Bigg Boss 10 Telugu Day 69 Promo 4: బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు కార్యక్రమం పదవ వారం పూర్తి కాబోతుంది. ఇక పదవ వారంలో భాగంగా హౌస్ మొత్తం సందడి సందడిగా ఉన్న సంగతి తెలిసిందే. పదవ వారం ఫ్యామిలీ వీక్ (Family Week)కావడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొక్కరికి హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇలా హౌస్ లోకి తమ ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ఇకపోతే హౌస్ లో ఉన్నటువంటి వారిలో వర్షిణి, (Varshini)రామకృష్ణ(Ramakrishna) మినహా మిగిలిన కంటెస్టెంట్ ఫ్యామిలీ అంతా కూడా హౌస్ లోకి వచ్చారు.
ఇక తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమో వీడియోలో భాగంగా నాగార్జున(Nagarjuna) మాట్లాడుతూ.. ఫ్యామిలీ వీక్ కావడంతో చాలా ఎమోషనల్ గా కొనసాగింది. ఇక వర్షిణి, రామకృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే రాలేదు అయితే బిగ్ బాస్ మీకు మరో ఛాన్స్ ఇచ్చారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ యాక్టివిటీ రూమ్ లో ఎదురుచూస్తున్నారు అంటూ నాగార్జున చెప్పడంతో వర్షిని , రామకృష్ణ ఇద్దరూ వారి అమ్మ వాళ్ళను చూసి ఎమోషనల్ అయ్యారు. అయితే నాగార్జున ఇక్కడ ఒక మరో ట్విస్ట్ ఇచ్చారు ఎవరి ఫ్యామిలీ అయితే లోపలికి రావాలి అనుకుంటున్నారు వాళ్ళ బొమ్మ మీరు చెట్టుకు కట్టాలని చెప్పడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ దాదాపు వర్షినికి ఓటు వేశారు.
హౌస్ లో వర్షిణి, రామకృష్ణ మినహ 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అయితే ఇందులో ఆటో రాంప్రసాద్, శివకుమార్, అమన్ మినహా మిగిలిన వారందరూ కూడా వర్షిణి ఫోటోని చెట్టుకు కట్టారు. ఇలా వర్షినికే అత్యధికంగా ఓట్లు రావడంతో ఆమె తన తల్లిని కలుసుకొనే అవకాశం వచ్చింది. ఈ సమయంలోనే రామకృష్ణ తన అమ్మను కలుసుకునే అవకాశాన్ని కోల్పోయారు. దీంతో. రామకృష్ణ అలాగే తన తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ విధంగా రామకృష్ణ మదర్ ఇంట్లోకి వచ్చే అవకాశాన్ని కోల్పోవడంతో ఆమె ఆక్టివిటీ రూమ్ నుంచి ఎలా ఉన్నావు నాన్న అంటూ తన కొడుకును ప్రేమగా అడిగారు. మిమ్మల్ని చాలా గొప్పగా చూపించాలి అనుకున్నాను ఇంతకంటే కూడా నేనేం చేయలేనమ్మ అంటూ ఎమోషనల్ అయ్యారు. నేనడిగితే నువ్వు నవ్వుతావు కదా నాకోసం ఒక్కసారి నవ్వమ్మ.. అమ్మ నేను ఏడవట్లేదు అంటూ రామకృష్ణ చెప్పడంతో నేను కూడా ఏడవట్లేదు బాగున్నాను అంటూ రామకృష్ణ తల్లి కూడా ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. ఇక ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తుంది. గతవారం దీపావళి సందర్భంగా ఎలిమినేషన్ లేకపోవడంతో ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలుస్తోంది . ఇక ఈవారం రామకృష్ణ కూడా హౌస్ నుంచి బయటకు రాబోతున్నట్టు సమాచారం.
Also Read: 14 ఏళ్ల ప్రేమ.. బ్రేకప్.. కాజల్ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా!