Indian Cleanest Cities:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా.. ప్రజల్లో పరిసరాల పరిశుభ్రత మీద మంచి అవగాహన ఏర్పడింది. ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా ఆయా పట్టణాలు, నగరాలు కూడా పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రజలకు మొక్కలు ఎక్కువగా నాటుతున్నారు. పరిశుభ్రతకు తోడు పచ్చదనం కూడా యాడ్ అయ్యింది. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాల టాప్ 5 లిస్టులో 2 తెలుగు నగరాలు ఉండటం విశేషం.
దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాలు
⦿ ఇండోర్, మధ్యప్రదేశ్
ఇండోర్ దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో నెంబర్ వన్ గా నిలిచింది. ప్రతి రోజు ఇంటింటికి చెత్త సేకరణ, సమర్థవంతంగా రీ సైక్లింగ్ చేయడం ద్వారా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు అధికారులు. ప్రజల భాగస్వామ్యం, మున్సిపల్ వ్యవస్థ కోఆర్డినేషన్ కారణంగా పరిశుభ్రతా ప్రమాణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక్కడి ఇళ్ల పరిసరాలతో పాటు పబ్లిక్ ప్లేసెస్ లో కూడా ఎలాంటి చెత్తా చెదారం లేకుండా క్లీన్ గా కనిపిస్తాయి. ఇండోర్ లో తక్కువ ధరకే ఇండ్లు లభిస్తున్నాయి. పారిశ్రామికంగా, వాణిజ్య పరంగా మరింత అభివృద్ధి చెందుతోంది.
⦿ సూరత్, గుజరాత్
దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో సూరత్ రెండో స్థానంలో నిలిచింది. సమర్థవంతమైన వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థలు, ప్రజారోగ్యంపై ప్రాధాన్యత కారణంగా పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు తెచ్చుకుంది. అధునాతన మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, నగరంలో పరిశుభ్రత పట్ల ప్రజలు, మున్సిపల్ సిబ్బంది నిబద్ధత కారణంగా చాలా క్లీన్ గా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ పరంగా సూరత్ స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. ఆర్థిక అభివృద్ధి, పట్టణీకరణ కారణంగా నివాస, వాణిజ్య ఆస్తులకు డిమాండ్ పెరుగుతోంది.
⦿ నవీ ముంబై, మహారాష్ట్ర
నవీ ముంబై దేశంలో పరిశుభ్రమైన నగరంగా మారడంలో ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషించాయి. సమర్థవంతంగా మురుగునీటి వ్యర్థాల తొలగింపు, పచ్చని ప్రదేశాలు పెంపు, స్థిరమైన పట్టణ ప్రణాళిక కారణంగా పరిశుభ్రమైన వాతావరణానికి దోహదపడుతుంది. నవీ ముంబై రియల్ ఎస్టేట్ పరంగా బాగా అభివృద్ధి చెందింది. ఐటీ పార్కులు, వాణిజ్య కేంద్రాలు ఏర్పడ్డాయి.
⦿ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
దేశంలోని పరిశుభ్రమైన నగరాల్లో నాలుగో స్థానంలో నిలిచింది విశాఖపట్నం. వ్యర్థాల నిర్వహణ, బీచ్ పరిశుభ్రతలో గణనీయమైన పురోగతి సాధించింది. బీచ్ క్లీన్ అప్ డ్రైవ్ లు, ప్రజా అవగాహన కార్యక్రమాలు చాలా ప్రభావం చూపించాయి. వైజాగ్ లో విమానాశ్రయం, ఓడరేవు ఉండటం, పారిశ్రామిక కేంద్రంగా కొనసాగడం కారణంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరుగుతోంది.
⦿ విజయవాడ, ఆంధ్రప్రదేశ్
పారిశుధ్యం, సమర్థవంతమైన వ్యర్థాల తొలగింపు, ప్రజల భాగస్వామ్యం కారణంగా విజయవాడ దేశంలోని టాప్ 5 పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆధునిక వ్యర్థాల ప్రాసెసింగ్ సౌకర్యాలు, క్రమం తప్పని క్లీనింగ్ డ్రైవ్‌ల కారణంగా పరిశుభ్రనగరంగా మారింది. వ్యాపారాలు, విద్యా సంస్థలకు హబ్ గా కొనసాగుతోంది. ఈ నగరానికి రోడ్డు మార్గం, రైలు మార్గం ద్వారా చేరుకోవడం సులభం. విజయవాడ సమీపంలో విమానాశ్రయం కూడా ఉంది.
Read Also: సముద్ర జలాల్లో రైలు బోగీల సమాధి, ఎందుకలా?