Shahid Afridi On Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) గురించి సోషల్ మీడియాలో నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి. అత తిన్న వయసులోనే ఐపీఎల్ లోకి అరంగేట్రం చేయడం.. అక్కడ బీభత్సం సృష్టించి టీమిండియాలోకి రావడం చక చకా జరిగిపోయాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ బుడ్డోడు గురించి చర్చ జరుగుతోంది. అలాంటి 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై పాకిస్తాన్ మాజీలు కూడా తమకు నచ్చినట్టు వాగుతున్నారు. ఒకడు వైభవ్ సూర్యవంశీని మెచ్చుకుంటే, మరొకడు బూతులు తిడుతున్నాడు. కొందరు 15 సంవత్సరాలు కాదంటూ ఐసీసీ విచారణ చేయాలని మొత్తుకుంటున్నారు.
ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్యవంశీ తన షాట్లను కాపీ కొడుతున్నాడని బాంబు పేల్చాడు. గతంలో తాను కూడా సిక్సర్లు, బౌండరీలు కొడుతూ అత్యధిక చుక్కలు చూపించే వాడినని.. అదే ఫార్ములాను వైభవ్ సూర్యవంశీ వాడేస్తున్నాడని పేర్కొన్నాడు. అందుకే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ అంటే తనకు నచ్చుతుందని వ్యాఖ్యానించాడు. దొంగ చాటున వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని పేర్కొన్నాడు. 52 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ కు ఫిదా అయిపోయానని తెలిపాడు.
బౌన్సర్లు వచ్చినప్పుడు తాను ఎలా ఎదుర్కొంటానో..? వైభవ్ కూడా అలాగే దంచి కొడుతున్నాడని వెల్లడించాడు. స్పిన్ బౌలింగ్ వస్తే, తన లాగే ఎటాకింగ్ చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. తన జిరాక్స్ కాపీనే వైభవ్ సూర్యవంశీ అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. తన బ్యాటింగ్ ను వైభవ్ సూర్యవంశీ నిత్యం గుర్తు చేస్తున్నాడని స్పష్టం చేశాడు. ఇలాంటి బుడ్డోడు టీమిండియాలో ఆడడం బీసీసీఐ చేసుకున్న అదృష్టమని ప్రశంసలు గుర్తించాడు.
వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన టాలెంట్ ఉందని.. దాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని కోరాడు. తాను అయితే శత్రు దేశానికి సంబంధించిన వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ను ఎంజాయ్ చేస్తున్నారని తెలిపాడు. ఇక వైభవ్ సూర్యవంశీ వయస్సు విషయంలో తాను ఎలాంటి కామెంట్ చేయదలుచుకోలేదని వెల్లడించాడు. క్రికెట్ లో వయసు గురించి మాట్లాడడం కంటే టాలెంట్ పై చర్చిస్తే బెటర్ అని సూచించాడు. అనవసరంగా వైభవ్ వయసు గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దని కోరాడు.