Megastar Chiranjeevi : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ వినిపించే పేరు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆడియన్స్‌ను విపరీతంగా అలరించడం ఆయనకు మాత్రమే సొంతం. దాదాపు 10 ఏళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చినా కూడా బాస్ రియంట్రీ తో బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోయింది. రీమేక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కూడా రికార్డ్స్ క్రియేట్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అంటే ఒక పండగ వాతావరణం ఎలా ఉంటుంది. 69 ఏళ్ల వయసులో కూడా మెగాస్టార్ గ్రేస్ ని మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. చాలామంది డాన్సులు వేస్తారు కానీ మెగాస్టార్ డాన్స్ లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ బాడీలో ఈజ్ ఉంటుంది. ఆయన కామెడీ టైమింగ్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.
ఇక మెగాస్టార్ ఆన్ స్క్రీన్ పై ఎంత అందంగా కనిపిస్తారో ఆఫ్ స్క్రీన్ లో కూడా అంతే అందంగా కనిపిస్తున్నారు. బయట 30 ఏళ్ళు ఉన్న యువకులు అంకుల్స్ లా కనిపిస్తున్నారు. కానీ 69 ఏళ్లు వయసున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ యంగ్ లుక్‌లో దర్శనమిస్తున్నారు. సినిమా వేడుకల్లో గాని ఇంట్లో గాని ఎక్కడ కనిపించినా మెగాస్టార్ లో ఆ యంగ్ బ్యూటీ మాత్రం అలానే ఉంటుంది. రీసెంట్ గా సత్యదేవ్ నటించిన జీబ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఈవెంట్ లో చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆ ఈవెంట్ మెగాస్టార్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలామంది ఆ ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ 70 ఏళ్ల నవ యువకుడు అంటూ రాస్తున్నారు. మెగాస్టార్‌ని ఇలా చూస్తున్నప్పుడే ఏజ్ ఈజ్ ఎ జస్ట్ నెంబర్ అని అనిపిస్తుంది.
Also Read : Dulquer Salmaan : కెరీర్లో ఫస్ట్ 100 కోట్లు… టాలీవుడ్ కి రుణపడి ఉండాలి..!