Train Coach Placing Rules: ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థలలో భారతీయ రైల్వే నెట్ వర్క్ నాలుగో స్ధానంలో నిలిచింది. అమెరికా, చైనా, రష్యా తర్వాత భారత్ లో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ ను కలిగి ఉంది. నిత్యం వేలాది రైళ్లు కోట్లాది మంది ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది రైలు ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో రైలు ప్రయాణం చేసే ఉంటారు. అయితే. రైలు రూల్స్, రైల్వే కోచ్ లు, రైల్వే బెర్తులు సహా చాలా విషయాల గురించి పెద్దగా అవగాహన ఉండదు. అయితే, ఈ స్టోరీలో మనం రైల్వే కోచ్ ల అమరిక గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. అసలు రైలులో ఏ కోచ్ ఎక్కడ ఉండాలనేది ఎలా నిర్ణయిస్తారు? ఎవరు నిర్ణయిస్తారు? ఏ రూల్స్ ప్రకారం రైల్వే కోచ్ లు ఎక్కడ ఉండాలని నిర్ణయిస్తారు? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..
కోచింగ్ ప్లాన్, భద్రతకు అనుగుణంగా కోచ్‌ల ఏర్పాటు
రైలులో ఏ కోచ్‌లను ఎక్కడ ఉంచాలనేది రైల్వే ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణయిస్తారు. రైలు కోచింగ్ ప్లాన్, ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కోచ్‌ల స్థానం నిర్ణయించబడుతుంది. దీని ఆధారంగా రైలులో కోచ్‌లను ఏర్పాటు చేస్తారు. ప్రతి రైలుకు భారతీయ రైల్వే సంస్థ ఓ కోచింగ్ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ప్లాన్ రైల్వే అధికారిక వెబ్ సైట్ లో, రైల్వే స్టేషన్ లో కూడా అందుబాటులో ఉంటుంది. రైలులో ఏ కోచ్ ఎక్కడ ఉంది? అనేది రైలులోని మొత్తం కోచ్‌ల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది.
రైలులో ఏ కోచ్ ఎక్కడ ఉంటుందంటే?
రైలు ముందు భాగంలో ఇంజన్ ఉంటుంది. మొదటి జనరల్ కోచ్ ఇంజిన్ దగ్గర ఉంది. దాని పక్కనే లగేజీ కోచ్ ఉంది. దాని తరువాత, మధ్యలో AC కోచ్‌లు ఉంటాయి. వీటిలో ఫస్ట్ AC, సెకెండ్ AC, థర్డ్ AC కోచ్‌లు ఉన్నాయి. వీటి తర్వాత స్లీపర్ కోచ్ ఉంటుంది. రైలు వెనుక భాగంలో అదనపు జనరల్ కోచ్, గార్డు క్యాబిన్ ఉంటాయి.
Read Also:శబరిమల ప్రత్యేక రైళ్లు రద్దు.. సౌత్ సెంట్రల్ రైల్వే షాకింగ్ డెసిషన్!
భద్రతా చర్యలను దృష్టిలో ఉంచుకుని, కోచ్‌లను రైల్వే సంస్థ ఓ పద్దతి ప్రకారం ఏర్పాటు చేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకులు సులువుగా బయటకు వచ్చేలా కోచ్ ల అమరిక ఉంటుంది. అంతేకాదు, రైలు భద్రతను దృష్టిలో ఉంచుకుని, రైలుకు రెండు చివర్లలో లగేజీ, బ్రేక్ వ్యాన్ లను ఉంచారు. వీటి మూలంగా రైలు మరింత సేఫ్ గా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఏ రైలు కోచింగ్ విధానం అయినా, ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఉంటుందన్నారు.
Read Also: తెలుగు రాష్ట్రాల నుంచి కాశ్మీర్‌కు రైళ్లు? ఏయే నగరాల మీద నుంచంటే…