India’s Expensive City : అంతర్జాతీయ పర్యాటకులు ట్రావెల్ చేసేందుకు ఖరీదైన నగరాల జాబితాను విడుదల చేశారు. ఇందులో కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం 2024లో విదేశీయులకు అత్యంత ఖరీదైన నగరాలు జాబితాలో హాంకాంగ్ తొలి స్థానంలో నిలిచింది. మెర్సర్ అనే సంస్థ రూపొందించిన ఈ జాబితాలో.. సింగపూర్, జ్యూరిచ్ వంటి నగరాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2023 నుంచి ఈ మూడు నగరాలు మొదటి స్థానాల్లో నిలుస్తున్నాయి. అయితే పాకిస్థాన్ కు చెందిన ఇస్లామాబాద్, లాగోస్, అబుజా వంటి మిగతా నగరాలు జీవన వ్యయాల పరంగా అత్యల్పంగా జాబితాలో చివరి స్థానాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయంగా అన్ని ఫేమస్ నగరాలల్లోని ఖర్చుల్ని విశ్లేషించి ఖరీదైన నగరాలకు చోటు కల్పించారు. ఇందులో.. భారత్ నుంచి ముంబయి తొలిస్థానంలో నిలిచింది. ఇక్కడి జీవన వ్యయాల ప్రకారం.. 136వ స్థానంలో నిలిచింది. 2023లో 147వ స్థానంలో నిలువగా.. ఏడాదిలో 11 స్థానాలు మెరుగుపడి, 136వ స్థానానికి చేరుకుంది. దీనితో ముంబై నగరం విదేశీయులకు భారతదేశంలో అత్యంత ఖరీదైనదిగా మారింది. ముంబయి తర్వాతే.. దేశ రాజధాని దిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు నిలిచాయి.
విదేశీయులకు ఇండియాలో ఖరీదైన నగరాల జాబితాలో దిల్లీ.. గతేడాది కంటే 4 పాయింట్లు ఎగబాకి 165వ స్థానానికి చేరుకుంది. బెంగళూరు ఆరు పాయింట్లు తగ్గి 189వ స్థానానికి చేరుకోగా, చెన్నై ఐదు పాయింట్లు తగ్గి 195వ స్థానంలో నిలిచింది. విదేశీయులకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో.. హైదరాబాద్ 202వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలోని పూణే గతేడాది కంటే ఎనిమిది స్థానాలు ఎగబాకి జాబితాలో 205వ స్థానంలో నిలిచింది. కానీ.. కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీలో నాలుగు స్థానాలు తగ్గి.. కోల్‌కతా 207వ స్థానానికి పడిపోయాయి.
ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఖర్చుల మార్పులపై డేటాను సేకరించేందుకు.. మెర్సర్ మోస్ట్ లివింగ్ కాస్ట్ సిటీ ర్యాంకింగ్ 2024 జాబితాను రూపొందించింది. కాగా.. ఇందుకోసం.. ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 226 నగరాల్లో డేటాను సేకరించారు. ఇందులో.. అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుపుతుండగా… వాటిలో నగరాల్లో స్టే, రవాణా, ఆహారం, దుస్తులు, వినోదం వంటి 200 కంటే ఎక్కువ విభాగాల్లో ధరలను అంచనా వేశారు. ఈ జాబితా రూపకల్పనలో ఏకరూపత కోసం న్యూయార్క్ నగరాన్ని ప్రాథమిక నగరంగా ఎంపిక చేయగా, కరెన్సీని US డాలర్లలో కొలిచారు.
జీవన వ్యయం అనేక వేరియబుల్స్ కారణంగా పెరిగుతుంది. అంతర్జాతీయంగా వలస కార్మికుల ఆదాయాలు-పొదుపులు, ద్రవ్యోల్బణం, మారకపు రేట్లలో హెచ్చుతగ్గుల ద్వారా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గృహ నిర్మాణం, పన్నులు, విద్య, యుటిలిటీల కోసం పెరిగిన ఖర్చులు విస్తృతమైన ఆర్థిక, భౌగోళిక రాజకీయ అస్థిరత కారణంగానూ జాబితాలో నగరాల వ్యయాలు పెరుగుదల, తరుగుదలకు గురైనట్లు తెలుపుతున్నారు.
ఖరీదైన గృహాలు, అధిక రవాణా ఖర్చులు, ఖరీదైన వస్తువులు, సేవలన్నీ హాంకాంగ్, సింగపూర్, జ్యూరిచ్ వంటి ప్రదేశాలలో అధిక జీవన వ్యయానికి దోహదం చేస్తాయి. ఇస్లామాబాద్, లాగోస్, అబుజా వంటి నగరాలకు, కరెన్సీ తరుగుదల జీవన వ్యయం తగ్గింది. ప్రాంతాల పరంగా, యూరోపియన్ నగరాలు ఎక్కువగా నివసించడానికి అత్యంత ఖరీదైన టాప్ 10 నగరాల్లో ఉండగా.. లండన్ 8వ స్థానంలో నిలుస్తోంది.
Also Read : Cruise Ship: షిప్ లో జర్నీ చేస్తూ చనిపోతే.. డెడ్ బాడీని ఏం చేస్తారో తెలుసా?
ఇతర ఖరీదైన నగరాల జాబితాలో కోపెన్‌హాగన్ – 11, వియన్నా- 24, పారిస్- 29, ఆమ్‌స్టర్‌డామ్- 30 స్థానాల్లో నిలుస్తున్నాయి. విదేశీ కార్మికులకు మధ్యప్రాచ్యంలో అత్యంత ఖరీదైన నగరాల్లో దుబాయ్ 15వ స్థానంలో ఉంది. దక్షిణ అమెరికాలో విదేశీ కార్మికులకు అత్యంత ఖరీదైన దేశాలలో ఉరుగ్వే 42వ స్థానంలో నిలుస్తోంది. జాబితాలో ఏడవ స్థానంలో ఉన్న న్యూయార్క్ నగరం ఉత్తర అమెరికాలో అగ్రస్థానంలో ఉంది.