Passengers Alert: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే రైళ్లు రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మహా కుంభమేళాకు బిహార్ రాష్ట్రం నుంచి భారీ భక్తులు తరలివెళ్తున్న క్రమంలో టికెట్ లేకుండా ట్రైన్ లో జర్నీ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. టికెట్ ఉంటేనే స్టేషల్ లోకి అనుమతి ఇస్తామని పేర్కొంది.
టికెట్ ఉంటేనే స్టేషన్‌లోకి ప్రవేశం..
ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోకి వచ్చే రైల్వే స్టేషన్ లలో రద్దీ నిర్వహణకు తగిన ఏర్పాట్లను చేసినట్లు అధికారులు వెల్లడించారు. కుంభమేళా సందర్భంగా ప్రయాణికులు ఎలాంటి అవంతరాలు, ఇబ్బందులు లేకుండా ప్రయాణించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. బిహార్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో టికెట్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చేలా కచ్చితమైన నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారులు ఈ టికెట్ లేకుండా ప్రయాణం చేయడాన్ని అమలు చేసేందుకు స్థానిక జిల్లా యంత్రాంగం, పోలీసుల నుంచి సహాయం కూడా తీసుకుంటున్నారు.
ALSO READ: NTPC Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే ఎనఫ్..
బిహార్ రాజధాని పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ మాట్లాడుతూ.. ‘రైల్వే అధికారులకు సాయం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అనేక స్టేషన్ లలో భద్రతా బలగాలు నియమించారు. స్టేషన్ లలో టికెట్ లేని వారిని ప్రవేశించకుండా సరైన ఏర్పాట్లు చేశారు’ అని అన్నారు.
అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు..
కుంభమేళాకు భక్తులు భారీ తరలి వెళ్తుండడంతో.. ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. అలాగే రైల్వే స్టేషన్ లలో భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. దీని కోసం రైల్వే శాఖ స్టేషన్లలో అదనపు సిబ్బందిని కూడా నియమించింది. రద్దీని తగ్గించేందుకు పాట్నా జంక్షన్ నుంచి ప్రతి రోజు కుంభమేళాకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సీనియర్ రైల్వే సిబ్బంది ప్రయాణికులకు సంబంధించి ఏర్పాట్లను, టికెట్ కౌంటర్లను, తదితర ముఖ్యమైన పనులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరిగే కుంభమేళా కోసం బిహార్ రాష్ట్రం నుంచి భక్తలు తరలివస్తున్నారు. రాష్ట్రంలో పాట్నా, దానాపూర్, అరా, గయా, ససారం, ముజఫ్ఫాతో సహా పలు రైల్వే స్టేషన్లలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని రైల్వే అధికారులు తెలిపారు.
ALSO READ: Train Cancelled List: అలర్ట్.. వందే భారత్‌తోపాటు 13 రైళ్లు రద్దు, వెంటనే చెక్ చేసుకోండి
పాట్నా రైల్వే స్టేషన్‌లో దారుణం..
ఇదిలా ఉండగా.. నిన్న పాట్నా రైల్వే స్టేషన్ లో దారుణ ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి కిందపడి, హై ఓల్టేజ్ విద్యుత్ కేబుల్ కి తాకడంతో కరెంట్ షాక్ కు గురై వ్యక్తి మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.