BigTV English

Longest Train Journey: ఈ రైలు ప్రపంచమంతా తిరిగేస్తుంది.. సింగపూర్ నుంచి ఆ దేశానికి ఎన్ని రోజుల్లో చేరుతుందంటే?

Longest Train Journey: ఈ రైలు ప్రపంచమంతా తిరిగేస్తుంది.. సింగపూర్ నుంచి ఆ దేశానికి ఎన్ని రోజుల్లో చేరుతుందంటే?

 World’s Longest Train Journey: ప్రపంచ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థలు రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ అత్యంత వేగవంతమైన రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రయాణాలు చేసే బోలెడు రైళ్లు ఉన్నాయి. వాటిలో లాంగెస్ట్ రైల్వే జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రైలు ఏకంగా 13 దేశాలను కలుపుతుంది. పోర్చుగల్ నుంచి సింగపూర్ వరకు జర్నీ చేస్తుంది. 18, 755 కిలో మీటర్ల మేర ఏకబిగిన ప్రయాణం చేస్తుంది. ఈ రైలు ప్రయాణం 14 రోజుల పాటు కొనసాగుతుంది. పలు దేశాలు, భిన్న సంస్కృతులు, వేష భాషలు కలిగిన జనాలు ఈ రైలులో ప్రయాణం చేస్తారు.


ఈ రైలు ప్రయాణానించే దేశాలు ఇదే!

ఈ సుదూర రైలు ప్రయాణం పోర్చుగల్ లోని అత్యంత సుందరమైన లాగోస్ నగరం నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి స్పెయిన్ కు చేరుకుంటుంది. ఆ తర్వాత రష్యా, చైనా, వియత్నాం, థాయ్ లాండ్ మీదుగా సింగపూర్ కు చేరుకుంటుంది. ఈ రైలు పారిస్, మాస్కో, బీజింగ్, బ్యాంకాక్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత నగరాలను కనెక్ట్ చేస్తూ ముందుకు సాగుతుంది. ఈ రైలు మొత్త 11 రూట్ స్టాఫ్ లను కలిగి ఉంటుంది. ఈ ప్రయాణం ఒకసారి మొదలైతే, రెండు వారాల పాటు ఆగకుండా కొనసాగుతుంది.


పలు దేశాల సహకారంతో సుదూర రైలు ప్రయాణం

ఈ రైలును ఏ ఒక్క దేశం సొంతంగా నడిపించదు. పలు దేశాలు కలిపి ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యాయి. కొద్ది నెలల క్రితం ప్రారంభమైన లావోస్, చైనా రైల్వే లైన్ యూరప్, ఆసియా ఖండాలను కనెక్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. లావోస్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు పోర్చుగల్ నుంచి సింగపూర్ వరకు ఎలాంటి ఇబ్బందులు లేని ప్రయాణాన్ని అందించడంలో ఈ రైల్వే లైన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నది.

ఈ రైల్లో ప్రయాణించాలంటే ఛార్జ్ ఎంత అవుతుందంటే?  

ఇక ఈ పూర్తి రైలు ప్రయాణం చేయడానికి టికెట్ ధర 1350 డాలర్లుగా ఉంటుంది. భారత కరెన్సీలో దాదాపు రూ. 1.13,998. విమాన ఛార్జీలతో పోల్చితే చాలా తక్కువగానే ఉంటుంది. అయితే, ఈ రైలు ప్రయాణం చేయాలంటే చాలా ముందుగానే ప్లాన్ చేసుకోవాలంటుంది. ఈ రైలు ప్రయాణానికి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. బెర్త్ సెలెక్షన్ కు చూడా చాలా పోటీ ఉంటుంది.

మొదట్లో ఇబ్బందులు ఉన్నా..

గతంలో పోర్చుగల్ నుంచి సింగపూర్ వరకు రైలు ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకే లైన్ కాకుండా పలు మార్గాల ద్వారా వెళ్లాల్సి వచ్చేది. ఆ తర్వాత చైనాలోని కున్మింగ్, లావోస్ రాజధాని  వియంటియాన్ కు కొత్త రైల్వే మార్గం నిర్మించారు. ఈ లైన్ కు పోర్చుగల్- సింగపూర్ రూట్ ను లింక్ చేశారు. ఆ తర్వాత ఈ రూట్ ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే లైన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైల్లో ప్రయాణించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు ఈ రైలు 100కు 100 శాతం ఆక్యుపెన్సీతో నడవడం విశేషం.

Read Also: రైలులో చైన్ లాగితే ఇత్తడే.. అది ఏయే సందర్భాల్లో వాడాలంటే?

Related News

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Watch Video: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..

Big Stories

×