Naga Vamshi :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా పేరు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత సూర్యదేవర నాగవంశీ (Surya Devara Naga Vamshi). ముఖ్యంగా ‘టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’, ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కి ఒక వెలుగు వచ్చిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా త్వరలో ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నిర్మాత నాగవంశీ.. సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో భాగంగా నెల్సన్ (Nelson) తో సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా నెల్సన్ తో సినిమా చేస్తున్నారట కదా.. హీరో పేరు కూడా వినిపిస్తోంది..అని రిపోర్టర్ ప్రశ్నించగా.. నాగవంశీ మాట్లాడుతూ.. హీరో పేరు మీకు వినిపించి ఉండవచ్చు. కానీ ఇంకా మేము హీరో గురించి అనుకోలేదు. కానీ నెల్సన్ డైరెక్షన్ లో సినిమా అయితే వచ్చే ఏడాది చేయబోతున్నాము. ఇది ఫిక్స్ అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే నెల్సన్ దిలీప్ కుమార్ తో నాగ వంశీ సినిమా చేయబోతున్నారని క్లారిటీ ఇవ్వడంతో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి.
నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాలు..
డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ విషయానికి వస్తే.. స్క్రీన్ రైటర్ గా , దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు. 2010లో వచ్చిన ‘వెట్టై మన్నన్’ సినిమాతో కెరీర్ ను ప్రారంభించారు. కానీ ఈ సినిమా వివిధ కారణాలవల్ల ఆగిపోయింది. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ ఆ తర్వాత 2018 లో ‘కోలమావు కోకిల’ అనే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. రజనీకాంత్(Rajinikanth )నటించిన ‘జైలర్’ సినిమాకి దర్శకత్వం వహించి.. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లు కలెక్షన్ వసూలు చేసి, అత్యధిక వసూలు చేసిన భారతీయ చలన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ ప్రస్తుతం ‘జైలర్ 2’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈయన దర్శకుడు మాత్రమే కాదు నిర్మాత కూడా.. 2024లో ‘ఫిలమెంట్ పిక్చర్స్’ పేరుతో ఒక నిర్మాణ సంస్థను కూడా స్థాపించి, ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ ద్వారా ‘బ్లడీ బెగ్గర్’ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది నిర్మాత నాగ వంశీ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారు.
Rashmika Mandanna: వయసు 28.. ఆస్తులు చూస్తే గుండె గుభేల్.. లేడీ కుబేర..!
నాగ వంశీ సినిమాలు..
నిర్మాత నాగ వంశీ విషయానికి వస్తే.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా యాక్టివ్ ఉంటున్న నిర్మాతలలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్నారు. గత ఏడాది లక్కీ భాస్కర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన ఈ ఏడాది డాకు మహారాజ్ సినిమాతో మరో హిట్ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా కింగ్ డమ్ సినిమా చేస్తున్నారు. ఇక త్వరలో ఈయన నిర్మించిన మ్యాడ్ స్క్వేర్ సినిమా కూడా విడుదల కాబోతోంది. మొత్తానికి అయితే డిఫరెంట్ జానర్ లో సినిమా కథలను ఎంచుకుంటూ.. ప్రేక్షకులను అలరిస్తూ అటు నిర్మాతగా మరింత పేరు సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు నాగ వంశీ.