India Railways: రైల్వే వ్యవస్థను మరింత ఆధునికంగా మార్చేందుకు ఇండియన్ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. రైళ్ల వేగాన్ని పెంచడంతో పాటు సెక్యూరిటీ పరంగానూ కీలక చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే రైల్వే భద్రతతో పాటు రైలు వేగాన్నిమరింత పెంచేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో పలు విభాగాలలో ట్రాక్ ల వెంట కంచెను ఏర్పాటు చేయబోతున్నది. ఇందుకోసం సుమారు రూ. 1000 కోట్లతో పనులు మొదలు పెట్టింది. రైల్వే భద్రతను పెంచడానికి రూ. 865 కోట్లతో మొత్తం 2,792 కిలో మీటర్ల మేర ఫెన్సింగ్ పనులు ప్రారంభించినట్లు ఈస్ట్ కోసం రైల్వే వెల్లడించింది. తితిలాగఢ్-లఖోలి, బాలంగీర్-తెరువాలి-సింగపూర్ రోడ్ రైలు విభాగాల మధ్య ట్రాక్ భద్రతా ఫెన్సింగ్ పనుల కోసం రూ. 207 కోట్లు మంజూరు దశలో ఉన్నట్లు తెలిపింది. సురక్షితమైన రైల్వే కార్యకలాపాలతో పాటు రైల్వే ట్రాక్స్ మీద పశువులు, అడవి జంతువులు రాకుండా ఉండేందుకు ఈ ఫెన్సింగ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఎక్కడెక్కడ ఈ ఫెన్సింగ్ పనులు కొనసాగుతున్నాయంటే?
కొత్తగా ఏర్పడిన ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఖుర్దా రోడ్, సంబల్పూర్, వాల్తేర్ అనే మూడు డివిజన్లు ఉన్నాయి. ఖుర్దా రోడ్ డివిజన్ పరిధిలో 1,025.3 కి.మీ.ల ట్రాక్ సేఫ్టీ ఫెన్సింగ్ పనుల కోసం రైల్వే సంస్థ రూ.388.85 కోట్లు మంజూరు చేసింది. తర్వాత దశలో జఖాపుర-కెందుఝర్ఘర్-నయాఘర్ రైల్వే సెక్షన్, ఖుర్దా రోడ్ రైల్వే డివిజన్‌లోని ఇతర సున్నితమైన ప్రదేశాలలో సేఫ్టీ ఫెన్సింగ్ కోసం ప్రతిపాదనలు చేశారు. సంబల్పూర్ డివిజన్‌లో 468.23 కి.మీ.ల ట్రాక్ సేఫ్టీ ఫెన్సింగ్ పనుల కోసం రైల్వేశాఖ రూ.288.045 కోట్లు మంజూరు చేసింది. దీనితో పాటు బలంగిర్- తెరువాలి- సింగపూర్ రోడ్డు మధ్య 188.89 కి.మీ పరిదిలో పనుల కోపం నిధులు మంజూరు అయ్యాయి. టిటిలఘర్- లఖోలి మధ్య 172.781 కి.మీ.లు పరిధిలో ఫెన్సింగ్ పనులు ప్రతిపాదించినట్లు అధికారులు వెల్లడించారు. అటు వాల్తేర్ డివిజన్ పరిధిలోని 600 కి.మీ.ల మేర ట్రాక్ సేఫ్టీ ఫెన్సింగ్ పనులకు రూ.187.19 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు.
Read Also: ప్రయాణీకులకు అలర్ట్, ఇక నుంచి ఆ రైల్వే స్టేషన్ క్లోజ్!
Read Also: ఫ్రెండ్స్ తో టూర్ ఫ్లాన్ చేస్తున్నారా? సింఫుల్ గా ట్రైన్ కోచ్ బుక్ చేసుకోండిలా!
గంటకు 130 కి.మీ వేగంతో ప్రయాణించనున్న రైళ్లు
సేఫ్టీ ఫెన్సింగ్ పనులు పూర్తి అయిన తర్వాత ఈస్ట్ కోస్ట్ పరిధిలోని పలు విభాగాల్లో రైళ్లు గంటకు 130 కి.మీతో పాటు అంతకు మించి వేగంతో ప్రయాణించే అవకాశం ఉంది. భువనేశ్వర్, పలాస రైల్వే స్టేషన్ల సమీపంలో రెండు పైలట్ విభాగాలతో పాటు బ్రహ్మపూర్ – గోలంతర రైల్వే సెక్షన్, సంబల్పూర్ డివిజన్‌లోని కొన్ని సున్నితమైన ప్రదేశాలలో పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతానికి, 30 కి.మీ మేర సేఫ్టీ ఫెన్సింగ్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
Read Also: నడి సంద్రంలో విచ్చలవిడిగా ఎంజాయ్ చెయ్యాలా? ఈ షిప్పులో ‘అన్నీ’ చేసుకోవచ్చట!
Read Also: భారత్ నుంచి ఆ అందాల లోకానికి కొత్త రైల్వేలైన్, ఎన్ని లాభాలో తెలుసా?