Viral Video: హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సిటీ బస్సులో డ్రైవర్ పై ఓ వ్యక్తి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కి డ్రైవర్ చేయిపట్టుకుని వ్యక్తి హల్ చల్ చేశాడు. కాచిగూడ నుంచి పటాన్ చెరుకు వెళ్లే ఆర్టీసీ సిటీ బస్సులో ఈ ఘటన జరిగింది. తన ట్రాన్స్ పోర్ట్ ఆటోకు దారి ఇవ్వడం లేదని బస్సు ఎక్కి డ్రైవర్ ఫోన్ లాక్కొని గొడవకు దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది.
రన్నింగ్ లో ఉన్న బస్సు ఎక్కి కిటికీ బయట నుంచే డ్రైవర్ తో గొడవకు దిగాడు. డ్రైవర్ ను బస్సు నడపకుండా చెయ్యి పట్టుకొని ఆటో డ్రైవర్ ఇబ్బందికి గురి చేశాడు. బస్సు డ్రైవర్ దగ్గర నుంచి తాళాలు లాగే ప్రయత్నం చేశాడు. బస్సులో చాలా మంది ప్రయాణికులు ఉన్నారని.. ఆలోచించకుండా ఇంగిత జ్ఞానం లేకుండా ఆటో డ్రైవర్ ప్రవర్తించాడు.
#BreakingNews :- #Hyderabad #TGSRTC
What's this? Viral video 📸
A man boarded a running bus near Miyapur, Hyderabad and held the driver's hand from outside the window, preventing him from driving.
Netizens are commenting that he doesn't even have the common sense that there… pic.twitter.com/Tslhyhmzun
— HASSAN🔻𝕏 (@HassanSiddiqei) May 22, 2025
దీంతో బస్సు డ్రైవర్ కోపంతో ఆటో డ్రైవర్ ను నానా బూతులు తిట్టాడు. బస్సులోని ప్రయాణికుల చొరవతో అంతటితో గొడువ సద్దుమణిగింది. ఆటో డ్రైవర్ ఇలా బస్సు ప్రవర్తించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే.. బస్సులో ఉన్న చాలా మంది ప్రయాణికులకు భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండేదని.. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షంచాలని సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఫైరవుతున్నారు.
Also Read: Hyderabad : ఆ పని చేసుంటే 17 మంది బతికేవారా? గుల్జార్‌హౌజ్ డెత్ మిస్టరీ రివీల్స్
డ్యూటీలోని ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందిపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ ఎండీ సజ్జనార్ ఇప్పటికే పలు మార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. పోలీస్ శాఖ సహకారంతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని.. హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని ఆయన చెప్పారు. ఆర్టీసీ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసే విధంగా.. మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను టీజీఆర్టీసీ ఏ మాత్రం సహించబోదని వివరించారు. నిందితులపై చట్టప్రకారం శిక్షిస్తామని ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.
Also Read: DRDO Recruitment: డీఆర్‌డీవోలో 148 ఉద్యోగాలు.. శాలరీ రూ.56,100.. దరఖాస్తుకు లాస్ట్ డేట్?