Tips For White Teeth: పళ్లు పసుపు రంగులోకి మారడం వల్ల ఇబ్బంది పడుతున్నారా ? అవును అయితే మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. పళ్లు రంగు మారితే కొన్ని హోం రెమెడీస్ సహాయంతో వాటిని క్షణాల్లోనే తెల్లగా మెరిసేలా చేయవచ్చు.ఈ హోం రెమెడీస్ ప్రత్యేకత ఏమిటంటే వీటిని మీ వంటగదిలో ఉన్న వస్తువుల నుండి తయారు చేసుకోవచ్చు. ఉప్పుతో కలిపి తయారు చేసుకునే ఎలాంటి పదార్థాలు పసుపు రంగులోకి మారిన పళ్లను తెల్లగా మెరిసేలా చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆవాల నూనె, ఉప్పు:
ఆవ నూనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. దీనిని ఉప్పుతో కలిపినప్పుడు.. దంతాల నుండి మురికి, పసుపు రంగు పూర్తిగా తొలగిపోతుంది.
ఎలా వాడాలి ?
ఈ హోం రెమెడీ కోసం మీకు అర టీస్పూన్ ఆవాల నూనె అవసరం. దీని తరువాత.. ఆవ నూనెలో చిటికెడు ఉప్పు కలపండి. ఈ మిశ్రమాన్ని మీ వేళ్లతో లేదా బ్రష్‌తో పళ్లపై 3 నిమిషాలు మెల్లగా రుద్దండి. ఆ తరువాత.. నీటితో శుభ్రం చేసుకోండి. ఇది వారానికి రెండుసార్లు చేయాలి.
2. నిమ్మరసం, ఉప్పు:
నిమ్మకాయలో ఉండే సిట్రిక్ ఆమ్లం పళ్లపై పసుపు రంగును తొలగించడంలో సహాయపడుతుంది. కానీ దీన్ని నేరుగా వాడటం వల్ల హాని కలుగుతుంది. కాబట్టి ఉప్పుతో కలపడం ముఖ్యం.
ఎలా వాడాలి ?
ముందుగా 1 టీస్పూన్ నిమ్మరసం తీసుకోండి. దీనికి చిటికెడు ఉప్పు కలపండి. అనంతరం దీనిని మీ టూత్ బ్రష్ కు అప్లై చేసి మీ పళ్లను శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఒక నిమిషం పాటు రుద్దండి. వెంటనే శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేయడం మెరుగైన ఫలితాలను అందిస్తుంది.
3. బేకింగ్ సోడా, ఉప్పు:
బేకింగ్ సోడా ఒక సహజమైన ఎక్స్‌ఫోలియేటర్. ఇది పళ్లపై నుండి మరకలను తొలగించి తెల్లగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.
Also Read: హోం మేడ్ హెయిర్ కలర్.. ఇది వాడితే తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం
ఎలా వాడాలి ?
అర టీస్పూన్ బేకింగ్ సోడా తీసుకోండి. అర టీస్పూన్ ఉప్పు కలపండి. కొంచెం నీరు కలిపి పేస్ట్ లా చేయండి. తర్వాత బ్రష్ తో మీ పళ్లపై సున్నితంగా శుభ్రం చేసుకోండి. 2 నిమిషాలు ఇలా చేస్తూ ఉండండి. తరువాత.. నీటితో శుభ్రం చేసుకోండి. దీనిని వారానికి ఒకసారి మాత్రమే వాడండి. దీనిిని వాడటం వల్ల తక్కువ సమయంలోనే పళ్లు తెల్లగా మారతాయి.
పళ్లను తెల్లగా మార్చుకోవడానికి ఖరీదైన శుభ్రపరిచే పదార్థాలు వాడాల్సిన అవసరం లేదు. కొంచెం శ్రద్ధ, కొంచెం జాగ్రత్త ఉంటే.. ఈ హోం రెమెడీస్ మీ చిరునవ్వును మళ్ళీ ప్రకాశింపజేస్తాయి. దంతాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. హోం రెమెడీస్ వాడటం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇవి మీ పళ్లకు తక్కువ సమయంలోనే తెల్లగా మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు.