Sailesh Kolanu: ‘హిట్’ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమై.. ఇప్పుడు ఏకంగా ‘హిట్ 3’ తో సంచలనం సృష్టించిన డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మే 1న నాని (Nani) హీరోగా “హిట్ : ది థర్డ్ కేస్” అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో శైలేష్ తాజాగా తోటి దర్శకులతో సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోని కూడా ఆయన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఇలా టాలీవుడ్ యంగ్ హీరోలు అంతా కూడా ఒకే ఫోటోలో కనిపించడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సూపర్ ‘హిట్’ ఫోటో పంచుకున్న శైలేష్ కొలను
యంగ్ డైరెక్టర్లతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ..” కష్ట సమయంలో నాకు తోడుగా నిలిచిన వ్యక్తులతో.. నా ఈ విజయాన్ని పంచుకోవడం కంటే మంచి మార్గం ఇంకొకటి ఏముంటుంది. టాలీవుడ్ లో మేమంతా ఎప్పుడూ టచ్ లోనే ఉంటాము. యోగక్షేమాలు అడిగి మరీ తెలుసుకుంటూనే ఉంటాము. సినిమాలను కలిసి సెలెబ్రేట్ చేసుకుంటాము. ఇదే కుటుంబం అంటే ” అంటూ శైలేష్ కొలను రాసుకొచ్చారు. ప్రస్తుతం శైలేష్ కొలను షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలో డైరెక్టర్స్ సాయి రాజేష్ (Sai Rajesh), శివా నిర్వాణ(Siva Nirvana), బుచ్చిబాబు సన(Bucchibabu sana), పవన్ సాదినేని(Pawan Sadhineni), మున్నా(Munna), అనుధీప్(Anudeep), రాహుల్ సాంకృత్యాయన్(Rahul sankrityan) , భరత్ కమ్మా (Bharath Kamma), చందు మొండేటి(Chandu Mondeti), ప్రశాంత్ వర్మ(Prashanth Varma), సందీప్ రాజ్(Sandeep Raj), శ్రీరామ్ ఆదిత్య(Sriram Aditya), సందీప్ రాజ్(Sandeep Raj), వెంకీ కుడుముల(Venky kudumula), వివేక్ ఆత్రేయ(Vivek atreya), హసిత్(Hasith), సాగర్ కే చంద్ర(Sagar K Chandra) వంటి దర్శకులు ఈ ఫోటోలో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read:Teja Sajja Mirai: తేజ సజ్జ మిరాయ్ మూవీ.. అసలు ఉందా.. రద్దు అయిందా..?
హిట్ 3 సినిమా విశేషాలు..
నాచురల్ స్టార్ నాని ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరొకవైపు నిర్మాతగా పలు సినిమాలను నిర్మిస్తూ బిజీగా మారారు. ఇటీవలే తన ప్రొడక్షన్ బ్యానర్ పై ‘కోర్ట్’ సినిమా నిర్మించి, భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నాని, ఇప్పుడు శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అతి తక్కువ సమయంలోనే భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ.. దూసుకుపోతోంది ఈ సినిమా. నాని మొదటిసారి ఈ సినిమాలో చాలా వైలెంట్ గా, అత్యంత క్రూరంగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మునుపెన్నడూ చూడని విధంగా నానిని ఈ సినిమాలో శైలేష్ చూపించారని చెప్పవచ్చు. మొత్తానికైతే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకొని, అటు డైరెక్టర్ కి, ఇటు హీరోకి ఊహించని ఇమేజ్ అందించిందని చెప్పవచ్చు.
We have been wanting to catch up for a long time now and what better way than to share the success of my movie with this bunch of people who stood by me in the toughest of times. You may not know this but this group of directors in TFI keep in touch, check on each other and make… pic.twitter.com/k7zYQlsvXY
— Sailesh Kolanu (@KolanuSailesh) May 11, 2025