Railway Loco Pilots: రైల్వే వ్యవస్థ అంతరాయం లేకుండా కార్యకలాపాలు నిర్వహించాలంటే లోకో పైలెట్లు చాలా ముఖ్యం. పని ఒత్తడి లేకుండా విధులు నిర్వహించినప్పుడే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్లు పని చేస్తాయి. కానీ, బ్రిటన్ లో పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. అవసరానికి సరిపడ లోకో పైలెట్లు లేకపోవడంతో ఏకంగా రాత్రిపూట రైల్వే సేవలను రద్దు చేస్తున్నారు అధికారులు. అంతేకాదు, లోకో పైలెట్లను రిక్రూట్ చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో లోకో పైలెట్ల రిక్రూట్ మెంట్ వయసును 21 ఏండ్ల నుంచి 18 ఏండ్లకు కుదించాలని బ్రిటన్ రవాణాశాఖ వెల్లడించింది.
రైల్వే అభ్యర్థుల వయోపరిమితి తగ్గింపు
ప్రస్తుతం బ్రిటన్ లో రైల్వే ఉద్యోగాల్లో చేరాలంటే కనీస వయసు 21 ఏండ్లు ఉండాలి. కానీ, లోకో పైలెట్లు అందుబాటులో లేకపోవడంతో రాత్రిపూట ఏకంగా 87 శాతం రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రైల్వే ప్రవేశ వయసును 18 ఏండ్లకు కుదించాలని నిర్ణయించింది. చాలా మంది లోకో పైలెట్లు స్వచ్ఛందంగా అదనపు షిఫ్టులలో పని చేయడానికి మొగ్గు చూపుతున్నారు. లేకపోతే పరిస్థితి మరింత అధ్వాన్నంగా మరిపోయేది. ప్రస్తుతం, బ్రిటిష్ రైలు డ్రైవర్ల సగటు వయస్సు 48 సంవత్సరాలు. వీరిలో 30% మంది 2029 నాటికి పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రైల్వే అభ్యర్థుల వయసు కుదించాలని బ్రిటన్ రవాణా భావిస్తోంది. గత సంవత్సరం కన్జర్వేటివ్ ప్రభుత్వం నిర్వహించిన డ్రైవర్ల కనీస వయస్సును తగ్గింపు సంప్రదింపులకు ప్రజల నుంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చినట్లు వెల్లడించింది.
లోకో పైలెట్ల వయో పరిమితి తగ్గించిన పలు దేశాలు
ఇప్పటికే రైలు డ్రైవర్ల వయస్సును ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాలు తగ్గించాయని గుర్తు చేశారు. 2007లో ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ 18 ఏళ్ల వయస్సు వారికి అండర్‌గ్రౌండ్‌లో డ్రైవర్ అప్రెంటిస్ షిప్ లను ప్రారంభించింది. ప్రధాన రైళ్లను నడపడానికి శిక్షణ సాధారణంగా ఒకటి నుంచి రెండు సంవత్సరాల వరకు పడుతుంది. ఫలితంగా 20 ఏండ్లు పూర్తయ్యాకే రైళ్లు నడిపే అవకాశం ఉంటుంది.
Read Also: ఎడాది పొడవునా మంచు, ఎత్తైన జలపాతాలు, లోయలు.. ఇంతకంటే బెస్ట్ ప్లేస్ ఉంటుందా ?
లోకో పైలెట్ ప్రమాణాల్లో నో ఛేంజ్!
రైల్వే ఉద్యోగుల వయో పరిమితి తగ్గించినప్పటికీ, లోకో పైలెట్లకు సంబంధించి ఉద్యోగ ప్రమాణాల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని బ్రిటన్ అధికారులు వెల్లడించారు. పైగా యువ లోకో పైలెట్లు మరింత సమర్థవంతంగా రైలు నడపడంలో ఈజీగా మెళకువలు నేర్చుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కొత్త ఉద్యోగ, అప్రెంటిస్ షిప్ అవకాశాలు అందుబాటులోకి రావచ్చని బ్రిటన్ రవాణా శాఖ అభిప్రాయపడింది. చాలా మంది యువకులు ఉద్యోగాల కోసం కాలేజీ చదువులను వదిలేస్తున్నారని, అలాంటి వారు రైల్వే ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చని వెల్లడించింది.
Read Also: ఈ రైలు ప్రపంచమంతా తిరిగేస్తుంది.. సింగపూర్ నుంచి ఆ దేశానికి ఎన్ని రోజుల్లో చేరుతుందంటే?