BigTV English

Rain Report Cafe: ఈ కేఫ్ లో 15 నిమిషాలకు ఓసారి వర్షం, కాఫీ తాగాలంటే రెయిన్ కోట్ వేసుకోవాల్సిందే!

Rain Report Cafe: ఈ కేఫ్ లో 15 నిమిషాలకు ఓసారి వర్షం, కాఫీ తాగాలంటే రెయిన్ కోట్ వేసుకోవాల్సిందే!

Rain Report Cafe Ceoul: నలుగురిలో నారాయణలా కాకుండా, యూనిక్ గా ఆలోచించాలి అంటారు పెద్దలు. ఆలా ఆలోచించినప్పుడే అసలైన సక్సెస్ వస్తుందంటారు. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అనేది ఎప్పటికైనా క్రేజీనెస్ తీసుకొస్తుంది. అలాంటి ఆలోచనలకు అందరూ ఫిదా అవుతారు. అచ్చంగా ఇలాంటి పద్దతి ఫాలో అయ్యాడు సౌత్ కొరియాలో ఓ యువకుడు. క్రేజీగా ఉండే కేఫ్ ను ఓపెన్ చేశాడు. ఇప్పుడు ఆ కేఫ్ సౌత్ కొరియాలో బాగా పాపులర్ అయ్యింది. ఇంతకీ ఈ కేఫ్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం..


ప్రతి 15 నిమిషాలకు ఓసారి వర్షం

సౌత్ కొరియా రాజధాని సియోల్ లో కొద్ది నెలల క్రితం రెయిన్ రిపోర్ట్ కేఫ్ అనేది ప్రారంభం అయ్యింది. ఇక్కడ ప్రతి 15 నిమిషాలకు ఓసారి కృత్రిమంగా వర్షం కుస్తుంది. ఈ కేఫ్ లోకి అడుగు పెట్టే వాళ్లకు ముందుగానే కేఫ్ సిబ్బంది గొడుగులు, రెయిన్ కోట్ లు, రబ్బర్ షూ అందిస్తారు. లోనికి వెళ్లాక వాటిని పక్కన పెడతారు. మళ్లీ బయటకు వచ్చేటప్పుడు వేసుకుంటారు. వర్షం పడుతుంటే, వేడి స్నాక్స్ తింటూ, ఆహా అనిపించే కాఫీ తాగుతుంటే మస్త్ మజా వస్తుంది. అచ్చంగా ఇదే కాన్సెప్ట్ తో ఈ కేఫ్ ను ఏర్పాటు చేశారు. ఈ కేఫ్ థీమ్ అంతా వర్షం చుట్టే తిరుగుతుంది. లోపల, బయట అంతటా  వర్షం అంశాలే కనిపిస్తాయి. కేఫ్ లో ఏర్పాటు చేసిన స్క్రీన్ల మీద కూడా వెదర్ అప్ వివరాలే  వస్తుంటాయి.


రెయిన్ రిపోర్ట్ కేఫ్ వెరీ వెరీ స్పెషల్

ప్రస్తుతం సియోల్ నగరంలో ఈ రెయిన్ రిపోర్ట్ కేఫ్ బాగా ఫేమస్. నిత్యం ఇక్కడికి వందలాది మంది వచ్చి ఆ వెదర్ ను ఎంజాయ్ చేయడంతో పాటు నచ్చి ఫుడ్ తిని వెళ్తున్నారు. రెయిన్ రిపోర్ట్ కేఫ్ దాదాపు పూర్తిగా నలుపు రంగులో డిజైన్ చేశారు. చుట్టూ వెదురు కర్రలతో అలంకరించారు. ఇక్కడ వర్షం పడుతుంటే నిజంగా సియోల్ వెలుపల ఎక్కడో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. బయట వెదర్ కండీషన్ తో సంబంధం లేకుండా ఇక్కడ ప్రతి పావు గంటకు ఓసారి వర్ష కురుస్తుంది. ఈ వర్షాన్ని చూస్తూ, కాఫీ తాగుతూ చాలా మంది కస్టమర్లు ఇక్కడ రిలాక్స్ అవుతుంటారు.

మే 2024లో రెయిన్ కేఫ్ ప్రారంభం

యూనిక్ ఐడియాతో రూపొందిన రెయిన్ కేఫ్ ఈ ఏడాది మేలో ప్రారంభం అయ్యింది. ఈ స్పెషల్ కేఫ్ ను సోషల్ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్స్ బాగా ప్రమోట్ చేశారు. ఒకే ఒక్క నెలలో సియోలో లో బాగా పాపులర్ అయ్యింది. సౌత్ కొరియా అంతటా ఈ కేఫ్ గురించి తెలిసిపోయింది. ఇక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా యువత తరలి వస్తున్నారు.  ప్రస్తుతం సౌత్ కొరియాలో ఈ రెయిన్ రిపోర్ట్ కేఫ్ గురించి తెలియని వారు లేరంటే ఏ స్థాయిలో పాపులర్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

Read Also:4 గంటల్లో 15 లీటర్ల మద్యం ఖాళీ, మరీ ఇంత కరువులో ఉన్నారేంట్రా అయ్యా!

Related News

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Big Stories

×