అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఆ కారులోకి ఎక్కి కూర్చుంటే, మనం వెళ్లాల్సిన ప్రదేశానికి తీసుకెళ్తుంది. అయితే, ఈ కార్లు మరీ అంత సేఫ్ కాదంటున్నారు నిపుణులు. వాళ్లు అన్నట్లుగానే తాజాగా ఓ కారు, వెళ్లి నేరుగా రైలును ఢీకొట్టింది. ఈ ఘటన అమెరికాలో సంచలనం కలిగించింది. పెన్సిల్వేనియాలో ఈ ఘటన జరిగింది. టెస్లా మోడల్ 3 కారు ఈ ప్రమాదానికి గురైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటకు వచ్చాడు. కానీ, కారు రైలును ఢీకొట్టడంతో సైడ్ మిర్రర్ విరిగిపోయింది. అధికారులు క్రేన్ ఉపయోగించి మోడల్ 3 కారును పట్టాల మీది నుంచి తొలగించారు. .
2016లో అందుబాటులోకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు
టెస్లా కారు ‘సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్’లో ఉందని, ఫలితంగా రైలు ట్రాక్ పై చిక్కుకుపోయిందని అధికారులు తెలిపారు. 2016లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కార్లు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తాయని టెస్లా వెల్లడించింది. టెస్లా 15,000 డాలర్లకు పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ, ఇప్పటికీ ఈ కార్లు పలుమార్లు ప్రమాదాలకు గురయ్యాయి. అదే సమయంలో టెస్లా డ్రైవర్లు నిర్లక్ష్యంగా ప్రవర్తించినా, పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ప్రమాదాలకు గురికాకుండా కంట్రోల్ చేసిన సందర్భాలున్నాయి. తాజా ప్రమాదం మాత్రం సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ లో ఉన్నప్పటికే జరిగిందని అధికారులు గుర్తించారు. ప్రతికూల సంకేతాలను ఇవ్వడంలో కారు ఆలస్యం చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు.
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను పూర్తిగా నమ్మలేం!
టెస్లా అనే కాదు, సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్స్ పూర్తిగా నమ్మదగినవి కావు. మానవ పర్యవేక్షణ లేకుండా కొన్ని సందర్భాలలో తప్పుగా నడుచుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ సాంకేతిక లోపాలు: సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్స్ లో లోపాలు, సాఫ్ట్ వేర్ సమస్యలు తలెత్తుతాయి. దీని వలన రైలు పట్టాలను గుర్తించడంలో విఫలం అయ్యే అవకాశం ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల కెమెరాలు, సెన్సార్లు రైలు పట్టాలను స్పష్టంగా గుర్తించలేకపోవచ్చు. ముఖ్యంగా తక్కువ వెలుతురు, ఇతర అడ్డంకులు ఉన్నప్పుడు అలా జరుగుతుంది.
⦿ మానవ పర్యవేక్షణ లేకపోవడం: డ్రైవర్ పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు కూడా, కొన్నిసార్లు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే స్వయంగా నియంత్రించాలి.
Read Also: 2 గంటల పాటు రైలును ఆపేసిన ప్రయాణీకులు.. ఎక్కనే ఎక్కమంటూ ఇంజిన్ ముందు హంగామా!
సమస్యను ఎలా పరిష్కరించాలి?
⦿ సిస్టమ్ అప్‌డేట్‌లు: టెస్లా వంటి కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్స్‌ను నిరంతరం అప్‌డేట్ చేయడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాయి.
⦿ మెరుగైన సెన్సార్లు: మెరుగైన కెమెరాలు, సెన్సార్ల ఉపయోగం ద్వారా రైలు పట్టాలను గుర్తించడం సులభతరం అవుతుంది.
⦿ మానవ పర్యవేక్షణ: డ్రైవర్లు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టమ్ సరిగ్గా పని చేయడం లేదని భావించినప్పుడు డ్రైవర్ తన నియంత్రణలోకి తీసుకోవాలి.
Read Also: రైలులో ఫుడ్ తింటున్నారా? ఇలా మాత్రం చెయ్యకండి.. బుక్కైపోతారు!