BigTV English

Telangana State: ముత్యాలు పొదిగిన నేల, ఫార్మా, టెక్ దిగ్గజాలు కొలువైన ప్రాంతం.. తెలంగాణలో అద్భుతాలు ఎన్నో!

Telangana State: ముత్యాలు పొదిగిన నేల, ఫార్మా, టెక్ దిగ్గజాలు కొలువైన ప్రాంతం.. తెలంగాణలో అద్భుతాలు ఎన్నో!

Telangana: తెలంగాణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. దక్కన్ పీఠభూమిలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతం అద్భుతమైన వనరులను కలిగి ఉంది. సమశీతోష్ణ మండలంగా కొనసాగుతూ పాడి పంటలతో కళకళలాడుతోంది. దేశంలోనే అత్యంత ఎక్కువ ధాన్యం పండించే రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచ టెక్ దిగ్గజాలు హైదరాబాద్ లోనే కొలువుదీరాయి. ప్రపంచ ఫార్మా ఎగుమతి కేంద్రంగా మారింది. ఒకటేమిటి తెలంగాణ అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా కొనసాగుతున్నది.


తెలంగాణ ప్రత్యేకతలు

⦿ దేశం మొత్తంలోని ముత్యాల్లో 80 శాతం తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్ నగరాల్లోనే ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ సిటీ ఆఫ్ పెరల్స్, సిటీ ఆఫ్ లేక్స్ గా గుర్తింపు తెచ్చుకుంది.


⦿ తెలంగాణ ప్రపంచ ఫార్మా హబ్ గా కొనసాగుతున్నది. కోవిడ్ సమయంలో ప్రపంచానికి కోవాగ్జిన్ టీకాలను ఎగుమతి చేసింది… హైదరాబాద్ బేస్ గా నడుస్తున్న భారత్ బయోటెక్ సంస్థ. ఎంతో మంది ప్రాణాలను కాపాడింది.

⦿ తెలంగాణ పాడి పంటలతో కళకళలాడుతున్నది. దేశం మొత్తంలో 20 శాతం మిర్చి,  20 మామిడి, 25 శాతం ధాన్యం ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్లగొండలో ఈ పంటలు అత్యధికంగా పండుతున్నాయి.

⦿ ప్రపంచ టెక్ దిగ్గజాలు హైదరాబాద్ లోనే కొలువుదీరాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఫేస్ బుక్, క్వాల్కమ్ లాంటి కంపెనీలు ఇక్కడ తమ క్యాంపస్ లను ఏర్పాటు చేసుకున్నాయి.

⦿ తెలంగాణ రాష్ట్రం 13 శాతం జీడీపీ రేటుతో అగ్రపథంలో కొనసాగుతున్నది. దేశంలోని టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీగా రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తింపు తెచ్చుకుంది. ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. కథతో ఫిల్మ్ సిటీలోకి అడుగు పెడితే సినిమా పూర్తి చేసుకుని బయటకు వచ్చేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కలిగి ఉంది.

Read Also: సర్జరీ టైమ్‌లో డాక్టర్లు ఆకుపచ్చ రంగు దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు!

⦿ తెలంగాణ దేశానికి సరోజిని నాయుడు, జాకీర్ హుస్సేన్ లాంటి నాయకులను అందించింది.

⦿ స్పోర్ట్స్ రంగంలో సానియా మీర్జా, పీవీ సింధూ లాంటి ఛాంపియన్స్ ను అందించింది.

⦿ అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు, మహ్మద్ సిరాజ్ లాంటి వరల్డ్ క్లాస్ క్రికెటర్లు కూడా తెలంగాణ నుంచే వచ్చారు.

Read Also: ఒక్కో రంగు గులాబీ వెనుక ఒక్కో అర్థం, వాలంటైన్స్ డే వీక్ లో ఏ గులాబీ ఎవరికి ఇవ్వాలంటే?

మొత్తంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఎదుగుతోంది. గుండు సూదుల నుంచి విమాన పరికరాల వరకు ఇక్కడ తయారవుతున్నాయి. అగ్ర టెక్ దిగ్గజాలు అమెరికా తర్వాత అంతే స్థాయిలో క్యాంపస్ లను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రపంచానికి ఇక్కడి నుంచే ఫార్మా ఎగుమతులు కొనసాగుతున్నాయి. నాటి హైదరాబాద్ స్టేట్ నుంచి నేటి తెలంగాణ వరకు ఎప్పుడూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపునే కొనసాగిస్తున్నది.

Read Also:  మీకు తెలుసా.. ఈ దేశాల్లో కూడా తెలుగు మాట్లాడతారు.. వామ్మో అంత మంది ఉన్నారా?

Related News

Bali vacation: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Big Stories

×