Intinti Ramayanam Today Episode February 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాద్యకు జ్వరం రావడంతో అవనికి కాల్ చేసి కమల్ రమ్మని పిలుస్తాడు. అవని నర్సుగా వచ్చి తన కూతురిని జాగ్రత్తగా చూసుకుంటుంది. రాత్రింత ఆమె చూసుకున్న విధానం చూసి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. నిజంగా నర్సుగా చాలా బాగా చేసిందని అనుకుంటారు. ఇక అక్షయ్ ను చూసి భాధ పడుతుంది అవని.. ఉదయం లేవగానే అందరు ఆరాధ్య కోసం వెయిట్ చేస్తుంటారు. అవని ఆరాధ్యం తీసుకొని బయటకొస్తుంది. ఆరాధ్య నడుచుకుంటూ రావడంతో అందరూ సంతోషపడతారు. మా మనవరాలికి ఏమైందో నాని టెన్షన్ తో మేము రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు కానీ మీరు ఒక నర్సుగా కాకుండా తల్లిగా దగ్గరుండి మా మనవరాలుకి నయం ఎలా చేశారు. మీరునాన్ని ఎప్పటికీ మర్చిపోలేము అనేసి అందరూ అంటారు. అవని అందరికీ చెప్పేసేసి వెళ్ళిపోతూ ఉంటే పల్లవి ఏ ఆగు ఒక నిమిషం ఇలా తిరుగు అనేసి అడుగుతుంది. తన పేర్కొన్న మాస్క్ ని తీసేస్తుంది. అవని చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక పార్వతి అవనిపై చిందులేస్తుంది. నిన్ను ఇంట్లోకి అడుగు పెట్టద్దు అని చెప్పాను కదా అయినా నువ్వు వచ్చావు నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు వస్తావనేసి పార్వతి అంటుంది. మనుషుల్ని చంపాలనుకున్న నీకు ఇలా మారువేషంలో రావాలనుకోవడంలో తప్పులేదులే అనేసి అవనిని పార్వతి నోటికొచ్చినట్లు తిడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ పార్వతిని అరుస్తారు బిడ్డ కోసం తల్లి రావడంలో తప్పులేదు అనేసి అంటారు. కానీ పార్వతి మాత్రం తన మాటే నెగ్గాలని అవనిపై అరుస్తుంది.. అవని చాలెంజ్ చేసి వెళ్ళిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవనిని తప్పుగా మాట్లాడినందుకు ఇంట్లో వాళ్ళందరూ పల్లవి పై అరుస్తారు. నా భార్యకు బుద్ధి లేదు అంటావా నిన్ను అనేసి పల్లవిని కొట్టడానికి అక్షయ్ వెళ్తారు. ఇక కమల్ నువ్వు కొడితే నిన్ను మళ్ళీ క్షమాపణ చెప్పమని అడుగుతది నా భార్యని కొట్టడానికి నీకేం లేదు అన్నయ్య నేను కొట్టాలి అనేసి మా వదిన అంత మాట అంటావా మా వదినకి సిగ్గు లేదంటావని నాలుగు పీకుతాడు.. అప్పుడే అక్కడికి చక్రధర వస్తాడు.. నా కూతుర్నే కొడతావా అనేసి కమల్ దగ్గరికి వెళ్తాడు. కమలు కొడితే తప్పేంటి రా అది నా భార్య అనేసి రివర్స్ అవుతాడు. మీరంతా ఒక్కటే నా కూతురుని కొట్టాలని చూస్తున్నారా అనేసి చక్రధర్ అడుగుతాడు. మీ కూతురు ఏం మాట్లాడిందో అది ఆలోచించవా నువ్వు అని కమల్ కూడా ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్తారు. ఇక చక్రధర్ ఏమయ్యా పెద్దమనిషి నీ కొడుకు నా కూతురుని కొడుతున్నాడు చోద్యం చూస్తున్నావా సర్ది చెప్పాలని లేదా అనేసి అడుగుతాడు. నీ కూతురు తప్పుగా మాట్లాడింది కాబట్టే నీ కూతుర్ని కొట్టాడు ఏ రోజైనా మీ ఫ్యామిలీ గొడవల్లోకి నేను వచ్చానా నీ భార్య నా చెల్లెలు మీరిద్దరు కొట్టుకుంటున్నారా తిట్టుకుంటున్నారా అని నేను ఏ రోజు రాలేదు అలాంటిది నువ్వు ఇప్పుడు మా ఇంట్లో గొడవల గురించి మధ్యలో దూరతావ్ ఎందుకని రాజేంద్రప్రసాద్ అరుస్తాడు.
కమల్ అమ్మ ఆరోజు అన్నయ్యని సారీ చెప్పమని అడిగావు కదా ఇప్పుడు పల్లవి తప్పు చేసింది అన్నయ్యకు సారీ చెప్పిస్తావా నా స్టైల్ లో చెప్పమంటావా అనేసి అడుగుతాడు. ఇక పార్వతి పల్లవిని అక్షయ్ కి సారీ చెప్పమని అడుగుతుంది . తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే సారీ చెప్పక తప్పదు పల్లవి నువ్వు అక్షయ్ కి సారీ చెప్పాల్సిందే అని అనగానే పల్లవి అక్క గురించి తప్పుగా మాట్లాడడం నా తప్పే సారీ బావగారు అని అడుగుతుంది. చక్రధర్ వెళ్ళిపోతుంటే కమల్ పిలిచి మా అన్నయ్యకు సారీ చెప్పాల్సిందే మర్యాదగా సారీ చెప్పి వెళ్ళు అనేసి అంటాడు. చక్రధర్ సారీ చెప్పి బయటికి వెళ్లిపోతాడు. అవని ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటుంది. ఓ పూల షాప్ లో ఉద్యోగం కావాలని వెళ్లి తన టాలెంట్ తో ఉద్యోగాన్ని సంపాదిస్తుంది. ఇక అక్షయ్ అవ్వనీ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. అవనిని నేను ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని అనుకుంటాడు.. అది విన్న పల్లవి అత్తయ్య నువ్వు రెచ్చగొడితేనే అవని ఇంట్లోకి రాకుండా ఉంటుందని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో అవనికి విడాకు నోటీస్ పంపిస్తుంది పార్వతి.. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..