IND VS NZ: టీమిండియా కు ఆదివారం దండం గా మారింది. ఆదివారం రోజున ఐసీసీ టోర్నమెంట్ కు సంబంధించిన ఏ మ్యాచ్ జరిగిన… టీమిండియా ఓడిపోయిన రికార్డులే కనిపిస్తున్నాయి. ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కూడా… ఆదివారం రోజున అంటే మార్చి 9వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో పాత రికార్డులు చూసి… టీమిండియా అభిమానులు భయపడిపోతున్నారు. మళ్లీ ఆదివారమే టోర్నమెంట్ ఫైనల్ జరుగుతోంది… గెలుస్తామో లేదో అనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది.
Also Read: Varun Chakaravarthy: టెన్నిస్ బాల్ ప్లేయర్ నుంచి టీమిండియా వరకు… వరుణ్ సక్సెస్ వెనుక ఆ హీరో ?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 Tournament ) భాగంగా… మార్చి 9వ తేదీన అంటే ఆదివారం రోజున టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India vs New Zealand ) మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. దుబాయ్ వేదికగా ( Dubai ) జరగబోతున్న ఈ ఫైనల్ మ్యాచ్… మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ.. మధ్యాహ్నం రెండు గంటలకు ఉంటుంది. అయితే ఇక్కడ… టీమిండియా కు పెద్ద గండంగా ఆదివారం మారింది.
ఆదివారమే టీమిండియా కు గండం..?
ఇప్పటి వరకు ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా ఆదివారం రోజున మ్యాచ్ ఆడితే… కచ్చితంగా ఓడిపోయిన రికార్డులే ఉన్నాయి. ముఖ్యంగా సెమీఫైనల్ లేదా ఫైనల్స్.. ఇలా చాలా ఉన్నాయి. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ , 2014 టి20 వరల్డ్ కప్ ఫైనల్, 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2003, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్… మ్యాచుల్లో టీమిండియా ఆదివారం ఆడింది. ఈ అన్ని మ్యాచ్ల్లో టీమిండియా ఓడిపోవడం జరిగింది. ఇక ఆదివారం అంటే మార్చి 9వ తేదీన న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ కూడా జరగనుంది.
Also Read: Rahul Chahar Tattoo: రాహుల్ చాహర్ చేతిపై SRH టాటూ… దేవుడు ఇలా ఫిక్స్ చేసాడు ?
ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో టీమిండియా తోపు ?
ఇక ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో… ఐసీసీ టోర్నమెంట్ కు సంబంధించిన ఫైనల్స్ జరిగితే టీమిండియా ( Team India ) కచ్చితంగా గెలిచింది. 1983 సంవత్సరంలో… వరల్డ్ కప్ ఫైనల్ శనివారం రోజున జరిగితే టీం ఇండియా విజయం సాధించింది. అలాగే 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సోమవారం జరిగితే టీం ఇండియా విజయం సాధించింది. టి20 వరల్డ్ కప్ 2007 సంవత్సరంలో ఫైనల్ మ్యాచ్ సోమవారం జరిగితే టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అప్పుడు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా ఉన్నాడు. 2011 సంవత్సరంలో… వన్డే వరల్డ్ కప్ శనివారం జరిగితే ధోని కెప్టెన్సీలో టీమిండియా చాంపియన్ గా నిలిచింది. ఇక 2013 సంవత్సరంలో ధోని కెప్టెన్సీలో… సోమవారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో గెలిచి టీమిండియా మరోసారి ఛాంపియన్గా నిలిచింది. ఇక ఈ ఆదివారం అంటే మార్చి 9వ తేదీన న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ కూడా జరగనుంది. ఇందులో టీమిండియా గెలుస్తుందా ? లేదా ? అనేది చూడాలి.