BigTV English

Gold Find: అడవిలో ట్రెక్కింగ్.. వందేళ్ల నాటి బంగారం నిధి, ఏం చేశారంటే..

Gold Find: అడవిలో ట్రెక్కింగ్.. వందేళ్ల నాటి బంగారం నిధి, ఏం చేశారంటే..

Gold Find: మనం ఎక్కడికైనా వెళ్లినప్పుడు రోడ్డుపై డబ్బులు దొరికితే మడత పెట్టి జేబులో పెడతాము. అలాంటి ట్రెక్కింగ్‌కు వెళ్లిన వ్యక్తులకు బంగారు నిధి దొరికితే. ఇక్కేముంది.. వారి కష్టాలకు ఫుల్‌స్టాప్ పడినట్టే. ఇంతకీ దొరికిన ఆ బంగారు నిధిని ఏం చేశారు? అన్నది తెలియాలంటే ఈ స్టోరీపై ఓలుక్కేద్దాం.


హాబీగా చాలామంది రకరకాల పనులు చేస్తుంటారు. కొందరు వెరైటీ ప్రదేశాలను సందర్శిస్తారు.. మరికొందరు వంట రుచులు చూస్తారు. ఇంకొందరు ట్రెక్కింగ్‌కు వెళ్తారు. ముగ్గురు సభ్యుల బృందం చెక్ రిపబ్లిక్‌‌లో ఉత్తరాన క్రోనోస్ పర్వతాల్లో ట్రెక్కింగ్ వెళ్లింది. ఇందులో కొత్తేమి ఉందని అనుకున్నారా? అక్కడికే వచ్చేద్దాం. పర్వతం వైపు నెమ్మదిగా వెళ్తుండగా మధ్యలో చిన్నపాటి అడవి కనిపించింది.

అందులో నుంచి వెళ్లడం కాస్త భయమే. మెల్లగా నడక సాగించారు. వారికి కొంతదూరంలో పచ్చని ప్రాంతం కనిపించింది. అటువైపు మీదుగా వారు ట్రెక్కింగ్ చేస్తున్నారు. వారు నడుస్తున్న దారి పక్కనే పెద్ద రాయి కింద పసిడి మాదిరిగా మెరుపు కనిపించింది. దాని దగ్గరకు వెళ్లి పరిశీలించి షాకయ్యారు. అక్కడ ఓ అల్యూమినియం పెట్టె కనిపించింది. వారి దగ్గరున్న వాటితో ఆ పెట్టెను తెరిచి చూశారు.


లోపల బంగారు నిధి చూసి షాకయ్యారు. కాసేపు ఆ ముగ్గురు నోటి వెంట మాట కాసేపు రాలేదు. తేరుకున్న తర్వాత అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టారు. అల్యూమినియం పెట్టెలో 598 బంగారు నాణేలు, 10 బంగారు బ్రాస్‌లెట్లు, 17 సీలు చేసిన సిగార్ పెట్టెలు, కాంపాక్ట్ పౌడర్, దువ్వెన కనిపించాయి.

ALSO READ: గాలొస్తే గలగలా వానొస్తే లొడలొడా, ఇదీ చర్లపల్లి స్టేషన్ దుస్థితి

బంగారు నాణేల బరువు అక్షరాలా 3.7 కిలోగ్రాములు. బంగారంతో చేసిన సిగార్ పెట్టెలు ఎందుకు ఉంచారో తెలీదు. టూరిస్టులు వారు కనుగొన్న నిధిని తూర్పు బోహేమియన్ మ్యూజియానికి అప్పగించారు. మ్యూజియం నిర్వాహకులు ఈ నిధి 100 ఏళ్ల నాటిదని అంచనా వేశారు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఉంచిన నిధి కావచ్చునని భావిస్తున్నారు.

ఈ ప్రాంతంలో నిధి దాగి ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 1920, 1930ల నాటి నాణెల్లో పూర్వ యుగోస్లావ్ చిహ్నాలు ఉన్నాయి. లభించిన నాణెలు చెక్ దేశానికి చెందినవి కావు. సగం బాల్కన్ ప్రాంతానికి చెందినవి గుర్తించారు. మిగతావి ఫ్రాన్స్‌కు చెందినవి అంటున్నారు. ఈ నిధి మూలాలపై ఊహాగానాలు లేకపోలేదు.

కుక్స్ ఎస్టేట్‌లోని సంపన్న స్విర్ట్స్-ష్పోర్క్ కుటుంబానికి చెందినవని అంటున్నారు. మరికొందరు ఆ కాలంలో చెకో స్లోవేకియా సైనికులు దాచిపెట్టిన నిధిగా చెబుతున్నారు. ప్రస్తుతానికి దీనిపై దర్యాప్తు చేస్తున్నారు పురావస్తు శాఖ అధికారులు.

చెక్ చట్టాల ప్రకారం ఈ తరహా నిధి ప్రభుత్వానికి చెందుతుంది. అదే సమయంలో నిధిని కనుగొన్నవారికి కొంత బహుమతి లభిస్తుంది. ఆ తరహా అమూల్యమైన నిధిని లభించడంతో ఈ ప్రాంతంపై చరిత్రకారులు, పురావస్తు శాఖ అధికారుల దృష్టి పడింది.

Related News

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు

Afghan Boy: విమానం ల్యాండింగ్ గేర్‌‌‌లో 13 ఏళ్ల బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ట్రావెల్

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Big Stories

×