BigTV English

Train Boarding Point Change: గుడ్ న్యూస్.. ఇకపై మీరు బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు, ఇదిగో ఇలా

Train Boarding Point Change: గుడ్ న్యూస్.. ఇకపై మీరు బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు, ఇదిగో ఇలా

Train Boarding Point Change| రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఇకపై నాలుగు గంటల ముందు కూడా బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకొనే వెసులుబాటు కల్పించింది. ఇంతకుముందు ఈ వెసులుబాటు ట్రైన్ బయలు దేరే 24 గంటల ముందు మాత్రమే చేసుకునే వీలుండేది. ఈ కొత్త వెసలుబాటుతో రైలు ప్రయాణికులకు మరింత సౌలభ్యం చేకూరుతుందని రైల్వే శాఖ బావిస్తోంది. ఈ మార్పులను భారతీయ రైల్వే శాఖ ఐఆర్‌సిటిసి టికెటింగ్ సిస్టమ్ లోనూ అప్ డేట్ చేసింది. దీంతో ప్రయాణికులు తమ ట్రామెల్ ప్లాన్స్ ని మ్యానేజ్ చేసుకునేందుకు వెసలుబాటు ఉంటుంది.


దీంతోపాటు ఈ బోర్డింగ్ పాయింట్ మార్చుకునే అవకాశం ప్రయాణికులకు రెండు సార్లు చేసుకునే అవకాశం ఉంటుంది. పైగా దీని కోసం ప్రయాణికులు అదనంగా చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. అయితే బోర్డింగ్ పాయింట్ రైలు బయలుదేరే 24 గంటల లోపు మార్చుకుంటే ఇక ఆ టికెట్ క్యాన్సిల్ చేసినా రీఫండ్ ఉండదు. ఇది ప్యాసింజర్లు గమనించాల్సిన విషయం.

Also Read: జనరల్ టికెట్ ప్రయాణికులకు శుభవార్త.. రైల్వే స్టేష్టన్లలో రద్దీ, తొక్కిసలాట సమస్యలకు చెక్


ఆన్ లైన్ లో రైల్వే బోర్డిండ్ స్టేషన్ మార్చుకోవడం ఎలా?
ఐఆర్‌సిటిసిలో బోర్డింగ్ పాయింట్ మార్చుకునేందుకు ఈ స్టెప్స్ ఫాలో చేయండి.

1. ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్ సైట్ అయిన [irctc.co.in](https://www.irctc.co.in) కు టైప్ చేయండి.

2. ఐఆర్‌సిటిసి హోమ్ పేజీలో లాగిన్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వండి.

3. మై అకౌంట్ కు వెళ్లండి: లాగిన్ అయిన తర్వాత, ‘మై అకౌంట్ ’ విభాగంలో వెళ్లండి

4. మై ట్రాన్స్‌క్షన్స్ ను సెలెక్ట్ చేయండి. అందులో బుక్ డ్ టికెట్ హిస్టరీని క్లిక్ చేయండి.

5. మీ టికెట్‌ను ఎంచుకోండి: బుక్ చేసిన టికెట్ హిస్టరీ పేజీలో, మీరు బోర్డింగ్ స్టేషన్ మార్చాలనుకుంటున్న టికెట్‌ను ఎంచుకోండి.

6. ‘బోర్డింగ్ పాయింట్ మార్చండి’ ఎంచుకోండి: ‘బోర్డింగ్ పాయింట్ మార్చండి’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

7. మీ కొత్త బోర్డింగ్ స్టేషన్‌ను ఎంచుకోండి: కొత్త విండోలో మీరు ఎంచుకున్న రైలు మార్గంలో ఉన్న స్టేషన్ల జాబితా కనబడుతుంది. ఈ జాబితాలో మీ కోరుకున్న బోర్డింగ్ పాయింట్‌ను ఎంచుకోండి.

8. మార్పును నిర్ధారించండి: కన్‌ఫర్మేషన్ పేజీలో, బోర్డింగ్ పాయింట్ మార్పును ఫైనల్ చేసి ఓకే క్లిక్ చేయండి.

9. కన్‌ఫర్మేషన్ పొందంగి: బోర్డింగ్ స్టేషన్ విజయవంతంగా అప్డేట్ అయినట్లు మీకు ఒక అలర్ట్ సందేశం వస్తుంది. అంటే కన్‌ఫర్మ్ గా మార్పు చేసినట్లే.

10. మొబైల్‌కు అప్డేట్ పొందండి: బోర్డింగ్ పాయింట్ అప్డేట్ అయిన మెసేజ్, మీరు బుకింగ్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబరుకు పంపబడుతుంది.

Related News

TTE Instagram: అమ్మాయి టికెట్ చూసి.. అలా చేయాలంటూ ఒత్తిడి చేసిన టీసీ, ఓర్ని దుంప తెగ!

Trains Cancelled: 3 రాష్ట్రాల్లో రైల్వే అలర్ట్, ఏకంగా 55 రైళ్లు క్యాన్సిల్!

Singapore – Malaysia: మలేసియా, సింగపూర్‌లకు IRCTC సరికొత్త ప్యాకేజ్.. మరీ ఇంత చౌకగానా?

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Watch Video: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..

Big Stories

×