BigTV English

SA BAN Fight: ఏంట్రా ఈ దౌర్జన్యం… సిక్స్ బాదాడని బ్యాటర్‌ను కొట్టిన బౌలర్

SA BAN Fight: ఏంట్రా ఈ దౌర్జన్యం… సిక్స్ బాదాడని బ్యాటర్‌ను కొట్టిన బౌలర్

SA BAN Fight: క్రికెట్ లో ( CRICKET) అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇందులో ఫన్నీ అలాగే సీరియస్ సంఘటనలు కూడా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. బౌలర్ వర్సెస్ బ్యాటర్ మధ్య ఫైట్ జరగడం… లేదా ఫీల్డర్ వర్సెస్ బ్యాటర్ మధ్య వివాదాలు జరుగుతూ ఉండడం సహజం. ఇక బౌలర్ వేసిన బంతికి.. బ్యాటర్ సిక్స్ లేదా ఫోర్ కొడితే… అక్కడ సీన్ సీరియస్ అవుతుంది. బౌలర్ వర్సెస్ బ్యాటర్ మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. అయితే తాజాగా.. తన బౌలింగ్లో సిక్స్ కొట్టాడని బ్యాటర్ను దారుణంగా కొట్టే ప్రయత్నం చేశాడు బౌలర్. ప్రస్తుతం ఈ సంఘటన వైరల్ గా మారింది.


ALSO READ: IPL 2025: ఏ జట్ల మధ్య క్వాలిఫైయర్, ఎలిమినేటర్… టైమింగ్స్, ఉచితంగా చూసే ఛాన్స్ 

సిక్స్ బాధడని బ్యాటర్ ను చితక్కొట్టిన బౌలర్


తన బౌలింగ్లో సిక్స్ ( SIX) బాదాడని బ్యాటర్ను… చితక్కొట్టాడు ఓ బౌలర్. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎమర్జింగ్ కప్ లో ( Emerging Cup ) భాగంగా సౌత్ ఆఫ్రికా A, బంగ్లాదేశ్ ఏ జట్ల మధ్య తాజాగా మ్యాచ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే… బౌలర్ అలాగే బ్యాటర్ మధ్య సంఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. బంగ్లా ఆటగాడు రిపోన్ సఫారీ బౌలర్ తులి బౌలింగ్లో స్ట్రైట్ సిక్స్ కొట్టేశాడు. ఆ బంతి వేగంగా వెళ్లి సిక్స్ గేట్ లో పడింది.

దీంతో.. బ్యాటర్తో గొడవకు దిగాడు బౌలర్ తులి (THULI). అతన్ని కొట్టబోయాడు. ఇంకేముంది బ్యాటర్ కూడా రెచ్చిపోయాడు. ఆ బౌలర్ పై తిరగబడ్డాడు. దీంతో ఇద్దరు మధ్య గొడ వ చాలా పెద్దదిగా మారింది. వెంటనే అక్కడ ఉన్న మిగతా ప్లేయర్లు, ఫీల్డ్ అంపైర్లు కలగజేసుకొని… ఇద్దరినీ విడదీసే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఆ ఇద్దరు తగ్గలేదు. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. చివరికి… ప్లేయర్ లందరూ వాళ్ళిద్దరిని విడదీయడంతో… వారి మధ్య గొడవ తగ్గింది.. మ్యాచ్ యధావిధిగా కొనసాగింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్… రకరకాలుగా స్పందిస్తున్నారు.

బౌలర్ పై సీరియస్ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్

సిక్స్ బాధడని బ్యాటర్ను కొట్టిన సంఘటనపై… క్రికెట్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. క్రికెట్ అన్నాక కచ్చితంగా సిక్సులు అలాగే ఫోర్లు పోతాయి. అప్పుడప్పుడు వికెట్లు కూడా పడతాయి. అలాంటప్పుడు బ్యాటర్లను హింసించకూడదని కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. అంతేకాదు ఇలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా బ్యాటర్ను కొట్టిన బౌలర్ తులి పైన యాక్షన్ తీసుకోనుంది ఐసీసీ.

ALSO READ: IND vs ENG Test Series : ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇదే.. ఉచితంగా ఎలా చూడాలి

 

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×