OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవెయిటింగ్ మూవీస్ లో ‘ఓజీ’ (OG) కూడా ఒకటి. సుజిత్ దర్శకత్వంలో ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డాడు అనే అప్డేట్ తో ఆయన అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఊహించని సీన్ తో థియేటర్లలో కెవ్వు కేక అనిపించడానికి రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.
గూస్ బంప్స్ తెప్పించే సీన్ లో పవన్
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన డేట్స్ నిర్మాతలకి దొరకలేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఇప్పటికే ఆయన మొదలు పెట్టిన రెండు సినిమాలు పెండింగ్లో పడిపోయాయి. ఏళ్ల తరబడి షూటింగ్ జరుపుకుంటున్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఎట్టకేలకు తాజాగా పూర్తయింది. దీంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ‘ఓజి’ షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది.
2023లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ టాలీవుడ్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ‘ఓజి’ మూవీ లో పవన్ కళ్యాణ్ షర్ట్ లెస్ సీన్ తో అదరగొట్టబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఇలా బాడీ షో చేసిన సినిమాలు చాలా అరుదు. ఇక ప్రస్తుతం ‘ఓజి’పై ఉన్న హైప్ ను దృష్టిలో పెట్టుకొని చూస్తే… ఒకవేళ నిజంగానే మేకర్స్ ఇలాంటి సన్నివేశాలు కనుక తెరపై చూపిస్తే థియేటర్లు తగలబడడం ఖాయం అంటున్నారు పవన్ అభిమానులు.
అయితే మరోవైపు మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలక పదవి బాధ్యతలు చేపట్టారు. అలాంటిది సినిమాలలో ఆయన ఇలాంటి సన్నివేశాలు చేస్తే విమర్శలు తప్పవేమో అనే అనుమానాలు లేవనెత్తుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ మహా కుంభమేళాలో దర్శనమిచ్చిన తీరు విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ షర్ట్ లెస్ సీన్ నిజంగానే ‘ఓజీ’లో ఉంటే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Also : ఆ ఓటీటీ చేతిలో పవన్ మూవీ రిలీజ్ డేట్… ఈ పరిస్థితి ఏంటి మన కర్మ కాకపోతే
‘ఓజీ’ షూటింగ్ లో పవన్ కాలు పెట్టేది అప్పుడే
ఇదిలా ఉండగా ‘ఓజి’ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తయింది. మిగిలిన సీన్స్ ని పూర్తి చేయడానికి వచ్చే వారం నుంచి పవన్ కళ్యాణ్ షూటింగ్ కి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్లో ఈ సినిమా కోసం వేసిన సెట్స్ లో కొన్ని రోజులు షూటింగ్ జరగనుంది. అనంతరం 10 రోజుల పాటు అమరావతిలో షూటింగ్ జరగబోతున్నట్టు సమాచారం. ఇక ఈ నెలాఖరులోపు ‘ఓజీ’ మూవీ షూటింగ్ పూర్తి చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీని సెప్టెంబర్ 5న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారని, జూన్లో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి… ఫస్ట్ లిరికల్ సాంగ్ తో ప్రమోషన్స్ షురూ చేయబోతున్నారని టాక్.