Pawan Kalyan : ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్టు అయ్యాడు అన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనగా మారింది. అయితే ఓవైపు అల్లు అర్జున్ బెయిల్ కు ప్రయత్నాలు జరుగుతుండగా, కరెక్ట్ గా అతను అరెస్టు అయిన టైంకే పవన్ కళ్యాణ్ వేసిన ట్వీట్ అందరి హాట్ టాపిక్ గా మారింది.
అల్లు – మెగా గొడవలపై ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నంద్యాల పర్యటన తర్వాత అల్లు అర్జున్ పై మెగా అభిమానులు గుర్రుగా ఉన్నారు. అలాగే మెగా కాంపౌండ్ కూడా కోపంగా ఉందని వార్తలు వచ్చాయి. పైగా సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ లాంటి యంగ్ హీరోలు ఆ కోపాన్ని బహిరంగంగానే బయట పెట్టారు. అంతేకాకుండా ఆ తర్వాత ఎప్పుడూ అల్లు అర్జున్ తో వీళ్లు కలిసి ఉన్నట్టుగా కనిపించలేదు. పైగా ‘పుష్ప 2’ రిలీజ్ టైంలో అంత గొడవ జరిగినా, ఒక్క మెగా హీరో కూడా నోరు విప్పలేదు.
మెగా ఫ్యామిలీకి మూల స్తంభాలైన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనీసం ట్వీట్ మాత్రమైనా సాయం చేయలేదు. సాధారణంగా మంచి సినిమాలపై సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసే చిరు, ‘పుష్ప 2’ సినిమా ఎలా ఉంది అనే విషయంపై ఒక్క మాట మాట్లాడలేదు. ఇక సినిమా రిలీజ్ అయ్యి 1000 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి చరిత్రను సృష్టించింది. అయినప్పటికీ మెగా ఫ్యామిలీ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయింది.
కానీ తాజాగా అల్లు అర్జున్ ఇలా అరెస్ట్ అయ్యాడో లేదో డిప్యూటీ సిఎంఓ ఆంధ్ర ప్రదేశ్ అనే ట్విటర్ అకౌంట్ నుంచి ట్వీట్ వచ్చి పడింది. ఇక ఆ ట్వీట్ లో అల్లు అర్జున్ పేరును ఎక్కడా ప్రస్తావించకపోయినప్పటికీ, ఆయన చేసిన ట్వీట్ మాత్రం సంచలనంగా మారింది. “కలిసి ఉంటే స్ట్రాంగ్ గా నిలబడతాము, లేదంటే పడిపోతాము” అన్నట్టుగా ట్వీట్ చేశారు.
“United we stand, divided we fall” – @PawanKalyan#SwarnaAndhra2047#ViksitBharat2047
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) December 13, 2024
నిజానికి ఆ ట్వీట్ చేసింది అల్లు అర్జున్ అరెస్టు గురించి కానప్పటికీ, కొంతమంది మాత్రం దాన్ని బన్నీ అరెస్ట్ కి అనువదిస్తున్నారు. ఇక మరోవైపు అల్లు అర్జున్ అరెస్టు కావడం వెనక కుట్ర ఉందంటూ మండిపడుతున్నారు అభిమానులు. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ కారణంగా ఇటు మెగా ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఇప్పుడు రేవతి ఆత్మకు శాంతి చేకూరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ ను కలవడానికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలు దేరినట్టుగా తెలుస్తోంది. కానీ అంతలోనే పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్ కి రావద్దని అభ్యర్థించారని సమాచారం. ఇదిలా ఉండగా పోలీస్ స్టేషన్ కి నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్, అల్లు శిరీష్ తదితరులు ఇప్పటికే వెళ్లినట్టుగా సమాచారం. ఇక అల్లు అర్జున్ వేసిన క్యాష్ పిటిషన్ పై సాయంత్రం 4 గంటలకు హైకోర్టు విచారించనుంది.