Sukumar: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న క్రియేటివ్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ తన కెరియర్ లో అద్భుతమైన సినిమాలు చేశారు. కొన్నిసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద సుకుమార్ సినిమాలు ఫెయిల్ అయినా కూడా వాటికి కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సుక్కు ఆలోచనలు ఎప్పుడూ తెలుగు ఆడియన్స్ ని సప్రైజ్ చేస్తూనే ఉంటాయి. ఇక ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు ప్రస్తావన వస్తే సుక్కు పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. ఎందుకంటే పుష్ప సినిమాతో అంతటి పెద్ద స్థాయి హిట్ అందుకున్నాడు సుకుమార్. నేను ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ను నమోదు చేసుకుంది. ఈ సినిమా వెనకాల ఎన్నో వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఊహించని ఘటనలు కూడా చాలా జరిగాయి.
అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో చాలా విషయాలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ గా మారింది. దేవి ఈ సినిమాను డీల్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్. ఎంతమంది దర్శకులతో దేవిశ్రీప్రసాద్ పనిచేసిన కూడా సుకుమార్ సినిమా అంటే దేవిశ్రీప్రసాద్ కి ఒక పూనకం వస్తుంది. సుకుమార్ సినిమాల్లో దేవి శ్రీ ప్రసాద్ అందించే సంగీతం ఎప్పటికీ ప్రత్యేకమైన చెప్పాలి. ఇప్పటివరకు సుకుమార్ దర్శకుడుగా చేసిన ప్రతి సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఇదే విషయాన్ని మరోసారి ఉన్న జరిగిన థాంక్స్ మీట్ లో దర్శకుడు సుకుమార్ కూడా గుర్తు చేసుకున్నాడు.
సుకుమార్ మాట్లాడుతూ నా పేరు ఓన్లీ సుకుమార్ కాదు. నా పేరు దేవి శ్రీ ప్రసాద్ సుకుమార్ అంటూ తెలిపారు. ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. దేవిశ్రీప్రసాద్ లేకుండా నేను ఇప్పటివరకు ఒక సినిమా కూడా చేయలేదు. ఇక పైన కూడా దేవిశ్రీప్రసాద్ లేకుండా సినిమాను చేయనేమో అంటూ సుకుమార్ తెలిపారు. ఇకపోతే పుష్ప విషయంలో మరి కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ పని చేసినట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి అయితే కొన్ని సీన్స్ కి సంబంధించి అడిషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గా శ్యామ్ సిఎస్ ను వాడుకున్నారు. ఆ తరుణంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి కూడా చెన్నైలో జరిగిన ఒక ఆడియో ఫంక్షన్ లో ఈ సినిమాకి ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్ కి మ్యూజిక్ కంపోజ్ చేశాను అని క్యాజువల్ గా చెప్పిన మాటలు కూడా వైరల్ గా మారాలి. ఏదేమైనా ఈరోజు సుకుమార్ మాట్లాడిన స్పీచ్ తో మరోసారి వాళ్ళ బాండింగ్ ఏంటో చాలామందికి తెలిసి వచ్చింది.
Also Read: Thandel Day 2 Collections: రెండో రోజు ‘తండేల్’ జోరు.. ఎన్ని కోట్లంటే..?