BigTV English

Weight Loss Plan: ఇలా చేస్తే.. 10 రెట్ల వేగంగా వెయిట్ లాస్ !

Weight Loss Plan: ఇలా చేస్తే.. 10 రెట్ల వేగంగా వెయిట్ లాస్ !

Weight Loss Plan: ప్రస్తుతం చాలా మంది అదిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా పెరిగిన బరువుతో సతమతం అవుతున్నారు. ఇదిలా ఉంటే బరువు పెరగడానికి మారిన జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లు కారణాలు. ఏది ఏమైనా పెరిగిన బరువును తగ్గించుకోవడం సవాల్ అనే చెప్పాలి. కొంతమంది అధిక బరువు తగ్గించుకోవడానికి వర్కౌట్స్ చేస్తుంటారు. మరికొంతమంది ఇంట్లోనే వ్యాయామాలు చేస్తూ పక్కా డైట్ ఫాలో అవుతుంటారు. అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కొన్ని రకాల టిప్స్ పాటించడం ద్వారా ఈజీగా బరువు తగ్గొచ్చు.


10 రెట్లు వేగంగా అధిక బరువును తగ్గించుకోవచ్చు. బరువు తగ్గడానికి, కేవలం తక్కువగా తినడం, నడవడం మాత్రమే ప్రత్యామ్నాయం కాదు. కొన్ని ఇతర విషయాలపై కూడా మనం దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.
పది రెట్లు వేగంగా బరువు తగ్గించే అలవాట్లు, వేగంగా బరువు తగ్గడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు తగ్గాలంటే ఏం చేయాలి ?


శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి , అనేక తీవ్రమైన వ్యాధులను నివారించడానికి, బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. అధిక బరువు మధుమేహం, గుండె జబ్బులు , జీవక్రియకు సంబంధించిన అనేక వ్యాధులను పెంచుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ బరువును అదుపులో ఉంచుకోవడానికి నిరంతరం కృషి చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బరువు తగ్గడం నిజంగా అంత సులభమా ?

బరువు తగ్గడానికి చాలా మంది జిమ్‌లో గంటల తరబడి చెమటలు పట్టడం దగ్గర్నుంచి డైటింగ్, రకరకాల డైట్ ప్లాన్‌లు పాటించడం వరకు చాలా చేస్తుంటారు. కానీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొంతమందికి ఎలాంటి లాభం ఉండదు

బరువు తగ్గండిలా !

1. మంచి నిద్ర చాలా ముఖ్యం:

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి , బరువు తగ్గడానికి శారీరక ప్రయత్నాలను కొనసాగించడం సరికాదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శరీరానికి విశ్రాంతి , తగినంత నిద్ర చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ రాత్రి 7-9 గంటలు నిద్ర పోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.రాత్రి నిద్ర బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది.

నిద్రించడానికి నిర్ణీత సమయాన్ని సెట్ చేసుకోండి. మంచిగా నిద్ర పోవడానికి పాలలో చియా సీడ్స్ తో సాటు పసుపు కలిపి త్రాగడం మంచిది. నిద్రించడానికి గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ వంటివి ఉపయోగించవద్దు.

2. శరీరానికి విశ్రాంతి ఇవ్వండి:
మీరు వ్యాయామం చేయడం లేదా ద్వారా పరిగెత్తడం ద్వారా బరువు తగ్గుతారని అనుకుంటే మాత్రం మీరు పొరపాటు చేసినట్లే అవుతుంది.
కండరాలు కోలుకోవడానికి వారానికి 1-2 రోజులు విశ్రాంతి తీసుకోండి. మీ శరీరాన్ని చురుకుగా ఉంచుకోండి. సాధారణ నడక లేదా యోగా చేయడంతో పాటు పోషకాహారం తీసుకోవడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. అంతే కాకుండా ఇలా చేయడం ద్వారా బరువు కూడా పెరిగేందుకు అవకాశాలు ఉండవు.

3. క్యాలరీలను తీసుకోవడంపై శ్రద్ధ వహించండి:

ఫిట్‌గా ఉండటానికి సులభమైన సూత్రం మీరు రోజువారీ తీసుకునే దానికంటే ఎక్కువ కేలరీలు బర్న్ చేయడం. చాలా మంది వారాంతాల్లో ఆహారం విషయంపై అంత శ్రద్ద తీసుకోరు.చిప్స్‌కు బదులుగా ఇంట్లో తయారుచేసిన పాప్‌కార్న్, డెజర్ట్‌కు బదులుగా డార్క్ చాక్లెట్ , చక్కెర పానీయాలకు బదులుగా పండ్ల రసాలను ప్రయత్నించండి. ప్రోటీన్-రిచ్ అల్పాహారం కోసం, కాల్చిన మఖానా లేదా పనీర్ తినండి. బరువు తగ్గడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

Also Read: 30 ఏళ్లు దాటాయా ? ఈ సమస్యలు తప్పవు

4. ఒత్తిడిని తగ్గించుకోండి:

ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వ్యక్తులు కూడా బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ఒత్తిడిని మేనేజ్ చేయడం చాలా ముఖ్యం. రోజు తప్పకుండా కొంత సమయం నడవడం అలవాటు చేసుకోండి. అంతే కాకుండా మీ ఆహారంలో గ్రీన్ టీ, బచ్చలికూర, వాల్‌నట్స్ తో పాటు గుమ్మడి గింజలు వంటి ఒత్తిడిని తగ్గించే ఆహారాలను చేర్చండి. ఒత్తిడిని తగ్గించడానికి, కెఫిన్ తీసుకోవడం తగ్గించండి. మీ మనస్సును ప్రశాంతపరిచే విషయాలపై దృష్టి పెట్టండి.

 

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×