BigTV English

Vande Bharat vs Telangana Express: సికింద్రాబాద్ to ఢిల్లీ.. తెలంగాణ ఎక్స్ ప్రెస్, వందే భారత్ స్లీపర్ లో ఏది బెస్ట్? ఏది ఫాస్ట్?

Vande Bharat vs Telangana Express:  సికింద్రాబాద్ to ఢిల్లీ.. తెలంగాణ ఎక్స్ ప్రెస్, వందే భారత్ స్లీపర్ లో ఏది బెస్ట్? ఏది ఫాస్ట్?

BIG TV LIVE Originals: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీకి ప్రస్తుతం తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులో ఉంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి న్యూఢిల్లీకి చేరుకుంటుంది. త్వరలో ఈ మార్గంలో వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రాబోతోంది. ఒకవేళ ఆ రైలు అందుబాటులోకి వస్తే.. రెండు రైళ్ల మధ్య ప్రయాణ సమయం, సౌకర్యాలు, టికెట్ల ధరల్లో వ్యత్యాసం ఎలా ఉంటుంది? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


తెలంగాణ ఎక్స్‌ప్రెస్ వర్సెస్ వందేభారత్ స్లీపర్

⦿ తెలంగాణ ఎక్స్‌ ప్రెస్ (12723/12724)


ఈ రైలు హైదరాబాద్ (సికింద్రాబాద్)- న్యూఢిల్లీ మార్గాల్లో నడుస్తుంది. ఈ రైలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల మీదుగా ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ రైలు హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి చేరుకోవడానికి సుమారు 27 గంటల సమయం పడుతుంది.

సౌకర్యాలు, టికెట్ ధరలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ కోచ్ లు అందుబాటులో ఉన్నాయి.  సాధారణ ఎక్స్‌ ప్రెస్ రైలు కాబట్టి, సౌకర్యాలు ప్రాథమిక స్థాయిలో ఉంటాయి. పాన్‌ ట్రీ కార్, సాధారణ టాయిలెట్ సౌకర్యాలు ఉంటాయి. స్లీపర్, ఎసి కోచ్‌లలో బెడ్‌ రోల్ సౌకర్యం ఉంటుంది. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే, స్లీపర్ క్లాస్: సుమారు రూ.700- రూ. 900 ఉంటుంది. ఎసి 3-టైర్ ధర రూ. 1,800- రూ. 2,200, ఎసి 2-టైర్ ధర రూ. రూ.2,500- రూ.3,000. ఫస్ట్ ఏసీ ధర రూ. 4,000- రూ. 5,000 ఉంటాయి. ఈ రైలు ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది.

⦿ వందే భారత్ స్లీపర్

ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి నేరుగా వందేభారత్ సర్వీసు లేదు. కానీ, త్వరలో 800 నుంచి 1200 కి. మీ రేంజ్ లో వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది రైల్వేశాఖ.  సికింద్రాబాద్-ఢిల్లీ దూరం సుమారు 1,660 కి.మీ ఉన్న నేపథ్యంలో ఈ మార్గంలో లో వందే భారత్ స్లీపర్ సర్వీసు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వందే భారత్ స్లీపర్ రైళ్లను 800 నుంచి 1,200 కి.మీ రేంజ్ రూట్ లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ ప్రయాణానికి సుమారు 20 గంటల సమయం పట్టనుంది.

సౌకర్యాలు, టికెట్ ధరలు

న్యూఢిల్లీ నుండి సికింద్రాబాద్ వరకు నడిచే వందే భారత్ స్లీపర్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. వాటిలో 11 AC 3 టైర్ కోచ్‌లు, 4 AC 2 టైర్ కోచ్‌లు, 1 ఫస్ట్ క్లాస్ AC కోచ్ ఉంటుంది. AC 3-టైర్ కోచ్‌లో ప్రయాణించడానికి ఛార్జీ దాదాపు రూ. 3600, AC 2-టైర్ కోచ్ దాదాపు రూ. 4800, AC ఫస్ట్ క్లాస్ దాదాపు రూ. 6000 ఉంటుందని అంచనా. ఇక ఈ రైళ్లు వారంలో 6 రోజులు నడవనున్నాయి.

వందేభారత్ స్లీపర్ రైలుతో ప్రయోజనాలు

సికింద్రాబాద్-న్యూఢిల్లీ మధ్య ప్రయాణం కేవలం 20 గంటల్లో ముగుస్తుంది.  ఆధునిక, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం కలుగుతుంది. తక్కువ స్టాప్‌లు, వేగవంతమైన ప్రయాణం ఉంటుంది.  కానీ, ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోల్చితే సుమారు 4 రెట్లు అధిక ఛార్జీలు ఉంటాయి. సికింద్రాబాద్-ఢిల్లీ మార్గంలో వందే భారత్ స్లీపర్ సర్వీసు ప్రారంభమైనట్లయితే, తెలంగాణ ఎక్స్‌ ప్రెస్ కంటే వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

Read Also: ఇండియన్ రైల్వేలోకి కొంకణ్ రైల్వే విలీనం.. ఇన్నాళ్లూ అది ప్రత్యేకంగా ఎందుకు ఉంది?

Related News

Trains cancelled: 68 రైళ్లు రద్దు, 24 తిరిగి ప్రారంభం.. ఆ లైన్ లో ఊరట కలిగించిన రైల్వే ప్రకటన..!

Railways TC: అబ్బా.. ఎవరీ హ్యాండ్సమ్.. నెట్టింట వైరల్ అవుతున్న రైల్వే టీసీ వీడియో!

New Visa Rules: వీసా నిబంధనలు మరింత కఠినతరం, ఇక ఆ దేశానికి వెళ్లడం అంత ఈజీ కాదు!

Special Trains: పండుగ సీజన్ కోసం మరో 150 ప్రత్యేక రైళ్లు, ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్!

Metro news 2025: ఆ నగరానికి బూస్ట్.. రూ.15,906 కోట్ల భారీ మెట్రో ప్రాజెక్ట్.. ఇక జర్నీ చాలా సింపుల్!

Heartwarming Story: దుబాయ్ లో ఫోన్ పోగొట్టుకున్న ఇండియన్ యూట్యూబర్, సేఫ్ గా ఇంటికి పంపిన పోలీసులు!

Big Stories

×