Kannappa Censor: ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో అద్భుతమైన, పౌరాణిక, మైథాలజికల్, సైన్స్ ఫిక్షన్ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణంగా నిలుస్తున్నాయి. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో మంచు విష్ణు (Manchu Vishnu)తన డ్రీం ప్రాజెక్టు కన్నప్ప సినిమా (Kannappa Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా జూన్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఒకేసారి ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నింటిని కూడా పూర్తి చేసుకుంటూ విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు ముందు ప్రతి ఒక్క సినిమా కూడా తప్పనిసరిగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సినిమాలను సెన్సార్ బోర్డుకు (Censor Board)పంపిస్తే సెన్సార్ సభ్యులు ఆ సినిమాని చూసి అందులో ఏవైనా అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే కచ్చితంగా వాటిని తొలగిస్తుంటారు.
సెన్సార్ అభ్యంతరాలు…
ఇలా సినిమాలు అభ్యంతరకర సన్నివేశాలు లేవని సెన్సార్ సభ్యులు సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇలా సెన్సార్ కార్యక్రమాలు అన్ని పూర్తి అయిన తర్వాతనే సినిమా విడుదల చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇక కన్నప్ప సినిమా కూడా జూన్ 27వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటుందని అయితే సెన్సార్ పనులలో కూడా కన్నప్పకు తిప్పలు తప్ప లేదని చెప్పాలి. ఇందులో కొన్ని సన్నివేశాలపై సెన్సార్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.
బ్రాహ్మణ చైతన్య వేదిక…
గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకు బ్రాహ్మణ సంఘాల నుంచి కొన్ని డిమాండ్లు వ్యక్తమైన సంగతి తెలిసిందే. బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన పాత్రలపై బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్ర అభ్యంతరాలు రావటంతో ఈ విషయంపై సెన్సార్ బోర్డు స్పందిస్తూ సినిమా చూసిన తర్వాత తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని వెల్లడించారు. తాజాగా ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఇందులో 13 సన్నివేశాలకు అభ్యంతరం చెప్పినట్టు తెలుస్తుంది. ఇలా ఈ సినిమాలో ఏకంగా 13 సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ సభ్యులు చిత్ర బృందానికి తెలియజేశారట. మరి ఈ సన్నివేశాలపై చిత్ర బృందం స్పందన ఏ విధంగా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి మంచు విష్ణు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇక చివరికి సెన్సార్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమాకు ఇబ్బందులు తలెత్తాయనే తెలుస్తుంది. మరి ఈ సెన్సార్ అభ్యంతరాలపై మంచి విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.