Vande Bharat Sleeper Trains: భారతీయ రైల్వే సరికొత్త టెక్నాలజీని అందుపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు మరింత అప్ డేట్ అవుతోంది. గత దశాబ్దకాలంగా సంప్రదాయ రైళ్లకు భిన్నంగా సరికొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. అందులో భాగంగానే సరికొత్త సెమీ హైస్పీడ్ వందేభారత్ రైళ్లను పరిచయం చేసింది. ప్యాసింజర్లకు అత్యాధునిక సౌకర్యాలతో పాటు అత్యంత వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సుమారు 136 మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 5 వందేభారత్ రైళ్లు ప్రయాణీకులకు సేవలను అందిస్తున్నాయి.
వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ సక్సెస్
త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేదుకు రెడీ అవుతోంది రైల్వేశాఖ. సుదూర ప్రయాణాలు చేసే ప్రయాణీకులకు ఈ రైళ్లు మరింత ఆహ్లాకర అనుభవాన్ని అందించనున్నాయి. ఇప్పటికే వందేభారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించిన ట్రయల్ రన్ సైతం విజయవంతం అయ్యింది. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) తొలి వందే భారత్ స్లీపర్ రైలును ముంబై- అహ్మదాబాద్ మార్గంలో 540 కిలో మీటర్ల దూరం ట్రయల్ రన్ నిర్వహించింది. 16 కోచ్ లతో రైలు పరుగులు తీసింది.
త్వరలో అందుబాటులోకి వందే భారత్ స్లీపర్ రైలు
త్వరలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించేందుకు రైల్వేశాఖ రెడీ అవుతోంది. ట్రయల్ రన్ కు సంబంధించిన డేటాను ఇప్పటికే విశ్లేఇంచిన ఆర్‌డీఎస్‌ఓ తుది ధృవీకరణ పత్రాన్ని జారీ చేసింది. రైల్వే సేఫ్టీ కమిషనర్ రైలును గరిష్ఠ వేగాన్ని పరిశీలించారు. ఈ ఏడాది జనవరి తొలివారంలో రాజస్థాన్ లోని కోటాలో వందేభారత్ స్లీపర్ రైలుకు సంబంధించి ట్రయల్ రనన్స్ కొనసాగాయి. ఈ సమయంలో రైలు 180 కిలో మీటర్ల వేగంతో పరుగులు తీసింది. ప్రోటోటైప్ విజయవంతమైన ట్రయల్ రన్ పూర్తి చేసిందని రైల్వేశాఖ వెల్లడించింది. వందే భారత్ స్లీపర్ రైళ్లు రాత్రి ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయని వెల్లడించింది.
Read Also: 200 వందే భారత్ రైళ్లు, 17,500 జనరల్ కోచ్లు.. ఇండియన్ రైల్వే టార్గెట్ మామూలుగా లేదుగా!
ఈ ఏడాది 9 వందే భారత్ స్లీపర్ రైళ్లు రెడీ
ఇక అత్యాధునిక వందే భారత్ రైళ్లను మరిన్నింటిని రెడీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది తొమ్మిది వందే భారత్ ట్రైన్ సెట్స్ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్, డిసెంబర్ మధ్య ఐసీఎఫ్ ఈ రైళ్లను డెలివరీ చేయనున్నది. ఈ రైళ్లలో మూడు కేటగిరిలు ఉంటాయి. ఏపీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీ, ఏసీ త్రీ టైర్ అందుబాటులో ఉంటాయి. మొత్తం 1,128 బెర్తులు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. గత నెలలో భారతీయ రైల్వేశాఖ 24 వందే భారత్ స్లీపర్ రైలు 50 రేక్ ల కోసం ఆర్డర్ ఇచ్చింది. రాబోయే రెండేళ్లలో ఇవి రెడీ అయ్యే అవకాశం ఉంది. 2026-27 సంవత్సరంలో 24 ట్రైన్ సెట్స్ ఉత్పత్తి కాబోతున్నాయి. వందేభారత్ స్లీపర్ రైళ్లు భారతీయ రైల్వేను మరింత అత్యాధునికంగా మార్చానున్నాయి.
Read Also: వందేభారత్ లో అప్పటికప్పుడే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?