Brahmamudi serial today Episode: అందరూ బారసాల గురించి మాట్లాడుకుంటుంటే.. ఇంతలో అప్పు పోలీస్ యూనిఫామ్ లో వస్తుంది. అందరూ షాక్ అవుతారు. కావ్య, స్వప్న హ్యాపీగా ఫీలవుతారు. కావ్య వెళ్లి అప్పూ అంటూ సాదరంగా లోపలికి తీసుకొస్తుంది. అప్పును చూసిన రుద్రాని బాగుంది ఈ దసరా వేషం అంటుంది. వేషాలు వేయాల్సిన అవసరం మాకు లేదు. నిజంగానే మా చెల్లి పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఈ ఊరికే ఎస్సైగా వచ్చింది అని చెప్తుంది కావ్య. దీంతో రుద్రాణి చాలా సంతోషం మరి ఈ పోలీస్ గారు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు .. నిన్ను నీ మెగుడిని అవమానించినందుకు నీ అత్తకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చినట్టా..? లేక దొంగకేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వచ్చావా..? ఓ నాకు అర్థం అయింది. నీ పెళ్లికి ఒప్పుకోకుండా నిన్ను అవమానించి నీ అత్తయ్యా నిన్ను ఇంట్లోంచి తరిమేసింది కదా..? అలాంటివి ఇకపైన ఏమైనా చేస్తే పోలీస్‌గా ఎంతదూరం అయినా వెళ్తాను అని చెప్పడానికి వచ్చావు కదా అంటుంది.
ఇంతలో కళ్యాణ్ వస్తూ ఎందుకు అత్తయ్యా మీ మనసులో ఉన్న ఆలోచనలను మా మాటలుగా చెప్పాలనుకుంటున్నారు. నా భార్య పోలీస్ అయిందని ఈ ఇంటి పెద్దవాళ్లకు చెప్పి వాళ్ల ఆశీర్వాదం తీసుకుందామని ఇక్కడికి వచ్చాము.. పెద్దమ్మా.. అనగానే అపర్ణ.. ఒరేయ్ ఈ ఇంటికి పెద్ద దిక్కు మీ నాన్నమ్మ గారు ముందు ఆవిడ ఆశీర్వాదం తీసుకోండి.. తర్వాత మీ అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకోండి. అని చెప్పగానే.. అప్పు, కళ్యాణ్ ముందుగా ఇందిరాదేవి ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత వెళ్లి ప్రకాష్, ధాన్యలక్ష్మీ ల ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత అపర్ణ ఈ ఆనందం శాశ్వతంగా ఉండిపోవాలంటే.. మీరు ఇక్కడే ఉండిపోవాలి. ఏంటి కళ్యాణ్ అలా చూస్తున్నాను.. నువ్వు అనుకున్నట్టుగానే. నీ భార్యను పోలీస్‌ను చేశావు. ఇక ఇక్కడే ఉండటానికి నీకు ఏం అభ్యంతరం ఉంది అంటుంది.
నువ్వు బాగానే చెప్తావు వదిన కానీ కళ్యాణ్ అందుకు ఒప్పుకోవాలి కదా అంటుంది రుద్రాణి. ఎందుకంటే కళ్యాణ్ అనుకున్నట్టుగా ఇంకా మంచిపేరు సంపాదించలేదు. అందుకే రాడనుకుంటున్నాను అంటుంది. దీంతో కళ్యాణ్ విన్నావా పెద్దమ్మా ఈ ఇంట్లో మా అమ్మతో పాటు ఇంకా కొంతమంది మమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. అందరూ ఒప్పుకున్న రోజు ఇక్కడే ఉండిపోతాం అంటాడు. ఇంతలో ఇందిరాదేవి సరేలేరా ఆ గొడవలన్నీ ఇప్పుడెందుకు రేపు పాపకు బారసాల జరిపిస్తున్నాము.. మీరు ఇద్దరూ దగ్గర బారసాలను గ్రాండ్ గా జరిపించాలి అని చెప్తుంది. తర్వాత రాత్రికి ముగ్గురు అక్కాచెల్లెలు కలిసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. ఇంట్లో అమ్మా నాన్నా ఎలా ఉన్నారో అనుకుంటారు. మొత్తానికి అనుకున్నట్టుగానే ఇప్పుడు పోలీస్ అయి వచ్చావు అంటుంది కావ్య. ఇంతలో లోపల పాప ఏడుస్తుంటే స్వప్వ లోపలికి పరుగెడుతుంది. వెళ్లి పాపను ఆడిస్తుంది. అయినా పాప ఏడుపు ఆపదు. దీంతో కావ్య పాపను తీసుకుని జోలపాట పాడుతుంది. పాప నిద్రపోతుంది.
దీంతో స్వప్న నువ్వు చెప్పింది నిజమే కావ్య బిడ్డను జోకొట్టాలంటే తల్లే కానవసరం లేదు. నీలా ప్రేమ పంచే ఆడది అయితే చాలు అంటుంది. దూరం నుంచి చూస్తున్న ఇందిరాదేవి వీళ్లను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందే.. అవును అత్తయ్యా నేను ఈ ఇంటికి కొత్తగా కాపురానికి వచ్చిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. నేను కూడా రాజ్‌ను ఇలా ఒడిలో పెట్టుకుని జోలపాడేదాన్ని ఒకవైపు మీరు.. మరోవైపు ధాన్యలక్ష్మీ రాజ్‌ను నెత్తిన పెట్టుకుని చూసుకునే వారు అంటుంది అపర్ణ. దీంతో ఇందిరాదేవి అవునే ఆ రోజులే ఎంతో సంతోషంగా ఉండేవాళ్లం. అప్పుడు మన దగ్గర ఇంత ఆస్థి ఉండేది కాదు. కానీ అందరం సంతోషంగా ఉండేవాళ్లం. కానీ ఈరోజు కోట్లు ఉన్నా.. ఆ సంతోషాన్ని మాత్రం కొనలేకపోతున్నాం అంటుంది. దీంతో అపర్ణ బాధపడకండి అత్తయ్యా ఆ ముగ్గురిని చూస్తున్నారు కదా..? మన ఇంట్లో దూరం అయిన సంతోషాన్ని తప్పకుండా తీసుకొస్తారు అని ఓదారుస్తుంది.
ధాన్యలక్ష్మీ కోపంగా ప్రకాష్ దగ్గరకు వెళ్లి మీరిలా బుక్కు చదువుతూ కూర్చుంటే మన కళ్యాణ్‌కు అన్యాయం జరుగుతుంది. మీరు వెళ్లి కళ్యాణ్ తో మాట్లాడండి.. మన ఆరాటం, పోరాటం అన్ని వాడి కోసమేనని చెప్పండి. మన ఆస్థి మనకు వస్తే.. మనం విడిపోయి వాడితో సంతోషంగా ఉండొచ్చు అని చెప్పండి అనగానే.. ప్రకాష్ మనం ఎందుకో తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది అంటాడు. మనం ఇలాగే ఉంటే.. ఈ ఇంట్లో రాజ్ రాజులాగా… కావ్య, రాణిలా పెత్తనం చెలాయిస్తారు అని చెప్తుంది. దీంతో నేను మాట్లాడతాను.. కాస్త టైం తీసుకోనివ్వు అంటాడు. బారసాల లోపు అంతా అయిపోవాలని చెప్తుంది ధాన్యలక్ష్మీ. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?