Sonia Gandhi: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ అనారోగ్య సమస్యతో ఆదివారం ఢిల్లీలోనే సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడుతోంది. సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఉదర సంబంధిత సమస్యతో ఆమె హాస్పిటల్‌లోని గ్యాస్ట్రో విభాగంలో చేరినట్టు వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నట్టు ఆస్పత్రి చైర్మన్ అజయ్ స్వరూప్ వెల్లడించారు.
జూన్ 9న సోనియా గాంధీ సర్ గంగారామ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం సిమ్లా పర్యటనలో ఉన్న ఆమెకు రక్త పోటు ఎక్కువ కావడంతో అక్కడ హాస్పిటల్ లో చికిత్స కూడా తీసుకున్నారు.
ALSO READ: Piyush Goyal: సీఎం చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు.. పీయూష్ గోయల్‌కు తప్పిన ప్రమాదం