Trains: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్యకాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎప్పుడు రైలు పట్టాలు తప్పుతుందో.. ఏ ట్రైన్‌లో మంటలు చెలరేగుతాయో తెలీదు. తాజాగా మంగళవారం రాత్రి గజియాబాద్ నుండి కాజీపేట వైపు ఐరన్ కాయల్స్ తీసుకు వెళుతున్న గూడ్స్ రైలు.. ఓవర్ లోడ్ కావడంతో పెద్దపల్లి జిల్లా రాఘవపూర్, కన్నాల మధ్యలో పట్టాలు తప్పి 11 భోగీలు పట్టాలపై పడిపోయాయి.
దీంతో ఢిల్లీ, చెన్నై ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 11 వ్యాగిన్లు అప్ అండ్ డౌన్ మార్గాలపై పడపోవడంతో ట్రైన్ల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై పడడంతో వాటిని తొలగించేందుకు కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. బుధవారం వరకు రాకపోకలు అంతరాయం ఏర్పడుతుందని అధికాలు తెలిపారు.
మూడు ట్రాక్‌లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వాటిని తొలగించేందుకు భారీ క్రేన్ లతో పట్టాలపై బోగీలను, వాటి మెటీరియల్సను తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 20 రైలు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రకటించింది. మరికొన్ని పాక్షికంగా రద్దు చేశారు. ట్రాక్ పునరుద్ధరణ జరిగిన తర్వాతే.. రైలును పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గూడ్స్ రైలు పట్టాలు తప్పడం.. ప్రయాణికులకు పెద్ద కష్టం తెచ్చిపెట్టింది. పలు రైళ్లను ఎక్కడికక్కడ నిలిపేశారు. మరికొన్ని సర్వీసులు రద్దు చేశారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్‌లో రద్దీ ఏర్పడింది. వారంలో ఒకసారి నడిచే జమ్ముతావి ఎక్స్‌ప్రెస్ కూడా రద్దైంది. విషయం తెలిసి ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే రైలు సర్వీసుల్ని సైతం క్యాన్సిల్ చేశారు.
Also Read: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. 11 బోగీలు బోల్తా
రద్దు చేసిన రైళ్లు ఇవే..
యశ్వంతపూర్ -ముజఫర్పూర్, కాచిగూడ నాగర్సోల్, కాచిగూడ కరీంనగర్, కరీంనగర్ కాచిగూడ, సికింద్రాబాద్ రామేశ్వరం, రామేశ్వరం సికింద్రాబాద్, సికింద్రాబాద్ తిరుపతి, తిరుపతి సికింద్రాబాద్, అదిలాబాద్ పర్లి, పార్లీ అదిలాబాద్, అకోల పూర్ణ, పూర్ణ అకోలా, అదిలాబాద్ నాందేడ్, నాందేడ్ అదిలాబాద్, నిజామాబాద్ కాచిగూడ, కాచిగూడ రాయచూర్, రాయచూర్ కాచిగూడ, గుంతకల్ బోధన్, బోధన్ కాచిగూడ, కాచిగూడ గుంతకల్.. తదితర రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.