ్లా బ్రోకర్లు స్థానిక యువతులను మభ్య పెడుతున్నారు. ఆశ పడిన అమ్మాయిలను చైనా అబ్బాయిలకు అమ్మేస్తున్నారు. అయితే, ఇవన్నీ చట్ట విరుద్ధంగా జరుగుతుండటంతో బంగ్లాదేశ్‌లోని చైనా రాయబార కార్యాలయం అలర్ట్ అయింది. ఇలాంటి పెళ్లిళ్లకు దూరంగా ఉండాలని.. కేసుల చిక్కుల్లో ఇరుక్కుపోవద్దని తమ దేశ యువకులను హెచ్చరించింది. ఇల్లీగల్ మ్యారేజెస్ చేసుకుంటే.. మానవ అక్రమ రవాణా కింద చట్టపరమైన చర్యలు ఫేస్ చేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది చైనా. ఇలాంటి కేసుల్లో బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం ఏడేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష వరకూ పడొచ్చని చెబుతున్నారు.