Decoit Glimps: ప్రముఖ యంగ్ హీరో అడివి శేష్ (Adivi Shesh) హీరోగా రూపొందుతున్న చిత్రం డెకాయిట్ (Decoit). యాక్షన్ డ్రామా గా రాబోతున్న ఈ సినిమా ‘ఒక ప్రేమ కథ’ అనే ట్యాగ్లైన్ తో రాబోతోంది. మృణాల్ ఠాగూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. అనురాగ్ కశ్యప్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. అడివి శేష్ ఈ చిత్రానికి కథా, స్క్రీన్ ప్లే అందించగా షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ఊహించని రెస్పాన్స్ లభించింది..
డెకాయిట్ మూవీ నుంచీ గ్లింప్స్ డేట్ ఫిక్స్..
తాజాగా ఈ మూవీ నుండీ గ్లింప్స్ ను మే 26న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తాజాగా మృనాల్ ఠాకూర్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. ఇక ఎదురు చూడలేక పోతున్నాను అంటూ కారు దిగి మృణాల్ పారిపోతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదే విషయాన్ని మరొకవైపు అడివి శేష్ కూడా తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ గ్లింప్స్ పై ఆసక్తి పెంచుతుంది. ఇందులో శేష్ ఇంటెన్స్ లుక్ లో దూరంగా ట్రైన్, కారు ఫైర్ ఆక్సిడెంట్ ని చూస్తూ వెనకనుంచి కనిపించడం మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. మొత్తానికైతే హీరో, హీరోయిన్ ఇద్దరూ కూడా గ్లింప్స్ పై సరికొత్త హైప్ క్రియేట్ చేసారు.
డెకాయిట్ స్టోరీ..
ఇద్దరూ మాజీ ప్రేమికులు వారి జీవితాలను మార్చే లక్ష్యంలో వరుసగా దోపిడీలకు పాల్పడానికి బలవంతంగా కలిసి పని చేయాల్సి వస్తుంది. ఇకపోతే భారీగా ఈ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయంపై ఇంకా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు..ఇకపోతే ఈ సినిమాలో ముందుగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు కొన్ని రోజులు శృతిహాసన్ ఈ సినిమాలో నటింపచేసింది. అయితే చిత్ర బృందానికి, శృతిహాసన్ కి మధ్య విభేదాలు రావడంతో శృతిహాసన్ అనూహ్యంగా సినిమా నుండి తప్పుకుంది.ఆ స్థానంలోకి మృనాల్ వచ్చి చేరింది. ప్రస్తుతం ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై అంచనాలు నెలకొన్నాయి పైగా అడవి శేషు అంటే థ్రిల్లర్, యాక్షన్, సస్పెన్స్ చిత్రాలకు పెట్టింది పేరు. ఇప్పుడు ఈయన నుంచి వచ్చే ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరొకవైపు శృతిహాసన్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా ఇటు అడవి శేషు కూడా ఈ సినిమా తర్వాత గూడచారి 2 లో నటించబోతున్నారు. ఇప్పుడు డెకాయిట్ తో త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యారు.
Nani New Movie : హిట్‌తో పాటు మరో సినిమాటిక్ యూనివర్స్‌లో నాని… ఈ సారి పరభాష మూవీ